9, నవంబర్ 2015, సోమవారం

సూకి ఘన విజయం

                                                                
  ఓటమిని అంగీకరించిన పాలక పక్షం
                      యాంగాన్‌/హింతాడా(మయన్మార్‌): మయన్మార్‌లో ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోబెల్‌ శాంతిబహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి) 95 శాతం స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో విజయపథంలో దూసుకు పోతోంది.  కడపటి సమాచారం అందే సమయానికి ప్రకటించిన 45 స్థానాలో 43 స్థానాను ఎన్‌ఎల్‌డి కైవసం చేసుకుంది.  యాంగాన్‌ ప్రాంతంలోని 12 స్థానాలకుగాను పన్నెండిరటినీ  ఎన్‌ఎల్‌డి  గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మూడిరట రెండొంతు లు  మెజార్టీకన్నా మించి స్థానా లు సూకీ పార్టీకి లభించనున్నాయి. ఇంతవరకు ప్రకటించిన వాటిలో 70 శాతానికి పైగా స్థానాలు ఆ పార్టీ ఖాతాలో జమ అయ్యాయి.    దేశాధ్యక్ష స్థానంపై ఆశలు పెట్టు కున్న ప్రస్తుత పార్లమెంట్‌ స్పీకర్‌ షా మాన్‌ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.   ఫలితం  వెల్లడి కాక ముందే ఆయన తన ఓటమిని ఫేస్‌బుక్‌ ద్వారా అంగీకరిం చటం విశేషం.  పూర్తి ఫలితాలు (2015 nov-9)మంగళవారం ఉదయం 6-30 గంటలకు పూర్తి పలితాలు వెలువడుతాయని భావిస్తున్నట్లు షామాన్‌ కుమారుడు టోనైంగ్‌ మాన్‌ చెప్పారు.  ఫలితాల ధోరణి ఇప్పటికే కన్పిస్తున్నందున తన తండ్రి ముందుగానే ఎన్‌ఎల్‌డికి అభినందను తెలియచేశారని ఆయన వివరించారు. ఇదిలా వుండగా పాలక పక్షం యూనియన్‌ సోలిడారిటీ అండ్‌ డెవలెప్‌మెంట్‌ పార్టీ (యుఎస్‌డిపి) నేత హ్తే తమ ఓటమిని అంగీకరించారు. హ్తే ఊ ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం   వెల్లడించారు  సోమవారం ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది. 
                                                                     తొందరపడొద్దన్న సూకీ
                   పూర్తి ఫలితాలను అధికారికంగా ప్రకటించేంతవరకు 'సం యమనం పాటించాలని ఆంగ్‌సాన్‌ సూకీ తన పార్టీ సహచరులకు, మద్దతుదారులకు  విజ్ఞప్తి చేశారు.  తమ పార్టీ ఎటువంటి వివక్షకూ తావివ్వని రీతిలో దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తుందని ఆమె చెప్పారు.  ఈ ఎన్నికల్లో యుఎస్‌డిపి తరపున 1,122 మంది, ఎన్‌ఎల్‌డిపి తరపున 1,123 మంది బరిలో నిలిచారు.  మూడంచెల ఈ పార్లమెం టరీ ఎన్నికల్లో మొత్తం 90 రాజకీయ పార్టీలకు చెందిన 6,038 మంది అభ్యర్ధులు , 310 మంది స్వతంత్ర అభ్యర్ధులతో సహా దాదాపు వెయ్యిమందికి పైగా పోటీ పడ్డారు.
                                                           మయన్మార్‌ రాజకీయ   ఘటన క్రమం
                1988లో నాటి బర్మాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, రాజ కీయ అణచివేతపై నిరసనలు వెల్లువెత్తాయి.  దీనిపై స్పందిం చిన సైన్యం అణచివేతలో భాగంగా దాదాపు 3 వేల మందిని హతమార్చింది. సూకీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
           1990: సూకీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా సైన్యం దానిని అంగీకరించలేదు.  అణచివేతను మరింత ఉధృతం చేసిన సైన్యం సూకీని గృహనిర్బంధంలో వుంచింది.
                1991: గృహనిర్బంధంలోనే సూకీకి నోబుల్‌ శాంతి బహుమతి లభించింది.
                2005: దేశ కొత్త రాజధానిగా మారుమూ ప్రాంతంలోని నేపిటా నగరాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
             2007: కాషాయ విప్లవం పేరుతో బౌద్ధ సన్యాసుల నిరసన ప్రదర్శన నిర్వహించారు.  వీటిని అణచివేసేందుకు సైనిక ప్రభుత్వం మరింత హింసాకాండకు ప్పాడిరది.
        2010: పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో సైనిక మద్దతుతో తాము విజయం సాధించినట్లు యుఎస్‌డిపి ప్రకటించింది. ఎన్‌ఎల్‌డితో సహా అనేక ఇతర పార్టీ లు ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు నిరాకరించాయి.  ఎన్నిక లు జరిగిన వారంలోపే సూకీని ప్రభుత్వం గృహనిర్బంధం నుండి విడుద చేసింది.
             2011: అందరినీ ఆశ్చర్యపరుస్తూ సైనిక ప్రభుత్వం తన అధికారాను మాజీ సైనికాధికారి థీన్‌సీన్‌ నేతృత్వంలోని పాక్షిక పౌర ప్రభుత్వానికి అప్పగించింది.  ఆయన చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రాథమిక హక్కును పునరుద్ధరించటంతో పాటు ఆంక్షను కూడా ఎత్తివేశారు.  అనేక మంది రాజకీయ ఖైదీలను విడుదల చేశారు.
            2012: పార్లమెంట్‌ లోని 45 స్థానాకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి 43 స్థానాల్లో విజయం సాధించింది. సూకీ ఎంపిగా ఎన్నికయ్యారు.  అమెరికా, ఐరోపా తదితర దేశాలు మయన్మార్‌పై ఆంక్ష తగింపు ప్రారంభించాయి.  అయితే పశ్చిమ ప్రాంతంలోని రఖినే రాష్ట్రంలో ఎక్కువగా వున్న రోహింగ్యా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింసాకాండ చెలరేగింది.

కామెంట్‌లు లేవు: