18, నవంబర్ 2010, గురువారం

'తండ్రి తవ్విన నుయ్యిని దూకుతామా'


ఎదుటి వ్యక్తుల మీద ఎంత ప్రేమాభిమానాలున్నా ఎంతవరకు ప్రకటించాలో అంతవరకే ప్రకటించాలని మితిమీరితే ప్రమాదమని చెప్పడానికి తెలుగులో ఈ జాతీయం వచ్చింది. ఒక వ్యక్తికి అతడి తండ్రంటే ఎంతో ఇష్టమట. ఆ తండ్రి ఓ నుయ్యిని (బావి) తవ్వించాడట. అది నిండుగా నీటితో ఉండేదట. కొంత కాలానికి తండ్రి పోయాడట. తరువాత తనతండ్రి తవ్వించిన నుయ్యిమీద పుత్రుడికి మమకారం పెంచుకున్నాడట. దాంతో ఆబావిలోకి దూకి దాన్నంతా తన సొంతమని అందరికీ తెలియచెబుదామనుకున్నాడట. అయితే నిజంగా అలాగే జరిగితే అదెంత ప్రాణాంతకమో ఎవరైనా ఊహించవచ్చు. ఆ పుత్రుడిలాగా ఎవరైనా మితిమీరిన ప్రేమతో ప్రవర్తిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకునే సందర్భాలలో ఈప్రయోగం కనిపిస్తుంది. అలాంటి పుత్రులు ఈ కాలంలో వివిధ రంగాలలో కనిపిస్తున్నారు. రాజకీయాల్లో ఎక్కువగా కనిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: