12, మే 2013, ఆదివారం

టివి 9 సిఈఓ రవిప్రకాష్‌ పై జర్నలిస్టు దాడి

                         
ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ టివి 9 సీఈఓ రవిప్రకాష్‌ పై జర్నలిస్టు రమణ దాడి చేసారు. కర్నూలు నగర శివారులో 2009 వరదల్లో ముంపునకు గురయిన బాధితుల కోసం టివి 9 సౌజన్యంతో రెండోదశ ఇళ్లు నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీడుగా ప్రారంభించేందుకు 2013 మే 12న టివి 9 ఏర్పాట్లును చేసింది. సిఎం రాకకు రెండుగంటలు ముందు కాలనీ వద్ద టివి 9 సిఈఓ రవిప్రకాష్‌ లైవ్‌లో మాట్లాడుతున్నారు. ' సమాజంలో అవీనీతి అక్రమాలు, ముఠా రాజకీయాల ప్రాబల్యం నష్టం కలిగిస్తున్నాయి. అభివృద్ది కుంటుపడుతుంది. టివి 9 వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది' అని అన్నారు. ఆ మాటలు వినగానే గతంలో టివి9లో జర్నలిస్టుగా పనిచేసిన రమణ అవీనితి గురించి మాట్లాడే అర్హత నీకులేదంటూ ముందుకు వచ్చారు. చెప్పు తీసుకొని నేరుగా వెళ్లి రవిప్రకాష్‌ మొహంపై కొట్టాడు. ఈ హఠాత్తు పరిణామానికి షాక్‌కుగురయిన టివి 9 సిబ్బంది రమణను పక్కకు ఈడ్చుకెళ్లి విచక్షణా రహితంగా చితకబాదారు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుని రమణను తమ అదుపులోకి తీసుకోవడంతో వివాదం సర్దుమణిగింది. రమణపై పోలీసులు కేసు నమోదు చేశారు. రమణ కొంతకాలంగా రవిప్రకాష్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని, మాటలకు చేతలకు పొంతన లేదని ప్రచారం చేస్తున్నారు.
దాడులకు భయపడం: రవిప్రకాష్‌
             తాము చేస్తున్న సమాజిక సేవా కార్యక్రమాలను చూసి ఓర్వలేని కొందరు ఫ్యాక్షనిస్టుల అనుచరులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని టివి9 సిఇఓ రవిప్రకాష్‌ అన్నారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షనిజం పూర్తిగా అంతమయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

6 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

>గతంలో టివి9లో జర్నలిస్టుగా పనిచేసిన రమణ అవీనితి గురించి మాట్లాడే అర్హత నీకులేదంటూ ముందుకు వచ్చారు. చెప్పు తీసుకొని నేరుగా వెళ్లి రవిప్రకాష్‌ మొహంపై కొట్టాడు

ఇటువంటివి అనాలోచితమైన, బాధ్యతారహితమైన, విచారకరమైన సంఘటనలు.

రవిప్రకాష్‌ను అవినీతిపరుడని అనుకుంటున్నట్లయితే, తనవద్ద సాక్ష్యాధారాలు ఉంటే నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్ళవచ్చును కదా? ఇటువంటి పిచ్చిపనులు చేయటం ఏమిటి?

కాదూ రమణ తెలివైన వాడే అనుకుంటే, అది అతితెలివి అన్నమాట. జనం అంతా యేదో‌విషయం ఉండే ఉంటుంది అనుకునేలా చేయాలని దురూహ అన్నమాట.

jaya చెప్పారు...

రవిప్రకాష్ ఏమీ జెన్యూన్ కాదులెండి. ఐనా టీవీ9 సిబ్బంది రమణను చితకబాదొచ్చా?

శ్యామలీయం చెప్పారు...

>రవిప్రకాష్ ఏమీ జెన్యూన్ కాదులెండి.
అలా అనిపించినంత మాత్రాన దాడి సమర్థనీయమౌతుందా? కాదుకదా?

>ఐనా టీవీ9 సిబ్బంది రమణను చితకబాదొచ్చా?
ముమ్మాటికీ అలా చేయకూడదు.

మయూఖ చెప్పారు...

అలా జరగడం తప్పే.కానీ తమకు జరిగిన అన్యాయానికి ప్రజాస్వామ్య యుతంగా ఈ వ్యవస్థలలో తగిన న్యాయం జరగనప్పుడే , ప్రజాస్వామ్యం లోని అన్ని దారులు మూసుకు పోయిన తర్వాతే ప్రజలు చాలా మటుకు ఇలా ప్రవర్తిస్తారు.ఇప్పుడు మన రాష్త్రమ్లో తమ తప్పులు పబ్లిక్గా కనిపిస్తున్నా కూడా ఇతరుల అవినీతి గురించి చెబుతూ,చాలా మంది నీతులు చెబుతున్నారు.చాలా మంది ప్రజల అభిప్రాయం కూడా అదే!కొంత మంది ఉక్రోషం పట్టలేరు.నిత్యం ప్రజాస్వామ్యం గురించి ,ఫ్యాక్షనిజం గురించి నీతులు చెప్పేవాల్లు తమ మీద దాడి జరగగానే ,నిందితుని పోలీసులకు పట్టివ్వకుండా,తమకు అప్పగించమని కోరడం ఏ ప్రజాస్వామ్యమ్లో భాగమో!ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే తమ లోపలి మనిషి బయటకు వచ్హేది.ఇన్ని రోజుల తరబడి చెప్పిన నీతులు ఏమయ్యాయో?

Ayyagari Surya Nagendra Kumar చెప్పారు...

janAlu inkA TV9, Sakshi chustunnArantArA.. emO mari sanchalanAlaki, kArToonlaki alavATupaDDavAru, uMTAru kadA ...

ఈతరం చెప్పారు...

అయినా టివి 9 వారు అన్యాయం మీద ఎప్పుడు పోరాడారు??

అన్ని టివి చానెల్స్ రాజకీయ నాయకుల వంత పాడుతున్నాయి.

టివి 9 లో ఉద్యోగులని తీసేసిన గొప్ప చరిత్ర ఉంది.

నీతి మాటలు మట్లాడటం అందరికి చాలా అరుదైన విషయం, ఆచరణ లో శూన్యం.