24, నవంబర్ 2010, బుధవారం

కుల, ధనబలం ముందు ఓడిన రోశయ్య

కులబలం, ధనబలం, పెచ్చుమీరిన అవినీతి ముందు రోశయ్య నిజాయితీ ఓడి పోయింది. ప్రజలకు సేవచేయడానికి రాజకీయాలను ఎంచుకుంటారని ఒకప్పటి మాట. కాని డబ్బు సంపాధించుకోవడమే పరమావదిగా మారింది. ఈ క్రమంలో కొద్దోగొప్పో విలువలకు కట్టుబడి ఉన్న రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి ముళ్లకిరీటమయింది. రాష్ట్రంలో రెడ్డి, ఖమ్మ కులస్తులే కీలక పదవులు చేజిక్కించుకుని కోట్లకు పడగలెత్తారు. కోట్ల రూపాయలను , వారి వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాలను అడ్డంపెట్టుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈక్రమంలో రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఊహించని రీతిలో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రోశయ్య రాజకీయాల్లో వివాదాస్పదుడుగా , అనుభయం ఉన్న రాజకీయ నేతగా ఎదుగుతూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతిసారి రోశయ్యకు మంత్రిపదవులు దక్కాయి. ఆయన రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని డబ్బును కూడా పోగేశారని చర్చజరిగింది. ఏదేమయినా అధికారంలో ఉన్న రెడ్డి , ఖమ్మ సామాజిక వర్గం సంపాధించినంతగా లేదని చెప్పవచ్చు. సామాజిక పరంగా చూస్తే జనాభా ఎక్కువగా ఉన్న బలహీన వర్గాల వారికి అధికారం దక్కాలి. కాని డబ్బు, ధర్పం, అగ్రకులం ఈ రెండు మాత్రమే కొలమానంగా మన రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ వస్తున్నాయి. ఆక్రమంలో రోశయ్య సామాజిక వర్గం చేతిలో డబ్బు ఉన్నప్పటికీ గుడిని, గుడిలోని లింగాన్ని మింగేంత సామర్థ్యం లేదేమో అనిపించింది. ప్రస్తుత పరిస్థితిలో రోశయ్య నిజాయితీ ఓడిపోయిందనే చెప్పాలి. జగన్‌ను దెబ్బతీయడానికి రోశయ్యను మార్చారని, తెలంగాణా గొడవనుంచి సెట్‌రైట్‌ చేయడానికి అని ఏవేవో చర్చలు జరిగినా. దోపిడీని సమర్థవంతంగా కొనసాగించే నాయకుని కోసం వయోభారం పేరుతో రోశయ్యను రాజీనామా చేయించారనేది నిజమని పిస్తోంది. '' క్రీడాకారులను మార్చినంత మాత్రాన ఏమి ప్రయోజముండదు. రాజకీయ మనే ఈక్రీడలో ఆడే విధానం మారితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమని నా అభిప్రాయం.''

1 కామెంట్‌:

astrojoyd చెప్పారు...

rosaiah was nt the defeater but sonia.yadha raaja..tadha mantrihi sir.in my view he was taken a very good step.