25, ఏప్రిల్ 2015, శనివారం

ప్రత్యేక హోదా కోసం ఐక్య ఉద్యమం


                                                                    
     వి.శ్రీనివాసరావు
     కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బిజెపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా కల్పించడంలో, దానిని సాధించడంలో రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల ముందు ప్రజాద్రోహులుగా నిలబడిపోతాయన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వామపక్షాలుఉమ్మడిగాఉద్యమాన్నిఉధృతం చేస్తాయని చెప్పారు. రాష్ట్రాన్ని మోసం చేసిన టిడిపి, బిజెపిలను నిలదీయాలని కోరుతూ సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో 2015 ఏప్రిల్‌ 25న  విజయవాడ అన్సారీపార్క్‌ సెంటర్‌లో  బిజెపి, టిడిపి., ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్‌ నుండి ప్రదర్శనగా అన్సారీ పార్కు వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ఐదేళ్లుకాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఆనాడు పార్లమెంట్లో మాట్లాడిన ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరుమెదపడంలేదన్నారు. ప్రత్యేక హోదాపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని చెబుతున్న రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్రం బాగా వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వరాదని 14వ ఆర్థిక సంఘం సిఫారస్సులను సాకుగా చూపుతున్నా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల నిధులను విడుదల చేసినట్లు బిజెపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, కానీ ఆ నిధులు ఆయా రాష్ట్రాలకు కేటాయించినట్లుగానే ఆంధ్రాకూ కేటాయించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనలోఉంటే సిఎం చంద్రబాబు కనీసంగా నోరు మెదపడం లేదన్నారు.

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

                                                                           మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా గద్దె రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక య్యారు. ప్రత్యర్థి జయసుధపై 85 ఓట్ల ఆధిక్యంతో పదవిని కైవసం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌.. ఎన్‌టిఆర్‌ స్ఫూర్తితో పేద కళాకారులను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చి నప్పుడే నిజమైన విజయం సాధించినట్లుగా పేర్కొన్నారు. ‘మా’ ప్రధాన  కార్యదర్శిగా శివాజీరాజా ఎన్నికవగా, కార్యనిర్వహణ ఉపా ధ్యక్షుడిగా తనికెళ్ల భరణి, కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు గెలుపొందారు. రెండు నెలలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికలకు ఎట్టకేలకు తెరపడిరది. గత నెల 29న జయసుధ, రాజేంద్రప్రసాద్‌ మధ్య నువ్వా` నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో రాజేం ద్రప్రసాద్‌ విజయం సాధించారు. అసోసి యేషన్‌లో మొత్తం702 ఓటర్లకు 394మంది ఓటు హక్కు వినియెగించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌కు 237 మంది, జయసుధకు 152 మంది ఓటేశారు. అధ్యక్ష పదవికి పోటీపడిన మూడో అభ్యర్థి బొమ్మరిల్లు ధూళిపాళకు ఐదు ఓట్లు పడ్డాయి. 7 రౌండ్లలో ఓట్లను లెక్కించగా..ప్రతి రౌండ్‌లోనూ రాజేంద్రప్రసాద్‌ ఆధిక్యాన్ని కనబర్చారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మి, శివకుమార్‌ ఏకగ్రీవం కాగా.. 168 ఓట్ల మెజార్టీతో కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులుగా నరేష్‌, రఘుబాబు గెలుపొందారు.కాగా, విశేషం ఏమంటే... అధ్యక్షుడిగా రాజేంద్ర పసాద్‌, కార్యదర్శిగా కాదంబరికిరణ్‌.తోపాటు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఇద్దరు ముగ్గురు మినహా... మిగిలిన బాడీ అంతా జయసుధ ప్యానల్‌ గెలుచుకుంది.  జయసుధకు 152 మంది ఓటేశారు. అధ్యక్ష పదవికి పోటీపడిన మూడో అభ్యర్థి బొమ్మరిల్లు ధూళిపాళకు ఐదు ఓట్లు పడ్డాయి. 7 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. ప్రతి రౌండ్‌లోనూ రాజేంద్రప్రసాద్‌ ఆధిక్యాన్ని కనబర్చారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మి, శివకుమార్‌ ఏకగ్రీవం కాగా.. 168 ఓట్ల మెజార్టీతో కోశాధికారిగా పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులుగా నరేష్‌, రఘుబాబు గెలుపొందారు. కాగా, విశేషం ఏమంటే... అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌, కార్యదర్శిగా కాదంబరికిరణ్‌.తోపాటు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఇద్దరు ముగ్గురు మినహా... మిగిలిన బాడీ అంతా జయసుధ ప్యానల్‌ గెలుచుకుంది.
                                                               అర్జునిడిలా ఎదుర్కొన్నా...
             ఈ విజయం ఓటర్లదేనని రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. ధర్మయుద్ధం లాంటి ఈ ఎన్నికల్లో తనను ఓడిరచేందుకు కౌరవుల్లా ప్రత్యర్థి వర్గం ఎంతో ప్రయత్నించిందని ఆరోపించారు. అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిగా ఎదుర్కొని గెలుపొందానని తెలిపారు. ఎన్‌టిఆర్‌ ఆశీస్సులతో బరిలో దిగిన తాను.. ఆయన స్ఫూర్తితో ‘మా’ అసోసియేషన్‌కు సేవలందించనున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్‌ సొమ్ములోని ప్రతి పైసాను పేద కళాకారుల కోసం ఖర్చుపెడతానని చెప్పారు.  అసోసియేషన్‌ డబ్బులతో టీ కూడా ముట్టుకోనన్నారు. తన విజయానికి నాగబాబు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరులేనని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ విజయంపై సంతృప్తి వ్యక్తం చేసిన ‘మా’ మాజీ అధ్యక్షుడు మురళీమోహన్‌.. గెలుపోటములతో సంబంధం లేకుండా అంతా అసోసియేషన్‌కు సేవ చేయాలని సూచించారు. నూతన కమిటీకి తనవంతుగా సలహాలు, సూచనలు  అందించేందుకు నిత్యం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన ఈ సినీ కళాకారుల సంఘం... రెండేళ్ళ పాటు తన కార్యకలాపాలను కొనసాగించనుంది.

16, ఏప్రిల్ 2015, గురువారం

ఆయన అజ్ఞాతం వీడారు!

                        
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. 57 రోజుల సెలవు తీసుకున్న అనంతరం  రాహుల్‌ గాంధీ గురువారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇన్ని ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘ సెలవు తీసుకోవడంపై ఆయన నాయకత్వంపై  అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం తర్వాత ఆయన ఎక్కువ రోజులు దేశాన్ని విడిచిపెట్టడం అనేక సందేహాలకు తావిచ్చింది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం ఉదయం 11.15గంటలకు థాయ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో బ్యాంకాక్‌ నుంచి ఢల్లీికి చేరుకున్నారు. కొన్ని వారాల క్రితం తన కుమారుడి సెలవుపై సోనియా గాంధీ స్పందిస్తూ ‘రాహుల్‌ గాంధీ త్వరలోనే వెనక్కి వస్తారని, ప్రజలతో కలిసి పనిచేస్తారని’ చెప్పారు. రాహుల్‌ గాంధీ తిరిగి రావడంపై బిజెపి వ్యంగ్యంగా స్పందించింది. రాజకీయాల్లో ఐటెం నంబర్లు అంటూ ఏమి ఉండవని,  పూర్తి కాలం సంపూర్ణ స్థాయిలో పనిచేయాల్సిందేనని పేర్కొంది. రాహుల్‌ గాంధీ కిసాన్‌ ర్యాలీని విజయవంతంగా నిర్వహిస్తారని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. దానికి తామేమంటున్నామంటే భారత రాజకీయాల్లో ఐటెం నంబర్లు వుండవు, మీరు తిరిగి కనిపించి, ర్యాలీకి హాజరై మళ్ళీ అదృశ్యమైపోతానంటే కుదరదు, మీరు రాజకీయాల్లో కూడా సీరియస్‌గా వ్యవహరించాల్సి వుంది.’’ అని బిజెపి ప్రతినిధి సాంబిత్‌ పాత్రా అన్నారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ముఖ్యమైన వ్యక్తి ఇంత సుదీర్ఘ కాలం పరారీలో వుండడం భారత రాజకీయాల్లో ఇదే మొదటిసారి. ఆయన అదృశ్యమవడం, తిరిగి రావడం రెండూ కూడా సంచలన వార్తలే అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ బిజెపి కార్యక్రమాలపై వంకలు పెట్టడం మానేసి తమ నాయకుడు ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాల్సిందిగా పలువురు బిజెపి నాయకులు కాంగ్రెస్‌ వారిని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అమేథీ పర్యటన సమయంలో కూడా రాహుల్‌ ఏక్కడున్నారని, ఎప్పుడోస్తారని లాంటి పలు ప్రశ్నలు ప్రజల నుంచి ఆమెకు ఎదురైయ్యాయి. కొంతమందైతే ఏకంగా రాహుల్‌ మిస్సింగ్‌ అంటూ పోస్టర్లే అతికించారు. మరికొందరు రాహుల్‌ మిస్సింగ్‌పై కోర్టులో కేసు పెట్టారు. కొందరు కాంగ్రెస్‌ నేతలైతే ఇకనుంచి సోనియా గాంధీయే మొత్తం పార్టీ బాధ్యతల్ని మోయాల్సిందని కొత్త పల్లవి ఎత్తుకున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 19న ప్రతిపక్షాలతో కలిసి భూసేకరణ చట్టంపై ఢల్లీిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. అంతకు ముందే రాహుల్‌ని రప్పించాలనే ప్రయత్నాలు మొదలు పెట్టి ఎట్టకేలకు సఫలం అయ్యింది. అయితే రాహుల్‌ రాక సందర్భంగా ట్విట్టర్‌లో పలు ఆసక్తికర కామెంట్లు కనిపించాయి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ అయితే ఏకంగా రాహుల్‌ రాకపోతే ఆయన చెప్పులు, వస్తువుల్ని పెట్టి పార్టీ నడిపించేవారెమో అంటూ కామెంటు పోస్ట్‌ చేశారు.

14, ఏప్రిల్ 2015, మంగళవారం

దేశానికి రక్ష వామపక్షాలే

   సిపిఎం అఖిల భారత మహాసభలు ప్రారంభం
                 నయా ఉదారవాద, అవినీతి  విధానాలకు, మతతత్వ శక్తులకు  నిజమైన ప్రత్యామ్నాయం వామపక్ష ప్రజాతంత్ర శక్తులు మాత్రమేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ అన్నారు.  సిపిఎం 21వ జాతీయ మహాసభలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శాఖపట్నంలోని సమర్‌ముఖర్జీ నగర్‌లో 2015 ఏప్రెల్‌ 14 మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో మితవాద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వామపక్షశక్తుల ఐక్యతకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. వామపక్ష ఐక్యతను మరింత విశాలంగానూ, శక్తిమంతంగానూ  రూపొందించాల్సి ఉందన్నారు. అన్ని వామపక్ష పార్టీలు, గ్రూపులు, వ్యక్తులు ఒకే వేదికపైకి రావాల్సిఉంది. ఈ ఐక్యతను సాధించడం ద్వారానే ఇతర ప్రజాతంత్ర శక్తులను కూడగట్టగలం అన్నారు. సిపిఎంతో పాటు ఇతర వామపక్ష శక్తులూ సొంత బలాన్ని పెంచుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఈ విషయం చాలా కీలకమైంది. ఇటీవల కాలంలో సిపిఎంతో పాటు ఇతర వామపక్షాలు  ఎదురుదెబ్బలు తిన్నాయి. ఈ సమస్యలను అధిగమించాల్సి ఉందని చెప్పారు.ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌  నేతృత్వంలో జరుగుతున్న హింసాకాండను ఆయన ప్రస్తావించారు. ఆ హింసాకాండను ఎదిరించి పోరాడుతున్న  వేలాదిమంది సిపిఎం, వామపక్ష కార్యకర్తలను అభినందిస్తున్నానన్నారు. గత పార్టీ మహాసభ నుండి ఇప్పటి వరకు 99 మంది అక్కడ ప్రాణత్యాగం చేశారు.  ఆ అమరవీరులకు ఈ  మహాసభ  జోహార్లు అర్పిస్తోంది. వారి త్యాగాన్ని వృథా కానివ్వం. అవరోధాలను అధిగమిస్తాం.  అశేష ప్రజానీకం అందించే సహకారంతో విజయం సాధిస్తామని కరత్‌ చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల హడావుడి ఉన్నందువల్ల అక్కడి నుంచి ఎన్నికైన ప్రతినిధులు పలువురు ఈ మహాసభకు హాజరుకాలేదని, వారి స్థానంలో ప్రత్యామ్నాయ ప్రతినిధులు వచ్చారని ఆయన వివరించారు, మహాసభకు హాజరుకావాల్సిన సుభాష్‌ ముఖోపాధ్యాయ, మానస్‌ ముఖర్జీలు అక్కడ తృణమూల్‌ గూండాలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నారని తెలిపారు. ప్రజలపై భారాలు మోపి, కష్టాలు మిగిల్చే ఆర్థికసరళీకరణ విధానాలు వేగవంతంకావడంతో పాటు మతోన్మాదశక్తులు చెలరేగుతున్న  సమయంలో జరుగుతున్న ఈ మహాసభలు పార్టీకి కీలకమైన నూతన దిశానిర్దేశం చేస్తాయని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం దిశగా ప్రజలను సమీకరించి, నడిపించడానికి, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణానికి  మహాసభల సందేశం దోహదపడు తుందన్నారు. ఈ సందర్భంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల వైఖరిని కరత్‌ తీవ్రంగా విమర్శించారు. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తిని ఆ సంస్థలు తుంగలో తొక్కుతున్నాయనీ, సెక్యులర్‌, ప్రజాతంత్ర పునాదులను ధ్వంసం చేస్తూ మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఆర్డినెన్స్‌ల రాజ్యాన్ని నడపడం, వామపక్ష ప్రజాతంత్రశక్తులపై, కళాకారులపై దాడులకు దిగడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని చెప్పారు. గత ఎన్నికల తరువాత ఏడాది కాలంలో మితవాదుల దాడులు పెరిగాయన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలపై జరుగుతున్న ఈ దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ‘కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ విభాగం. మోడి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌,బిజెపిల సంయుక్త భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యంలో  మాతృసంస్థjైున ఆర్‌ఎస్‌ఎస్‌కే ఎక్కువ వాటాలున్నాయి’ అని కరత్‌ వ్యాఖ్యానించారు. మోడి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు  దేశంలోని  కార్పొరేట్‌ రంగం కూడా సహకరించిందన్నారు. అందుకే మోడి ప్రభుత్వం కార్పొరేట్లకు ఉపయోగపడే ఎన్నో చర్యలను  ఈ పది నెలల కాలంలో తీసుకుందన్నారు. దేశంలోని కీలక మౌలికవనరులను కార్పొరేట్‌శక్తులకు, విదేశీ పెట్టుబడుదారులకు అప్పగించిందన్నారు. బొగ్గు గనులు, బీమా, రైల్వేలతో పాటు భూమిని కూడా స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌శక్తులకు కట్టబెడుతున్నారని, కార్పొరేట్‌ పన్నును 5శాతం తగ్గించడంతో పాటు సంపద పన్నును రద్దు చేశారని తెలిపారు. మోడి ప్రభుత్వం వల్ల మంచిరోజులు ఎవరికి వచ్చాయో తేలిపోయింది, పెద్ద పెట్టుబడిదారుడు గౌతమ్‌ ఆదాని సంపద ఏడాది కాలంలో 25వేల కోట్లు పెరిగిందని ఆయన చెప్పారు. కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా  ఉన్న  పేద ప్రజలు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతాంగం సతమతమవుతోందని,  ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడంతో గ్రామీణ వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు నామమాత్రంగా మారాయని వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటుతుండటంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చట్టాల సవరణతో కార్మిక హక్కులకు ప్రమాదం ఏర్పడిరదని, నూతన గనుల విధానంతో ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, దేశ వ్యాప్తంగా పునరావాస సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మరోవైపు హిందూత్వశక్తులకు తలుపులు తెరవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యాసంస్థల్లోనూ, పరిశోధనా కేంద్రాల్లోనూ విధానాలను నిర్దేశిస్తోందన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా విషప్రచారం సాగుతోందని, మత మార్పిడులు, ప్రార్థ్దనాస్థలాలపై దాడులు, గోవధపై నిషేధం వంటి సాంస్కృతిక దాడికి ఆర్‌ఎస్‌ఎస్‌ దిగుతోందన్నారు. ‘హిందూత్వ తిరోగమన వాదులు మహిళల స్వేచ్ఛపై కూడా దాడిచేస్తున్నారన్నారు. వస్త్రధారణలపై ఆంక్షలతో ప్రజాజీవితం నుండి వారిని దూరం చేస్తున్నారని విమర్శించారు.  మితవాద అజెండా విదేశీ విధానంపై కూడా ప్రభావం చూపింది. మోడి ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదంతో చెట్టాపట్టాలేస్తోంది. ఆసియా ఖండంలో అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా మోడి ప్రభుత్వ విదేశీ విధానం ఉంది. విదేశీ పెట్టుబడికి గేట్లు మరింతగా తెరవాలన్న అమెరికా ఒత్తిడికి మోడి సర్కారు లొంగిపోయింది. మేధోహక్కులు, పేటెంట్ల అంశంలోనూ అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని  కరత్‌ చెప్పారు.  దూకుడుగా అమలుచేస్తున్న ఈ విధానాలను వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు మాత్రమే తిప్పికొట్టగలవని అన్నారు. అతి తక్కువ కాలంలోనే అసంతృప్తి పెరుగుతోంది. పలు రంగాలకు చెందిన కార్మికులు ఉద్యమాల్లోకి వస్తున్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికచట్టాల సవరణకు వ్యతిరేకంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణకు దిగుతున్నాయి. బొగ్గు బిల్లుకు వ్యతిరేకంగా బొగ్గుగని కార్మికులు రెండు రోజులు, ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా బీమా ఉద్యోగులు ఒకరోజు  సమ్మె చేశారు. వివిధ పథకాల కార్మికులు హక్కుల కోసం రోడ్లమీదకొస్తున్నారు. రానున్న రోజుల్లో  పాలకవర్గాలకు, మోడి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల ఫలితంగా నష్టపోతున్న ప్రజలకు మధ్య వైరుధ్యం మరింత తీవ్రం కానుందని ఆయన  చెప్పారు.
                                             తెలంగాణ విప్లవపోరాటం స్ఫూర్తిదాయకం
                ఈ సందర్భంగా వీరతెలంగాణ విప్లవపోరాటాన్ని, పుచ్చలపల్లి సుందరయ్య, బసవపన్నయ్య, సి. రాజేశ్వరరావుల స్ఫూర్తిని కరత్‌ గుర్తు చేశారు. మహాసభలకు ఆతిథ్యమిస్తున్న విశాఖ నగర వాసులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పోర్టుసిటీ విశాఖ  ఎన్నో కార్మిక ఉద్యమాలకు కేంద్రం, ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, స్టీల్‌ప్లాంటు, హిందూస్థాన్‌ షిప్‌యార్డు, బిహెచ్‌ఇఎల్‌ ప్లాంటు, హెచ్‌పిసిఎల్‌ రిఫైనరీ మరెన్నో పరిశ్రమలు ఉన్నాయి. కార్మికసంఘాలు సంఘటితమై ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు చేశాయని  ఆయన చెప్పారు. ప్రారంభసభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎస్‌. రామచంద్రన్‌ పిళ్ళై అధ్యక్షత వహించారు. సిపిఐ  ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి,ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి దేవబ్రత్‌ విశ్వాస్‌, ఎస్‌యుసిఐ (సి) ప్రధానకార్యదర్శి ప్రభాష్‌ ఘోష్‌, ఆర్‌ఎస్‌పి అఖిలభారతనాయకులు అబనీరాయ్‌, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు కవితా కృష్ణన్‌తో పాటు సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు, మహాసభల ఆహ్వానసంఘ సభ్యులు వేదికపై ఆశీనులయ్యారు.

13, ఏప్రిల్ 2015, సోమవారం

సామాజిక న్యాయం కోసం పోరాడిన అంబేద్కర్‌


                                                                       
    నేడు  125వ జయంతి
          సామాజిక న్యాయం కోసం డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ జీవితాంతం పోరాడారు.  స్వతంత్ర భారత రాజ్యాంగనిర్మాత. మనదేశంలో అంటరానితనం నిర్మూలనకు, కులనిర్మూలనకు, ఛాందసభావాలకు,  మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం కృషిచేసిన మహావ్యక్తి అంబేద్కర్‌ . ఆయన 125వ జయంతిని  ఏప్రిల్‌ 14న దేశం జరుపుకుంటుంది.     ఈ సందర్భంగా ఆయన జీవితంపై ప్రత్యేక కథనం....
             డాక్టర్‌ అంబేద్కర్‌ 1891 ఏప్రెల్‌ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవాడ పట్టణంలో  రాంజీమలోజి లక్పాల్‌, భీమబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. కఠోరమైన పరిశ్రమ,  నిరంతరమైన పఠనా వ్యాసంగం, అంచంచలమైన దీక్ష ఆయనను ప్రపంచంలో ప్రథమశ్రేణిలో నిలబెట్టాయి. అంబేద్కర్‌ చదువుకు ఎక్కువ ప్రాధన్యతను ఇచ్చేవారు. పుస్తకాలకు ఎక్కువ ఖర్చు పెట్టేవారు. ఆయన లండన్‌లో ఒక్క నిమిషం కూడా వృథా చేయకూండా చదివేవారు. బ్రిటిషు మ్యూజియంలోని గ్రంధాలనే కాకుండా ఇండియా ఆఫీసు గ్రంధాలయం, నగరంలోని గ్రంధాలయంలో ఎక్కువ సేపు గడిపేవారు. న్యాయశాస్త్రం ఒక్కటే కాకుండా అర్ధశాస్త్రంలో ఎంఎస్‌సి డాక్టరేట్‌ పట్టాకోసం విశేష కృషిని సల్పి రెండెళ్ళ వ్యవధిలో మూడు పట్టాలు సాధించారు. 1921లో లండన్‌ విశ్వవిద్యాలయానికి   ‘‘ ప్రొవిన్షియల్‌ డీసెంట్రలైజేషన్‌ ఆఫ్‌ ఇంఫీరియల్‌ ఫైనాన్స్‌ ఇన్‌ బ్రిటీష్‌ ఇండియా ’’ అనే పరిశోధన పత్రాన్ని సమర్పించి ఎంఎస్‌సి పట్టా పొందారు.‘‘ ప్రాబ్లమ్‌ ఆఫ్‌ ది రూఫీ ’’ అనే వ్యాసం సమర్పించి బిఎస్‌సి పట్టా పొందారు. డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ బారిష్టర్‌ వృత్తిలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో బొంబాయి గాంచ్‌ కోర్టులో ఒక కేసు విషయమై ఏడు గంటలు ఏకధాటిగా ఇంగ్లాండ్‌, భారతదేశ న్యాయస్ధానాల తీర్పులను ఉదహరిస్తూ వాదించారు.‘‘ నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా ఎ హిస్టారికల్‌ అండ్‌ అనలిటికల్‌ స్టడీ ’’ అనే దానిపై ఆయన రాసిన పరిశోధనా వ్యాసానికి కొలంబియా విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్‌ ఇచ్చారు. డాక్టర్‌ అంబేద్కర్‌ చిన్నతనంలోనూ, స్కూలులో చదువుకునే రోజులలోనూ అంటరానితనాన్ని, అవమానాలు స్వయంగా అనుభవించారు. ఆ అనుభవాలు ఆయనలో వ్యవస్ధ పట్ల ద్వేషాన్ని పెంచాయి. విద్యాభ్యాసం చేసి అమెరికా నుండి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన అంటరానితనానికి గురవుతున్న వారిలో చైతన్యాన్ని పెంపొందించి, వారిలో బానిస ప్రవృత్తిని నిర్మూలించేందుకు, మానవ హక్కులు, సమానత్వం కోసం వారు పాటుపడేటట్లు నిర్విరామంగా కృషి చేశారు. బహిరంగ చెరువుల్లో నీరు తాగే హక్కుకోసం మహద్‌లో 1927లోనూ, 1930లో నాశిక్‌ దేవాలయ ప్రవేశం కోసం పోరాడేందుకు అంటరాని వారిని సమీకరించి పోరాటాలు నిర్వహించారు. హిందూ మతంలో సంస్కరణల కోసం కృషి చేశారు.    1937సెప్టెంబరులో మైసూర్‌లో జరిగిన దళిత మహాసభలో అధ్యక్షోపన్యాసమిస్తూ ‘‘ సాంఫీుక, ఆర్ధిక సమానత్వం అనే లక్ష్యాల ద్వారా మాత్రమే సామాన్య మానవునికి తన అభిమతానుసారం స్వేచ్చగా పురోగమించడానికి అవకాశాలు ఏర్పడుతాయనీ, ఉత్పత్తి సాధనాలు కొద్ది మంది చేతులోనే వుండి దోపిడీ చేయటానికి వీలున్నంతవరకు సామాన్య మానవుడుఅభివృద్ధి చెందడానికి ఏమాత్రం అవకాశం వుండదు ’’ అని అంబేద్కర్‌ అన్నారు. 1938లో కొంకణ్‌లో భూస్వామ్య వ్యవస్ధ రద్దు కోసం జరిగిన రైతాంగ ప్రదర్శనలో పాల్గొన్నారు.         ప్రపంచ చరిత్ర అంతా వర్గ సమాజ చరిత్రే. ఆందుకు ఇండియా మినహాయింపు కాదు. వర్గం లోనే కులం ఇమిడి వుంది. అని ఆయన మన దేశంలోని వర్గ వ్యవస్ధ గురించి వివరించారు.  ‘‘ రాష్ట్రాలు`మైనారిటీలు ’’ అన్న అంశం మీద రాజ్యాంగ నిర్మాణ సభకు షెడ్యూల్‌ కులాల ఫెడరేషన్‌ తరుపున సమర్పించిన డాక్యుమెంట్‌లో అంబేద్కర్‌ ప్రణాళికబద్ద ఆర్ధిక విధానాన్ని కోరుకున్నారు. మౌలికమైన కీలక ప్రరిశ్రమలు, ఇన్సూరెన్స్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, సాగుకు అనుకూలమైన భూములకు పరిహారం చెల్లించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పేదరైతులకు, భూమిలేని  వ్యవసాయ కార్మికులకు పంచాలన్నారు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పాలని, మైనారిటీలకు తగు రక్షణ కల్పించాలని కోరారు. కార్మికులకు పంచాలన్నారు.
           గొప్ప మేధావి, న్యాయశాస్త్రంలో నిష్ణాతుడైన అంబేద్కర్‌ను స్వాతంత్య్ర భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలోకి మంత్రిగా తీసుకున్నారు. హిందూ కోడ్‌ బిల్లు ద్వారా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించేందుకు ఆయన కృషికి నెహ్రూ ప్రభుత్వం ఆటంకాలు కల్పించటంతో రాజీనామా చేశారు.       హిందూ మతంలోని వర్ణవ్యవస్ధ అసమానతలతో, వివక్షలతో కూడి ఉన్నదని, బౌద్దమతం సమాజాన్ని మానవత్వంతో పునర్‌నిర్మించగలదని, బుద్దుడు చెప్పిన దుఃఖం అన్నదానిని నిరుపేదరికంతోనూ, దోపిడితో సమాన అర్థంగా భావించారు. ప్రెవేటు ఆస్తులను రద్దు చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని ఆయన భావించారు. అందుకే లక్షలాది మంది తన అనుచరులతో బౌద్దమతం స్వీకరించారు.     మనం స్వాతంత్య్రం సాధించుకుని 68 సంవత్సరాలు గడచినప్పటికి, నాడు డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ ఏ వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పొరాడారో ఆ వివక్షత నేటికీ కొనసాడుతూనే ఉంది. జనాభాలో 70శాతం పైగా వున్న దళితులు, గిరిజనులు, వెనుకబడినతరగతులవారు అనాగరికమైన కులవివక్షతకు గురౌవుతున్నారు.  అణిచివేత, అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. వీరిలో అత్యధికులు వ్యవసాయకార్మికులు, పేద, సన్నకారురైతులు, చేతివృత్తులు, అసంఘటిత రంగ కార్మికులుగా ఉండి ఆర్ధిక దోపిడీకి కూడా గురౌతున్నారు. కులపరమైన దోపిడీ వీరి జీవితాలను మరింత దుర్భరం చేసున్నాయి. ఈ వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం అనేక ఉద్యమాలు సాగుతున్నాయి. వాటిలో భాగస్వాములు కావడం డా॥బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆశయ సాధన కృషిలో భాగం కాగలదు. నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలు సామాజిక న్యాయానికి భంగం కలిగించేవిగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణ ద్వారా ఉపాధిని దెబ్బతీస్తున్నారు. అంబేద్కర్‌ కోరుకున్న ప్రణాళికాబద్ద ఆర్ధిక విధానం స్ధానంలో ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, బహుళజాతిసంస్థలు, వాటి ప్రభావంతో పరిశ్రమలను ప్రైవేటురంగం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. కీలకమైన భూసంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలకు, వ్యవసాయ కార్మికులకు పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడంలేదు. దేశాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్న ఇన్సూరెన్స్‌రంగాన్ని, బ్యాంకులను, ఉపాధి కల్పనలో ప్రధాన పాత్ర పొషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్ధలను లాభార్జనే పరమావధిగా గల్గిన ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారు. దేశంలో కుల, మతశక్తులు ప్రజల ఐక్యతకు భంగం కలిగిస్తున్నాయి. సామాజిక న్యాయానికి, దేశసమైక్యతకు నష్టం కలిగించే విధంగా పాలకవర్గాలు విధానాలను రూపొందిస్తున్నారు. ఈ నేపద్యంలోనే డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ బోధనలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.   ॥బి.ఆర్‌,అంబేద్కర్‌ బోధించినట్లు సామాజిక న్యాయానికి భంగం కలిగిస్తున్న, పేదప్రజల జీవన ప్రమాణాలను దిగజారుస్తున్న విధానాలను అధ్యయనం చేద్దాం. వీటికి వ్యతిరేకంగా పేద ప్రజానీకాన్ని సమీకరిద్దాం. ఉద్యమాలు నిర్వహిద్దాం. అదే అంబేద్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి.