10, డిసెంబర్ 2015, గురువారం

ఎన్నికవ్వాలంటే చదువు ఉండాల్సిందే


                                      హర్యానా పంచాయితీ సవరణ చట్టానికి సుప్రీం కోర్టు ఆమోదం
    న్యూఢిల్లీ : కనీస విద్యార్హత లేనివారు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని హర్యానా ప్రభుత్వం చేసిన చట్ట సవరణను  సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సవరణ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ జే చ లమేశ్వర్‌ నాయకత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. అయితే, మన దేశంలో పార్లమెంటు, శాసనసభ సభ్యుగా ఎన్నికవడానికి మాత్రం కనీస విద్యార్హత ఏదీ లేకపోవడం గమనార్హం. హర్యానా అసెంబ్లీ ఈ సంవత్సరం రూపొందించిన ఈ చట్టంలో కనీస విద్యార్హతతో పాటు, ఇంట్లో మరుగుదొడ్డి ఉండడం, కో`ఆపరేటివ్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణా బకాయిు లేకుండా ఉండడం వంటి ఇతర అర్హతు కూడా ఉన్నాయి. ఈ కొత్త చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని, మౌలిక హక్కును హరిస్తుందన్న కారణంతో దీనిని రద్దు చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది.
               అంతకు ముందు, సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం హర్యానా పంచాయతీరాజ్‌ (సవరణ) చట్టం, 2015పై స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ చట్టంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణ కేటగిరీ వారైతే కనీసం పదో తరగతి, మహి ళలు, దళిత అభ్యర్థులైతే కనీసం 8వ తరగతి, దళిత మహిళలైతే కనీసం 5వ తరగతి చదివి ఉండా లనే నిబంధన ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణ కున్న చట్టబద్ధతను పరీక్షించాలని, ఈ అంశాన్ని అధికారయుతంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయంలో సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత మరోసారి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నిక ల కమిషన్‌ ప్రకటించింది. నిజానికి అక్టోబర్‌లోనే పంచాయితీ, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగాల్సి ఉండిరది.‘నిజానికి అందరికీ విద్య అందించకపోవడం అనేది ప్రభుత్వ వైఫ్యమే. ఇందుకు ప్రజ హక్కును హరించడం సరికాదు. ప్రజలెవ్వరూ తాము నిరక్షరాస్యులుగా ఉండిపోవాలని కోరుకోరు’ అని పిటిషన్‌దారు తరఫు న్యాయవాది కీర్తి సింగ్‌ వాదించారు. 2010లో రూపొందిన విద్యా హక్కు చట్టంతో ఏ అభ్యర్థీ లబ్ది పొందలేదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి రాష్ట్రంలో 83 శాతం దళిత మహిళలు, మొత్తంగా 71 శాతం మహిళలు, 56 శాతం పురుషులు నిరక్ష్యరాస్యులేనని సింగ్‌ వాదించారు. చదువుకునే స్తోమత లేని కారణంగా వారిప్పుడు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగం కాకుండా పోతారని సింగ్‌ అన్నారు. సమానత్వమే చట్టానికి ప్రాతి పదికగా ఉండానీ, అది పేదకు అండగా ఉండాలని వాదించారు. ‘గ్రామీణ ప్రాంతంలో అత్యధికులను ఈ ప్రక్రియకు దూరం చేసే ఏ చట్టమైనా ఏకపక్షమైనదీ, నిర్హేతుకమైనదే అవుతుంది’ అని సింగ్‌ అన్నారు. అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది.
                                                       సుప్రీం తీర్పు ఆశ్చర్యకరం : సీపీఐ(ఎం)
                   హర్యానా రాష్ట్ర పంచాయతీ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల సీపీఐ(ఎం) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాన్ని ఆమోదించడం కష్టమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఒక ప్రకటనలో అన్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ సవరణ చట్టం వ్ల గ్రామీణ ఓటర్లలో మూడిరట రెండొంతుల మంది అభ్యర్థుగా అనర్హులవుతారు. దీనిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుతుందని ఆశించిన వారికి ఆశాభంగమే కలిగిందని పార్టీ అంది.ఈ షరతులు రాజ్యాంగంలో చెప్పిన ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌సింగ్‌ అన్నారు. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ప్రజ ప్రజాస్వామిక హక్కులను కాపాడడంలో విఫల మైందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికీ చట్టప రమైన అవకాశాలున్నాయని, దీనిపై రివిజన్‌ పిటిషన్‌ వేసేం దుకు మీందని పార్టీ అంది. సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తర్వాతి చట్టపరమైన చర్యను ఖరారు చేస్తామని సీపీఐ(ఎం) నేత అన్నారు. ప్రజాస్వామిక హక్కు పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ, ఈ విషయంలో ప్రజల మధ్యకు వెళ్తామని, దీనిని ఎన్నికల అంశంగా చేపడతామని కూడా సురేందర్‌ సింగ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజలదేనని, ప్రజా ఉద్యమాలతో ఈ షరతులను మార్చవచ్చని ఆయన తన ప్రకటనలో అన్నారు. గతంలో హర్యానా అసెంబ్లీ స్థానిక సంస్థ ఎన్నికలో అభ్యర్థిత్వానికి ఇద్దరు పిల్లలే ఉండాలన్న షరతు విధించిందనీ, దానికి వ్యతిరేకంగా దాఖు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందనీ, అయితే ప్రజల నిరసనతో అసెంబ్లీ ఆ అప్రజాస్వామిక షరతును ఉపసంహరించుకుందని ఆయన గుర్తు చేశారు.