24, మే 2013, శుక్రవారం

వడదెబ్బకు ఆంధ్రప్రదేశ్‌లో 107 మంది మృతి

                 
ఆంధ్రప్రవేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్టోగ్రతలు పెరగడంతో వడదెబ్బ మృతుల సంఖ్య 2013 మే 24 న ఒక్కరోజే 107కు చేరింది. 44 నుంచి 50 డిగ్రీల ఉష్టో గ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు పిట్టళ్లా రాలిపోతున్నారు. జిల్లాల వారీగా మృతులు కరీంనగర్‌ 18 మంది, విశాఖ పట్నం 10, వరంగల్‌ 9, గుంటూరు 8, తూర్పుగోదావరి7, నల్గొండ 8, ఖమ్మం 6, ఆదిలాబాద్‌ ఏడుగురు మృతి చెందారు. ప్రకారం 13, కృష్ణా ఆరు, మెదక్‌ మూడు, నిజామాబాద్‌ రెండు, కడపలో ఇద్దరు మృతిచెందారు. పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.

23, మే 2013, గురువారం

ఎవరెస్టుపై 80 ఏళ్ల వృద్దుడు

          
జపాన్‌కు దేశానికి చెందిన ఒక వృద్ధుడు (80) ఎవరెస్టు శిఖరం ఎక్కి రికార్డు నెలకొల్పాడు. 2008లో అదే దేశానికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు ఎవరెస్టును ఎక్కి నెలకొల్పిన రికార్డును ఇతడు బ్రేక్‌ చేశాడు. ప్రపంచంలో ఎత్తయిన శిఖరాన్ని యూచిరో మౌరా 2013 మే 23న ఉదయం దాదాపు 8.45 గంటలకు చేరుకున్నట్లు పర్వతారోహణ అధికారి జ్ఞానేంద్ర శ్రేష్ట చెప్పారు. 8,848 మీటర్ల ఎత్తుగల ఎవరెస్టు శిఖరాన్ని మౌరా 2003, 2008లో 70, 75 ఏళ్ల వయస్సులో రెండు సార్లు ఎక్కాడు. ఈ దేశానికి చెందిన మహిళే 74 ఏళ్ల వయసులో ఎవరెస్టును ఎక్కిన వృద్ధ మహిళగా రికార్డు నెలకొల్పిన విషయం విదితమే.

12, మే 2013, ఆదివారం

టివి 9 సిఈఓ రవిప్రకాష్‌ పై జర్నలిస్టు దాడి

                         
ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ టివి 9 సీఈఓ రవిప్రకాష్‌ పై జర్నలిస్టు రమణ దాడి చేసారు. కర్నూలు నగర శివారులో 2009 వరదల్లో ముంపునకు గురయిన బాధితుల కోసం టివి 9 సౌజన్యంతో రెండోదశ ఇళ్లు నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీడుగా ప్రారంభించేందుకు 2013 మే 12న టివి 9 ఏర్పాట్లును చేసింది. సిఎం రాకకు రెండుగంటలు ముందు కాలనీ వద్ద టివి 9 సిఈఓ రవిప్రకాష్‌ లైవ్‌లో మాట్లాడుతున్నారు. ' సమాజంలో అవీనీతి అక్రమాలు, ముఠా రాజకీయాల ప్రాబల్యం నష్టం కలిగిస్తున్నాయి. అభివృద్ది కుంటుపడుతుంది. టివి 9 వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది' అని అన్నారు. ఆ మాటలు వినగానే గతంలో టివి9లో జర్నలిస్టుగా పనిచేసిన రమణ అవీనితి గురించి మాట్లాడే అర్హత నీకులేదంటూ ముందుకు వచ్చారు. చెప్పు తీసుకొని నేరుగా వెళ్లి రవిప్రకాష్‌ మొహంపై కొట్టాడు. ఈ హఠాత్తు పరిణామానికి షాక్‌కుగురయిన టివి 9 సిబ్బంది రమణను పక్కకు ఈడ్చుకెళ్లి విచక్షణా రహితంగా చితకబాదారు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుని రమణను తమ అదుపులోకి తీసుకోవడంతో వివాదం సర్దుమణిగింది. రమణపై పోలీసులు కేసు నమోదు చేశారు. రమణ కొంతకాలంగా రవిప్రకాష్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని, మాటలకు చేతలకు పొంతన లేదని ప్రచారం చేస్తున్నారు.
దాడులకు భయపడం: రవిప్రకాష్‌
             తాము చేస్తున్న సమాజిక సేవా కార్యక్రమాలను చూసి ఓర్వలేని కొందరు ఫ్యాక్షనిస్టుల అనుచరులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని టివి9 సిఇఓ రవిప్రకాష్‌ అన్నారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షనిజం పూర్తిగా అంతమయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.