13, ఏప్రిల్ 2011, బుధవారం

అన్నా హజారే ఒక్క అవినీతిమీదే ఎందుకింత స్పందించారు?

నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రంపంచీకరణ , సరళీకరణ, ప్రయివేటీకరణ వల్ల జరిగిన దుష్పరిణామాలపై అన్నా హజారే ఎందుకు స్పందించలేదు? ఆయనకు అవి అర్థం కాలేదా? అర్థం అయినా ఎందుకులే అనుకున్నారా?. విద్యా, వైద్యం, ఉపాధి సామాన్యులకు అందనంత దూరం అవుతున్నాయి. ఆయనొక సామాజిక కార్యకర్త సమాజంలోని సామాజిక అసమానతలు కనబడలేదా? ప్రయివేటీకరణ పుణ్యమాని ఎస్సీఎస్టీబీసీల కోసం రాజ్యాంగంలోని నిర్థేశించుకున్నవి అమలు ఎందుకు కావడంలేదో తెలియదా? సరళీ కరణతో పాశ్చాత్య సంస్కృతి విచ్చలవిడిగా విస్తరిస్తూ సహజసిద్దమైన వనరులన్నీ నాశనమై గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటోంది. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంకా దెబ్బతింటూనే ఉన్నాయి. వాటిపై అన్నా హజారే ఎందుకు స్పందించ లేదు. అన్నా హజారే భారత సైన్యంలో పని చేశారు. దేశరక్షణ గురించి బాగా తెలుసు దేశ రక్షణకు భంగం వాటిల్లే ఒప్పందాలను అమెరికాతో చేసుకుంటుంటే ఎందుకు స్పందించలేదు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా రాలేగావ్‌సిద్ధి గ్రామ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన సౌరశక్తి, జీవ ఇంధనం, పవన విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నడుంబిగించారు. అంటే ప్రకృతిని కాపాడాలనే ఆలోచన ఆయనకుందనే కదా? మరి ప్రమాదకరమైన అణుఒప్పందం భారత ప్రభుత్వం చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదు. ఆయన చేసిన పనిమీదే ఆయనకు నమ్మకం లేదా? దేశంలో స్వయం ప్రతిపత్తి గల రాలేగావ్‌ సిద్ధి గ్రామాన్ని మొదటిస్థానంలో నిలిపినందుకు ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఇదంతా చేయగలిగిన ఆయన ప్రమాదకరధోరణుల సమయంలో ఎందుకు నోరు మెదపలేదు.
అన్నా హజారే ఒక్క అవినీతిమీదే ఎందుకు దీక్ష చేశారు. అన్నింటికీ మూలం అవినీతే అనుకుంటున్నారా? ఏటేటా పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు, ఉత్తర్వుల వల్ల జరుతున్న పరిణామాలపై స్పందించాల్సిన అవసరం లేదా?. మాజీ ఐపీఎస్‌ కిరణ్‌బేడీ, సామాజిక వేత్త అగ్నివేష్‌, ఆర్‌టిఐ విప్లవవేత్త అరవింద్‌ కెజ్రావాల్‌ హజారేకు తోడుగా నిలిచారు. వీరికయినా ఎందుకు ఈ పరిస్థితులన్నీ అర్థం కాలేదు. రాజకీయాలకు అతీతులనీ, స్వచ్చందంగా ముందుకొచ్చి జనలోక్‌పాల్‌ బిల్లుకోసమని పోరాడారని ఎక్కువమంది నమ్ముతున్నారు. అందులోని తోతుపాతులను అధ్యయనం చేసేంత తీరిక లేదేమో అనిపించింది. సరే ముందుముందు అన్నీ బయటపడుతాయిగా అప్పటికైనా ఎవరి పోరాటం వెనుక ఏముందో అర్థమవుతుంది. ఒకప్పుడు నూతన ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన వారిని వితండవాదులు అన్నారు. కొన్నాళ్ల తరువాత అందరూ వ్యతిరేకించక పోయినా ఒక్కో సందర్భంలో గొంతుకలిపారు.
సరే అదంతా అటుంచితే జనలోక్‌పాల్‌ బిల్లు అంటే ఏమిటీ? : ఈ బిల్లును 1972లో అప్పటి న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్‌ పార్లమెంటులో ప్రతిపాదించారు. మారుతున్న పాలకులు దీనిని పక్కన పెడుతూ వచ్చారు. కొందరు అవినీతి పరులు ఆబిల్లును మార్చాలని కూడా ప్రయత్నించారు. ఈబిల్లు అమలయితే కేంద్రం ఒక లోక్‌పాల్‌ను ఎన్నుకోవాలి. లోక్‌పాల్‌ బిల్లును డ్రాప్టు చేయడానికి 50 శాతం ప్రభుత్వం నుంచి , 50 శాతం ప్రజల తరుపున కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలి. అవినీతిని అంతమొందించడంలో ప్రభుత్వాన్ని ఊర్తిగా నమ్మడం సాధ్యం కాదని ఈ విధంగా కమిటీని వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో ఉండే కొందరు అవినీతి పరులు చట్టం కళ్లుగప్పి తప్పించుకునే ప్రమాదం ఉంది. భారత ఎన్నికల కమిషన్‌కు ఉన్నంత స్వయంప్రతిపత్తి లోక్‌పాల్‌బిల్లుకు కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఏడాదిలోపు అందరి అవినీతి పరులను గుర్తించే అవకాశం ఉంది. రెండేళ్లలో అందరికీ శిక్షపడేలా చేయడం సాధ్యమవుతుంది. బిల్లుపాస్‌అయితేనే అవినీతిని అంతమొందించే అవకాశం ఉంది. ఇదంతా పార్లమెంటు మీద ఆధారపడి ఉంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి సాధ్యమవుతుంది. సరే ఏంచేస్తారో వేచి చూద్దాం. అన్నా హజారే ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. పోరాటం ఏదయినా మద్దతు ఇవ్వాల్సిందే. ప్రమాదకరమైన అన్నింటిమీద ఆయనెందుకు స్పందించలేదనేదే నాప్రశ్న.

9 కామెంట్‌లు:

mmd చెప్పారు...

oka vyakthi anni issues meeda concentrate cheyyaleru kadandi..... perhaps we should appreciate what he is doing instead of questioning why he didn't fight on other issues

atleast some other will get inspired and motivated by such people and start fighting on other causes.

Praveen Mandangi చెప్పారు...

ఒకవేళ అవినీతి 100% మాయమైనా సరే మన దేశంలో డబ్బు ఎక్కువగా అంబానీలూ, టాటాలూ, బిర్లాలూ తదితర కార్పరేట్ల ఖాతాలలో మూలుగుతుంది. రాష్ట్ర స్థాయిలోనూ బ్రాహణి స్టీల్స్ లాంటి కంపెనీల చేతిలో డబ్బు ఎక్కువగా మూలుగుతుంది. సాధారణ ప్రజలకి పెద్దగా ఒరిగేది ఉండదు. సాధారణ పౌరుడు అవినీతి గురించి ఆలోచించకుండా తన ఆర్థిక స్థితిలో బతకడానికి లాటరీ కొడుతుంటాడు. ఆర్థిక అసమానతల అంశంపై అజెండా తయారు చేస్తే అన్నా హజారే నడుపుతున్న ఉద్యమానికి పేద ప్రజల మద్దతు ఉంటుంది. 70% మంది పల్లెటూర్లలో ఉంటోన్న దేశంలో సాధారణ ప్రజలకి పెద్దగా ప్రయోజనం కలిగించని ఉద్యమం నడిపితే ఫలితం సున్నా. ఆ ఉద్యమానికి ఫలితం రాదని తెలిసే అత్యంత అవినీతిపరులైన నాయకులు సహితం హజారేకి మద్దతు తెలుపుతున్నారు. ఆయుర్వేద మందులలో ఎముకల పొడి కలిపి వాటిని శుద్ధ శాకాహార మందులని నమ్మించే రాం దేవ్ బాబా కూడా హజారే దీక్షకి మద్దతు తెలిపాడు. చిల్లర దొంగ నుంచి కోట్లు స్కామ్ చేసినవాడి వరకు అందరికీ తాము అవినీతిని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకోవడం ఫాషన్ అయిపోయింది.

అజ్ఞాత చెప్పారు...

దానికెందుకు స్పందించలేదు?
దీనికెందుకు స్పందిచాడు?
స్పదించినా అంతలా ఎందుకు స్పందించాడు?
మేమెందుకు ఇంతలా స్పందిస్తున్నాము?
అన్నా హజారే లిబియా మీద, ఈజిప్టు మీద ఎందుకు స్పందించలేడు?
ఫుకషిమాలో అణు ప్రమాదం వస్తుందని అన్నా ఎందుకు నిరాహార దీక్ష చేపట్టలేదు?

లాలూ, వైఎస్సర్, సోనియా, గాలి, జగన్, యడ్యూర్‌కప్ప, కల్మాడి, రాజా, అవినీతుల మీద, హజారే అప్పుడే ఎందుకు స్పందించలేదు?

మీరెందుకిలా ఈకలు పీకుతున్నారు?

ఇన్ని నీతులు చెప్పే ప్రవీణ్ మందంగి గారు, చైనా, రష్యాల్లో అవినీతి అంటే, ఎందుకు స్పందించక వాకౌట్ చేస్తారు?!

మీ పోస్ట్లకు టైటిల్స్ ఇచ్చాను, ఇక వ్యాసాలు తెనిగించుడీ.. :)

panuganti చెప్పారు...

ఎంఎండిగారు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని నేనను కాని అన్నాహజారే లాంటి వారు అన్ని కోణాలను ఆలోచించగలిగేవారు. కాని దేశ ప్రయోజనాలకు నష్టం వాటిళ్లినప్పుడు ఎందుకు మాట్లాడలేదనేది నావాదన. ఆయనొక్కరే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని కూడా కాదు. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. దేశంలో నేటికీ రోజుకు 20 రూపాయలు కూడా ఖర్చుచేయలేని ప్రజలున్నారు. అంటే ముందు ఆదాయం రావాలికదా ఖర్చుచేయడానికి అంటే అత్యధికులకు పని కల్పించాలి కదా. అది జరగడం లేదు.
ప్రవీణ్‌శర్మగారి వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
ఎస్‌ఎన్‌కెఆర్‌ గారు అవినీతి ఒక్కటే అన్ని సమస్యలకు మూలమని అనుకుంటున్నారేమో. కరక్టే కావచ్చు. అవినీతి ఎక్కడ జరిగినా అవినీతే... చైనాలో జరిగితేనీతి, ఇండియాలో జరిగితే మరోటి ఏదికాదు. అంతకంటే ప్రమాదకర దోరణలుతో మన పాలకు ముందుకు పోతున్నారు. దానిని గమనించాలని నావాదన.మీరు అన్నా హజారే అభిమాని అయివుండ వచ్చే మారెలాంటి అభ్యంతరాలే లేదు. జరుగుతున్న నష్టాలపై కూడా దృష్టిపెట్టాలి కదా?

sunnitham చెప్పారు...

snkr గారి కామెంట్కు స్పన్దిస్థూ....
దానికెందుకు స్పందించలేదు?
జ) సత్యం మహోన్నతమైనది. అన్యాయం జరుగుతున్నామౌనంగా ఉండడం నేరమేకదా.
దీనికెందుకు స్పందిచాడు?
జ) అవినీతికి అతీతం కాని కాషాయ నరరూప రాక్షసులను కీర్తించడం అంటే సమాజాన్ని దారి మల్లిన్చడమేగా.
స్పదించినా అంతలా ఎందుకు స్పందించాడు?
జ) జనంపై నమ్మకం లెఖపొఇన మీలాంటి వారు ఇక లేచి మోడీకరించాలని కాబోలు.
మేమెందుకు ఇంతలా స్పందిస్తున్నాము?
జనంపై నమ్మకంలేని మీలాంటి వారు సమాజాన్ని మరింత వెనక్కు నెడతారనే భయం.
అన్నా హజారే లిబియా మీద, ఈజిప్టు మీద ఎందుకు స్పందించలేడు?
జ) జనంఫై నమ్మకం లేకుండా మీలాంటి వారిని నమ్ముతున్నందుకు.
ఫుకషిమాలో అణు ప్రమాదం వస్తుందని అన్నా ఎందుకు నిరాహార దీక్ష చేపట్టలేదు?
జ) మీలాంటివారు అండగా రారని.
లాలూ, వైఎస్సర్, సోనియా, గాలి, జగన్, యడ్యూర్‌కప్ప, కల్మాడి, రాజా, అవినీతుల మీద, హజారే అప్పుడే ఎందుకు స్పందించలేదు?
జ) ఎప్పుడు అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్దంగా ఉండాలని.
మీరెందుకిలా ఈకలు పీకుతున్నారు?
జ) మీలాంటి వారికి తీరికేక్కువ లేక్కపెడతారని.
మీ కామెంటుక ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇక వ్యాసాలు తెనిగించుడీ.. (మంచిని నిర్లక్షం చేయని ఎవరైనా మంచివారేనని భావిస్తూ)

sunnitham చెప్పారు...

పానుగంటి గారు మీరు రాసింది అక్షర సత్యం. అవినీతిపై పోరాటామంటూ అందరి దృష్టిని ఆకర్షంచి. చివరకు అభివృద్ధి నిరోదికులైన కాశాయులవైపు అందరిని చూడమనడం.. నీచంగా భావిస్తున్నాను. మోడి కన్నా మంచిపాలన ఉన్నా మంచిని గ్రహించలేక కుసంస్కారాన్ని బయటపెట్టుకున్నారు.

అజ్ఞాత చెప్పారు...

/మీరెందుకిలా ఈకలు పీకుతున్నారు?
జ) మీలాంటి వారికి తీరికేక్కువ లేక్కపెడతారని./
హాహాహా ఇది నాకు నచ్చింది. మీరు ఓపిగ్గా పీకంగా లేనిది, సాటి తెలగాంధ్రుడి కోసం లెక్కెట్టడం అనే మీ చుష్కమైన కోరిక తీర్చలేమా! తమరు ఆ పని మీద వుండండి.

Praveen Mandangi చెప్పారు...

"సత్యం వద, ధర్మం చర" అనే సూత్రాన్ని ఆచరిస్తే ఏమవుతుందో ఈ లింక్‌లో చదవండి: http://stalin-mao.net.in/-a

Praveen Mandangi చెప్పారు...

సాధారణ వ్యక్తి అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే "ఎవరికీ లేని దురద వీడికి ఎందుకు?" అని అనుకుంటారు. అన్నా హజారే లాంటి మాస్ మసాలా లీడర్ అవినీతికి వ్యతిరేకంగా ఉత్తుత్తి నిరాహార దీక్ష చేస్తే అతనికి వ్యక్తి పూజ చేస్తారు. అదే మన సమాజంలో ఉన్న దుస్థితి.