29, నవంబర్ 2013, శుక్రవారం

జ్వలించే కోరిక విజయంవైపు నడుపుతోంది

                        
   ఎక్సలెన్స్‌ లీడర్‌షిప్‌ అకాడమీ డైరెక్టర్‌ కొండా చంద్రారెడ్డి

                      లక్ష్యాన్ని నిర్దేశించుకుని జ్వలించే కోరికతో ముందుకు పోతే విజయం మనదవుతుందని  ఎక్సలెన్స్‌ లీడర్‌షిప్‌ అకాడమీ డైరెక్టర్‌ కొండా చంద్రారెడ్డి సూచించారు. లక్ష్యాన్ని  చేరడానికి సాధన ఒక్కటే మార్గమని  అన్నారు. హైదరాబాద్‌లో 2013 నవంబర్‌ 28న ప్రజాశక్తి సబ్‌ఎడిటర్ల  శిక్షణాతరగతుల్లో ఆయన మాట్లాడారు. నిబద్దతతో పనులు చేసినప్పుడు మార్గం సుగమమవుతుందని చెప్పారు. ఏదయినా సాధించడానికి నడవడిక సరయినదయి ూండాలని తెలిపారు. క్రమ పద్దతిలో  సమయాన్ని సద్వినియోగం  చేసుకుంటే జ్ఞానం వికసించి వృత్తిలో  నైపుణ్యంపెరుగుతుందని సూచించారు. డబ్బు, సమయం, ప్రభుత్వ ప్రోత్సాహం తదితరాలు లేవని నిరుత్సాహ పడటం సరైంది కాదని అన్నారు. ఇప్పటి వరకు పేదలు నివసించే ప్రాంతాల్లో, విద్య, వైద్య ప్రభుత్వ రంగ సంస్థలతో అనుబంధంగా పని చేసి పేదలు అభివద్ధి వారిసాధికారతకు కావల్సిన సూచనలు చేశామని తెలిపారు. అంతే కాకుండా వారు సంతోషంగా, ూత్సాహంగా  జీవించడానికి సాధ్యమయ్యేలా తన వంతు కృషి చేశానని చెప్పారు. మీ సంస్థలో మీరు విజయం సాధించడానికి , సంస్థను ముందుకు తీసుకుపోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరడానికి క్రమపద్దతిలో సాధన ఒక్కటే మార్గమని వివరించారు.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పలువురు విజేతలు, విజ్ఞులు వారు సాధించన విజయాలు , అందుకు సహకరించిన ూపకరణాలను వివరించారు. అంతే కాకుండా వారు కఠోర సాధనతో ఎలా పేరు ప్రతిష్టలు పొందారో తెలిపారు.

13, నవంబర్ 2013, బుధవారం

మోడి విజయం ఇదే....

 
స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారీ స్థాయిలో నెలకొల్పుతున్నారు. దీనిఎత్తు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెట్టింపు వుంటుంది. దీనికయ్యే ఖర్చు అక్షరాలా 2074 కోట్లు. అంటే చంద్రమండల యాత్రకు లేదా ఈ వారం జరగనున్న అంగారక గ్రహయాత్రకు అయ్యే ఖర్చుకన్నా ఐదురెట్లు ఎక్కువ. పోనీయండి ఇదొక పర్యాటక ఆకర్షణగా వుంటుందని సరిపుచ్చుకుందాం. కానీ సర్ధార్ పటేల్ మ్యూజియం మౌళిక వసతులు లేక మూతపడింది. కేవలం కొన్ని లక్షల రూపాయిలు మాత్రం ఖర్చుపెడితే దీన్ని తెరిపించవచ్చు అదే విధంగా సర్ధార్ పటేల్ చదివిన పాఠశాలకు కేవలం పదిహేను లక్షల రూపాయిల నిధులివ్వమని పటేల్ ట్రస్ట్ యాజమాన్యం అడిగితే గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించింది. నిధుల్లేవని సమాధానం చెప్పింది. గాంధీ మహాత్మునికి వున్న అది పెద్ద విగ్రహం ఇటీవల పాట్నాలో నెలకొల్పిన 70 అడుగుల విగ్రహమే కానీ మోడీ సర్కార్ ఏర్పాటు చేస్తున్న పటేల్ విగ్రహం ఎత్తు 392 అడుగులు పటేల్ పై నిజంగానే అభిమానం వుంటే ఆయన మ్యూజియం కో పాఠశాలకూ నిధులు లేవంటారా? ఈ విగ్రహం నెలకొల్పుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం జాతీయ వార్తా పత్రికలలో, టెలివిజన్ ఛానల్స్ లో భారీ వ్యాపార ప్రకటనలను ఇచ్చింది. ఇదంతా చూస్తే పటేల్ పై ప్రేమకన్నా ఆయన విగ్రహం ఎంత ఎత్తుగా వుంటే అంత ఎత్తుగా తన పలుకుబడి పెంచుకోవచ్చన్న నరేద్ర మోడీ లక్షమే కనిపిస్తోంది.

దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలని అనవసరంగా పోల్చారు ఇటావల నరేంద్ర మోడీ. మరి మరుగుదొడ్లు లేని దేశంలో విగ్రహాలు కావాలా? దేవాలయాల కన్నా విగ్రహాలే పవిత్రమా? విగ్రహాల కన్నా మీడియాలో అడ్వర్టైజ్ మెంట్లు ముఖ్యమా?

3, నవంబర్ 2013, ఆదివారం

గట్టును వెంటాడుతున్న వివక్ష

                                                  అక్షారాస్యత, అభివృద్ధిలో వెనుకబాటు

                                                 కొనసాగుతున్న రెండుగ్లాసుల పద్దతి

                                                  దళితులకు దేవాలయ ప్రవేశంలేదు

                                                      శ్మశాన వాటకలు లేనేవేవు

           మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలంలో వివిధ రూపాలో వివక్ష వెంటాడుతుంది. అత్యధిక గ్రామాల్లో  శ్మశాన వాటికలు లేవు. దేవాలయ ప్రవేశం లేదు. రెండుగ్లాసుల పద్దతి కొనసాగుతోంది.  దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.  ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా దళితుల దరి చేరడం లేదు. ఇప్పటికీ మండలంలో 768 కుటుంబాలకు ఇళ్లు లేవు. ఇందిరమ్మ పథకం కింద మంజూరయిన ఇండ్లకు బిల్లులు రాక,  నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక పెండిరగుల్లో ూన్నాయి.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇంత ప్రచారం చేస్తున్నా 90 శాతం దళితులకు మరుగుదొడ్లు లేవు. అన్నింటికీ మించి మండలంలో పెత్తందాల ఆగడాలను ప్రశ్నించిన వారిపై  పెత్తందారులు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హత్యలు చేసిన సంఘటనలు కూడా ూన్నాయి.
        కెవిపిఎస్‌  ఆధ్వర్యంలో గట్టు మండలంలో ఇటీవల సర్వే నిర్వహించారు. జిల్లాలో అక్షరాస్యతలోనూ, అభివృద్ధిలోనూ  వెనుకబడిన గట్టు మండలంలోని  24 పంచాయతీల పరిధిలోని 32 గ్రామాల్లో కెవిపిఎస్‌ నాయకత్వంలో దళితుల సమస్యలపై సర్వే చేశారు. ఐదు బృందాలుగా ఏర్పడి వారంరోజుల పాటు  గ్రామాల్లో తిరిగి దళితుల సమస్యలను అధ్యయనం చేశారు. మండలంలోని  ఏడు  గ్రామల్లో దేవాలయ ప్రవేశం లేదు. రాయవరం, సుల్తానపురం, సోంపురం, చింతలకుంట, ఎస్సందొడ్డి, పెంచికల పాడు, నందిన్నే గ్రామాల్లో దళితులు దేవాలయాల్లోకి వెళ్తే దాడులు చేస్తారు. పండుగలు ూత్సవాల సందర్భంగా దళితులు ఆయా గ్రామాల్లో దూరంగా ూండే వారి మొక్కులు చెల్లించుకుంటారు.  బతికున్నంత కాలం తీవ్రమైన  ఆర్థిక, సామాజిక వివక్షను  ఎదుర్కొనే  దళితులకు సచ్చాక ఆరడుగుల జాగాకూడా లేక పోవడం దురదృష్టకం. శ్మశాన వాటికలు లేనివి  తొమ్మిది గ్రామాలున్నాయి.  మిట్టదొడ్డి, శాగదోని, నారాపురం, మల్కాపురం, కెజి దొడ్డి, సుల్తానపురం,  పుట్టందొడ్డి, నందిన్నే సోంపురం గ్రామాల్లో దళితులు చనిపోతు వ్యవసాయ భూముల్లోనే మృతదేహాలను ఖననం చేస్తారు. వ్యవసాయ భూమి లేని దళితులు శవాలను ఖననం చేయడానికి నానా తంటాలు పడాల్సి ూంటుంది. హోటళ్లలో దళితులు టీ తాగితే పెత్తందారులు ఓర్వలేరు. నేటికీ రాయవరం , సుల్తాన్‌పురం, సోంపూర్‌ గ్రామాల్లో  హోటళ్లలో రెండుగ్లాసుల పద్దతి అమలవుతుంది. అది విధంగా దళితులను గ్రామాల్లో దళితులను రచ్చబండల మీద కూర్చోనీయరు. చింతలకుంట, సోంపురం, సుల్తాన్‌పూర్‌ గ్రామాల్లో దళితులను రచ్చబండమీద కూర్చోనీయరు.  రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించింది. ఇప్పటికే అత్యధిగ గ్రామాల్లో కమ్యూటీ హాళ్లు నిర్మించారు. గట్టు మండలంలో నేటికీ కమ్యూనిటీ హాళ్లు లేని గ్రామాలు 16 ూన్నాయి.  పెద్దమల్కాపురం, గందమాన్‌దొడ్డి, తుమ్మల చెరువు, ఆరెగిద్ద, రాయవరం. చింతలకుంట, కుచ్చినెర్ల, సోంపురం, ఎస్సందొడ్డి, నందిన్నె, సుల్తాన్‌పూర్‌, కెసిదొడ్డి, సారాపురం, మల్గెర, చింతపురం, సల్కెరపురంలో  గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు లేవు. దీంతో పెండ్లిళ్లు ూత్సవాత సందర్భంగా దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సల్కెర పురంలో ఎస్‌సి కమ్యూనిటీ హాలును  బోయలు ఆక్రమించారు. కొన్ని గ్రామాల్లో కయ్యూనిటీ హాళ్లకు రిపేర్లు చేయాల్సి ూంది.
                         గట్టు మండల కేంద్రంలో దళితులకు సర్వేనెంబర్‌ 311, 304లో నాలుగు ఎకరాల ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది.  పెత్తందారులు దానిని ఆక్రమించారు.  పెత్తదారులకు భయపడిన దళితులు ప్రశ్నించడం లేదు.  చింతలకుంట గ్రామంలో ఎస్సీలకు సర్వే నెంబర్‌ 211/వి ఆరున్నర ఎకరాల వ్యవసాయ సాగు భూమి ప్రభుత్వం పంపిణీ చేసింది. దళితులు పొట్టకూటి కోసం వలస వెళ్లారు. కురువ వెంకటేష్‌, గోకారప్ప, ఈరప్ప 15 కుటుంబాల వాళ్లు దళితుల భూమిని కబ్జా చేశారు. అట్టిభూమిని అక్రమంగా  సాగు చేసుకుని రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకుంటున్నారు. దీనిపై దళితులు కోర్టును ఆశ్రయించారు. ఈభూమి దళితులదేనని  కోర్టు తీర్పు ఇచ్చినా బాధితులకు భూమి ఇవ్వడం లేదు. ఇలా మండలంలో లనేక గ్రామాల్లో దళితుల భూమిని ఆక్రమించుకుంటున్నారు.  ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కూడా దళితులకు సక్రమంగా అందడం లేదు. నేటికి 12 గ్రామాల్లో 768 కుటుంబాలలకు ఇళ్లు లేవు.   ఇందిరమ్మ పథకం కింద అందరికీ ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని అందరికి  ఇళ్లు నిర్మించుకునే అవ కాశం మండలంలో లేదు. ఇందిమ్మ బిల్లులు రాక అనేక గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకోవడంలో వెనుకబడి ూన్నారు. బిల్లు మంజూరయినా ఆర్థక పరిస్థితి సక్రమంగా లేక నిర్మించుకోలేని వారు పలువురున్నారు.  వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఎంతో ప్రచారం చేస్తుంది. గట్టు మండలంలో నేటికీ 90 శా త ం మందికి మరుగుదొడ్లు లేవు. గట్టు మండలం అన్ని రంగాల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అక్షరాస్యత. అక్షరాస్యతలో మహబూబ్‌నగర్‌ జిల్లా 56 ూండటా అందులో గట్టు మండలం 34.45 శాతం మాత్రమే. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా అక్షరరాస్యత పెరగడం లేదు. తగిన చర్యలు తీసుకోవాలి. అక్షరాస్యతలోనూ అభివృద్ది లోనూ దళితులు వెనుకబడి ూన్నారు. దాడులు జరిగినా హత్యలు జరిగినా రాజీ కుది రిస్తున్నారు. కేసులు అయినా ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు. రోడ్లు, వీధిదీపాలు, శ్మశాన వాటికలు, కమిటీహాళ్లు, మరుగుదొడ్లు తాగునీటి సమస్యలున్నాయి.  మండలంలో అనేక తీవ్రమైన సమస్యలను  అధికారుల దృష్టికి తెచ్చారు. అధ్యయనం చేసిన అన్ని అంశాలను పరిశీలించి న్యాయం చేయాల్సిన అవసరం ూంది. దళితవాడలు, ఇళ్లస్థలాలు, విద్యుత్‌ స్తంభాలు, వాటర్‌ట్యాంక్‌, కొళాయిలకు అంచనాలు వేసి గతంలో ఆర్డీఓకు అందజేశారు.  మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్ల కోసం వృద్ధుల, వికలాంగుల పేర్ల జాబితాను 2011లో అధికారులకు ఇచ్చినా నేటికీ పట్టించుకోలదు.  సర్వే అనంతరం గట్టు మండల కేంద్రంలో సదస్సు నిర్వహించి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. దళితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని గద్వాల ఆర్డీఓ నారా యణ రెడ్డి హామీ ఇచ్చారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాలు లేకపోతే ప్రభుత్వ పరంగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి కేటాయిస్తారన్నారు. గట్టు, చింతలకుంట గ్రామాల్లో శ్మశాన వాటిక విషయంలో  ప్రత్యేకంగా తహశీల్దార్‌తో మాట్లాడుతానన్నారు. అదే విధంగా ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్లు లేని గ్రామాలను పరిశీలించి నిర్మిస్తామని చెప్పారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వ ూన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

1, నవంబర్ 2013, శుక్రవారం

బ్లాగు మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి మీకు వెలుగులు నింపాలి
మీ పనుల్లో కాంతి ప్రసరించాలి

ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఆశయాలను కొనసాగిద్దాం

                                              స్వారోస్‌డేలో వక్తల పిలుపు

                 రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లన్నింటినీ గురుకుల పాఠశాలలుగా మారుస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడిరచారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ, స్వారోస్‌(సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్సియల్‌ ఓల్డ్‌ స్టూడెండ్స్‌) సంయుక్తంగా 2013 అక్టోబర్‌ 25న హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో ఎస్‌ఆర్‌ శంకరన్‌ జయంతి వేడుకలు నిర్వహించారు.  దాదాపు రెండువేలకుపైగా  మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శంకరన్‌ మరణించినా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, పీపుల్‌ ఐఎఎస్‌గా పేరొందారని, ఆయన సామాజిక స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. శంకరన్‌ను ఆదర్శంగా తీసుకుని గురుకుల విద్యాసంస్థల అధికారులు, ఉపాధ్యాయులు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలను స్థాపించిన ఘనత శంకరన్‌కు దక్కుతుందన్నారు. సబ్‌ప్లాన్‌ ద్వారా ఈ సంవత్సరానికి గురుకుల విద్యాసంస్థలకు 9వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.  డిజిపి బి ప్రసాదరావు మాట్లాడుతూ అట్టడుగు నుంచి వచ్చిన డాక్టర్‌ భీంరావ్‌ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ూన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.  ప్రవీణ్‌కుమార్‌ సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్సియల్‌ విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. అవకాశాలు వాటంతట అవి రావని వాటిని వెతుక్కుంటూ మనమే వెళ్లాలని అన్నారు. మహాభారతంలోని ఏకలవ్యుని జీవితాన్ని ూటంకిస్తూ మనసులో ఫలానా దాన్ని సాధించాలనుకున్న వారికి లక్ష్యమే ముందుంటని చెప్పారు. లక్ష్యాలు ూన్నతంగా ూన్నప్పుడు వాటిని చేరుకోవడం కష్టం కాదని సూచించారు. రిటైర్డ్‌ ఐఎఎస్‌, ఎఐసిసి ఎస్సీసెల్‌ ఛైర్మన్‌ కె రాజు మట్లాడుతూ కార్యాలయాలను నడిపే వారందరూ నాయకులు కారని, వ్యవస్థను ప్రభావితం చేయగలిగిన వాడు నాయకుడని అన్నారు.  పేదరికం అసమానతలు పోవడానికి అట్టడుగున్న వారంతా విద్యావంతులు కావాలని సూచించారు.  కలలు ూన్నతంగా కని సాకారం చేసుకున్ననాడే నిజమైన సాధికారత అని అన్నారు.
                        రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ శంకరన్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. శంకరన్‌ టిఎస్‌ కృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేశారన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఐపిఎస్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. స్వారోస్‌ అనేది ప్రపంచస్థాయి నెట్‌వర్క్‌గా ఏర్పడుతుందన్నారు. ప్రతి విద్యార్థి కచ్చితంగా ఆంగ్లం నేర్చుకోవాలని, ప్రణాళికతో ముందుకెళ్లాలని, స్వారోస్‌ అందరూ ఎక్కడ ఉన్నా పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఆత్మగౌరవంతో బతకాలంటే ూన్నత శిఖరాలను అధిరోహించాలని స్వారోస్‌కు పిలుపునిచ్చారు. అందుకు పది ూన్నతమైన  నినాదాలు చదిరి అందరితో పలికించారు.  అనంతరం ఎస్‌సి కమిషన్‌ ఓఎస్‌డి సుబ్బారావు, డిక్కీసౌత్‌ ఇండియా కో`ఆర్డినేటర్‌ నర్రా రవికుమార్‌, పాల్‌ దివాకర్‌ మాట్లాడారు. జెఎన్‌యు ప్రొఫెసర్‌ గోపాల్‌గురు, జైభీం యూత్‌ అధ్యక్షులు ఆర్‌ సురేష్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు శంకరన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  మహబుబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది.అంతకు ముందు ఆలేరు విద్యార్థులు చక్కటి గీతం వినిపించారు. సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్సియల్‌ విద్యాసంస్థలు సాధిస్తున్న విజయాలపై వీడియో ప్రదర్శన చేశారు.