29, అక్టోబర్ 2014, బుధవారం

దిల్మాకు అభినందనలు

  ఇది లాటిన్‌ అమెరికా ప్రజల విజయమని వ్యాఖ్యలు
         బ్రెజిల్‌ అధ్యక్షురాలిగా రెండవసారి దిల్మా రౌసెఫ్‌ విజయం సాధించిన నేపథ్యంలో లాటిన్‌ అమెరికాకు చెందిన రాజకీయ నేతలు ఆమెను అభినందించారు. 2010 అక్టోబర్‌లో తొలిసారి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2014లో తిరిగి రెండోసారి విజయం సాధించారు.  ఈ విజయంతో, లాటిన్‌ అమెరికా ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న విలీనం లేదా అనుసంథానం ధోరణి మరింత ధృఢపడుతుందని భావిస్తున్నారు. సోషల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా సెంట్రల్‌, దక్షిణ అమెరికా దేశాల నేతలు బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ నేతను ప్రశంసల్లో ముంచెత్తారు. సోషల్‌ డెమోక్రాట్‌ నేత ఏషియోనెవెస్‌ను దాదాపు నాలుగు పాయింట్ల తేడాతో ఆమె ఓడిరచారు. సామాజిక కూర్పుకు, ప్రాంతీయ అనుసంథానానికి ఇది గొప్ప విజయమని అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌ తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌లో దిల్మా అద్బుతమైన విజయం సాధించారు. వర్కర్స్‌ పార్టీతో మా అనుబంధం కొనసాగుతుందని అంటూ ‘అభినందనలు దిల్మా, లూలా, బ్రెజిల్‌’ అని ఈక్వెడార్‌ అధ్యక్షుడు రాఫెల్‌ కరియా  వ్యాఖ్యానించారు. దిల్మా బ్రెజిల్‌లో సాధించిన విజయం ప్రజలు సాధించిన విజయం, లూలా, ఆయన వారసత్వం సాధించిన గెలుపు అని వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో వ్యాఖ్యానించారు. ఇది మొత్తంగా లాటిన్‌ అమెరికా, కరేబియా ప్రాంత ప్రజలు సాధించిన అద్భుత విజయమని అభినందించారు. బ్రెజిల్‌లో, లాటిన్‌ అమెరికాలో ఇది పండగ చేసుకునే సమయం. తమ సంతోషాన్ని, సంక్షేమాన్ని మరింత పటిష్టపరుచుకునే దిశగా మన ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటూ ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు సాల్వడార్‌ శాంచెజ్‌ పేర్కొన్నారు. ఉరుగ్వేలో ఫ్రెంటే యాంప్లియో తరపున అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తబరే వాక్వెజ్‌ ‘బ్రెజిల్‌కు ఇది శుభవార్త, కామ్రేడ్లూ దిల్మా విజయం సాధించారు.’ అని పేర్కొన్నారు. ఇంకా అర్జెంటీనా ఎన్నికల్లో పాలక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధి, గవర్నర్‌ సెర్గియో ఉరిబరి, ఒఎఎస్‌కు అర్జెంటీనా రాయబారి నిల్డా గారే, పార్లమెంటేరియన్‌ కార్లోస్‌ హెల్లర్‌ ప్రభృతులు దిల్మా విజయాన్ని అభినందించారు. వెల్లువెత్తుతున్న అభినందనలకు దిల్మా కృతజ్ఞతలు తెలిపారు.

25, అక్టోబర్ 2014, శనివారం

మీడియా ద్వారా సామాజిక చైతన్యం

           మీడియాద్వారా సులువుగా సామాజిక చైతన్యం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 2014 అక్టోబర్‌ 25న ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోడీ సంపాదకులు, విలేకరులతో సమావేశమయ్యారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మీడియాప్రతినిధులతో మోడీ తొలిసమావేశం ఇది. ఈసందర్భంగా మోడీ మాట్లాడుతూ స్వశ్చభారత్‌ మహోన్నత కార్యక్రమని అన్నారు. స్వశ్చభారత్‌పై మీడియాలో చాలామంచి కథనాలు వచ్చాయని చెప్పారు. సామాన్యుడికి స్వశ్చభారత్‌ అర్థమయ్యేలా ప్రసారం చేశారని అభినందించారు. మీడియాద్వారా సులువుగా సామాజిక చైతన్యం వస్తుందన్నారు. అందరూ కలిసిపని పని చేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని అన్నారు. మీడియా ప్రతినిధులతో పాటు సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌,సుష్మాస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

18, అక్టోబర్ 2014, శనివారం

చెన్నయ్‌ చేరిన జయలలిత

               బెంగుళూరు పరప్పన అగ్రహార జైలునుంచి 2014 అక్టోబర్‌ 18న  విడుదలయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిఅన్నా డిఎంకె అధినేత్రి జయలలిత చెన్నయ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆదాయాన్ని మించి అక్రమ ఆస్తులున్నాయని సెప్టెంబర్‌ 27న ప్రత్యేక కోర్టు తీర్పు మేరకు ఆమెను జైలుకు తరలించారు. ఆమెకు నాలుగేళ్లు శిక్షవిధించిన విషయం తెలిసిందే. బెయిలుకోసం బెంగుళూరు హైకోర్టును ఆశ్రయించగా తిరష్కరించారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో 17న బెయిలు మంజూరయింది. 18న బెయిలు పత్రాలు అందిన వెంటనే బెంగుళూరు జైలు నుంచి విడుదల చేశారు. జయలలితకు  చెన్నయ్‌ విమాశ్రయంలో  కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా  పార్టీ కార్యకర్తలు, అభిమానులు విమానశ్రయంనుంచి నివాసం వరకు మానవహారం చేపట్టారు.  ఈసందర్భంగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు.

14, అక్టోబర్ 2014, మంగళవారం

హుదూద్‌ తుపాన్‌ నష్టం లక్షకోట్లు

                                                     
                                                        4,55,000 ఎకరాల్లో పంటనష్టం
                                                                26 మంది మృతి
                     హుదూద్‌ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు దాదాపు లక్షకోట్ల రూపాయల మేర నష్టం జరిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశారు. 2014 సెప్టెంబర్‌ 12న తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రను కుదిపేసింది. 14న  విశాఖలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఒక్క నేవికీ 2 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగి నట్లు  చెప్పారు. విరుచుకుపడ్డ హుదూద్‌  తుపాన్‌ రాష్ట్రానికి భారీ నష్టం మిగిల్చింది.గతంలో ఎన్నడూ లేని స్థాయిలో  నష్టం సంభవించినట్లు చెబుతున్నారు.  హుదూద్‌ తుపాన్‌ నగర ప్రాంతంలో విలయం సృష్టించడమే దీనికి కారణం. గతంలో భారీ తుపా న్లు వచ్చినప్పటికీ వ్యవసాయరంగమే ప్రధానంగా నష్టపోయేది. ఈసారి పరిస్థితి దానికి భిన్నం.  పరిశ్ర మలు, పోర్టు, విమానాశ్రయంతో  రాష్ట్ర ఆర్థికరాజ ధానిగా నిలిచిన విశాఖ నగరం హుదూద్‌తో విలవిలలాడిరది. తుపాన్‌ తీరం దాటి రోజులు గడు స్తున్నా  విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొన లేదంటేనే  పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  విశాఖ హార్బర్‌లోని   మత్స్యకార్మికు లకు చెందిన  బోట్లు పెద్ద సంఖ్యలో ధ్వంసం అయ్యా యి. 700 నుండి వెయ్యిబోట్లు దెబ్బతిన్నట్లు చెబు తున్నారు. కొన్ని బోట్లు కనపడకుండా పోయాయి.  ఒక్కో బోటు విలువ  లక్షల రూపాయల నుండి కోటి రూపాయల దాకా ఉంటుందని సమాచారం.  వీటిలో  బీమా సౌకర్యం లేనివే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు  అధికారులు అంటున్నారు.  విశాఖ విమా నాశ్రయానికి 500 కోట్ల రూపాయల నష్టం వాటి ల్లిందని, ఉక్కు కర్మాగారానికి 340 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు ప్రాధమికంగా తేల్చారు. ఈ వివరాలను ముఖ్యమంత్రే  చెప్పారు.  ఒక్క విశాఖ నగరంలోనే దాదాపుగా 40 వేల కోట్ల విద్యుత్‌ స్తంబాలు నేలకూలాయి, ఇవిగాక విశాఖలోని మిగిలిన ప్రాంతాలు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో 10 నుండి 15వేల  విద్యు త్‌ స్తంబాలు  నేల కూలి ఉంటాయని అంచనా!  తుపాన్‌ తీవ్రతకు  ఉప్పాడ నుండి కాకినాడ ప్రధాన హైవే పూర్తిగా దెబ్బతింది.  రోడ్డును పూర్తిస్థాయిలో పునరుద్దరించడానికి  వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కిలోమీటరకు దాదాపు కోటి  రూపాయలు ఖర్చు చేయాల్సిఉంటుందన్నది ప్రభుత్వ వర్గాల అంచనా!. విశాఖలోని కైలాసగిరి వంటి పర్యాటక ప్రాంతాలు, ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఎన్‌టిపిసిలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టాలపై ఇంకా ప్రాధమిక అంచనాలు సిద్దం కాలేదు. ఇవిగాక విశాఖపట్టణంలోని ప్రైవేటు ఆస్తులూ భారీగా దెబ్బతిన్నాయి. షాపింగ్‌మాల్స్‌, పెట్రోలు బంకులతో పాటు  కొన్ని భారీ వ్యాపారసముదాయాలు తుపాన్‌ నష్టాల బారిన పడ్డాయి.  పూరి గుడిసెలు, రేకుల ఇళ్లతో పాటు  హుదూద్‌ తుపాన్‌  అపార్ట్‌మెంట్లపైనా ప్రభావం చూపింది. టెలికాం సర్వీసులతో పాటు, రైల్వేశాఖ కూడా భారీ నష్టాన్ని చవి చూసింది. నష్టం అంచనాల్లో వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సిఉంది.  విశాఖ నగరంలోనే భారీ నష్టం ఉండటంతో ఇప్పటిదాకా అనుసరిస్తున్న సంప్రదాయ  విధానాలు నష్టం మదింపునకు సరిపోవన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.  కంప్యూటర్‌ మాడల్స్‌తో ఉన్న  కొత్త విధానాన్ని  వీరు ప్రతిపాదిస్తున్నారు.  పునరావాస, సహాయ చర్యలు కొలిక్కి వచ్చిన తరువాత  దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా.
                                                                       26కు చేరిన మృతులు!
                హుదూద్‌ తుపాన్‌ కారణంగా రాష్ట్రంలో  మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. 1,82,128 హెక్టార్లలో పంట నష్టం సంభవించినట్లు  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే,  ఇది ప్రాధమిక అంచనా మాత్రమేనని  పంట నష్టం మరింత పెరిగే అవకాశం  ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనాల ప్రకారం 1,44,175 హెక్టార్లలో వేసిన ఆహారపంటలు, 37,953 హెక్టార్లలో వేసిన వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. 
                                                                    వెయ్యికోట్లు సాయం ప్రకటించినకేంద్రం
              హుదూద్‌ తుపాన్‌ బారిన పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయంగా వెయ్యికోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించారు. తుపాన్‌ ధాటికి విలవిలలాడు తున్న విశాఖ నగరంలో ఆయన సెప్టెంబర్‌ 14న పర్యటించారు. తొలుత ఏరియల్‌ సర్వేలో తుపాన్‌ పీడిత ప్రాంతాలను  పరిశీలించారు.  విధ్వంసమైన విశాఖ విమానాశ్రాయాన్ని,   తుపాన్‌ నష్టాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూశారు. అధికారులతో సహాయచర్యలపై సమీక్షా సమా వేశం  నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన  హుదూద్‌ తుపాన్‌ భారీ నష్టం కలిగిం చిందని చెప్పారు.
                                                                  విరాళం ప్రకటించిన సినీ పరిశ్రమ
                    తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ విరాళాలు ప్రకటించింది. నటుడు పవన్‌కళ్యాణ్‌ రూ.50 లక్షలు, మహేష్‌బాబు 25లక్షలు, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ 20 లక్షలు, రామ్‌చరణ్‌ తేజ 10లక్షలు, సినీనిర్మాతల మండలి 25లక్షలు ప్రకటించింది. ఈ విధంగా పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధులు విరాళాలు ఇస్తున్నారు. ఇంకా ఆదుకోవడానికి ముందు రావల్సిన అవసరం ఉంది.

2, అక్టోబర్ 2014, గురువారం

దసరా శుభాకాం క్షలు


కలుషిత విధానాలతో స్వచ్ఛ భారత్‌ సాధ్యమా?

            దేశ సార్వభౌమత్వాన్ని కాపాడలేని పాలకులు దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలనే ఆలోచన సాధ్యమా?. రోడ్లు, టాయిలెట్స్‌, పరిసరాలు శుభ్రంగా ఉంచితే దేశం స్వచ్ఛమౌతుందా?. ఎవరి పరిసరాలు వారు శుభ్రం చేసుకోవడమనేది అత్యధిక మందికి తెలుసు.  నిరక్షరాస్యత, పేదరికం పోనంతకాలం కొన్ని ప్రాంతాలు శుభ్రం చేయలేం. కొన్నింటిని శుభ్రం చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిబ్బందినే నియమించుకోలేక పోతున్నాం. ఉన్న సిబ్బంది రిటైర్‌ అయితే ఆ ఖాళీలను భర్తీ చేయించుకోలేక పోతున్నాం. కాంట్రాక్టు లెక్కన సిబ్బందిని తీసుకుని వారి కష్టంనుంచే కాంట్రాక్టర్ల తాపేదార్లు దోచుకుంటున్నారు.
                                                      చేతల్లో  విదేశీ... మాటల్లో స్వదేశీ
      విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానిస్తే మన దేశ ప్రయోజనాలుండాలి. అవెక్కడా లేవు. ఒక వేల ఉంటే సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచి లెక్కలు చూస్తే మన దేశంలో సంపన్నుల  ఆదాయం పెరుగుతూ పోతుంది. పేదరికం పెరుగుతూనే ఉంది. మనుగడ కోసం జరిగే పోరాటంలో అక్కడక్కడా విజయం సాధించిన బడుగులు బాగుపడుతున్నారు. పాలకుల విధానాల వల్ల సామాన్యునికి  ప్రయోజనం లేదు.
         స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాక ప్రధాన మంత్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రం సాధించుకున్నాం.  మహాత్ముడి స్వచ్ఛభారత్‌ కల మాత్రం నేటికీ సాకారం కాలేదు. క్విట్‌ ఇండియా...క్లీన్‌ ఇండియా అని మహాత్ముడు  సందేశమిచ్చారని  మోడీ గుర్తు చేశారు. పాలకులు విదేశీ విధానాలను అమలు చేసి సంస్కృతి సాంప్రదాయాలను కలుషితం చేసి స్వదేశీనినాదం చేసిన గాంధీ గురించి మాటల్లో గొప్పలు చెప్పుకుంటే ప్రయోజం ఏమిటి?. ఇలాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు కాకుండా మన రాజ్యాంగంలోని నిబంధనలను సక్రమంగా అమలు చేస్తే సరిపోతుంది. 
                                                        మోడీ ప్రధాని అయ్యాక........
                 రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)ను అనుమతించారు. బీమారంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలకు వీలు కల్పిస్తూ బిల్లు రూపొందించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను అమ్మకానికి పెట్టారు. నిర్వీర్యం చేయడానికి సిద్దమయ్యారు.  ఓఎన్‌జిసి, కోల్‌ఇండియా, ఎన్‌హెచ్‌పిసిలలో  వాటాల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ప్రయివేటు శక్తులకు కట్టబెట్టబెడుతున్నారు.  ధరలకు కళ్లెం వేయలేక పోయారు. బడాపారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తున్నారు.  శాస్త్ర వేత్తలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ జెనిటిక్‌ మోడిఫైడ్‌ పంటలకు అనుమతిచ్చారు. ఇవ్వన్ని ప్రజల ప్రయోజనాలకు కాకుండా కొందరి ప్రయోజనాలకోసం చేశారు. గాంధీ విదేశీ వస్తువుల దిగుమతులను వ్యతిరేకించారు. మనవాళ్లు అంటే ముందు పాలకులు, నేటి పాలకులు ఆహ్వానించారు. మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు పెట్టి ఆరోగ్యం పాడు చేస్తున్నారు. సంస్కరణల పుణ్యమాని అవినీతి పెనుభూతమైంది. మోడీ కేబినెట్‌లోనే 18 మంది మంత్రులపై వివిధ రూపాల్లో అభియోగాలొచ్చాయి. మోడిగారు చంద్రబాబును గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆయన హామీలు మాత్రం అమలుకావడం లేదు. విజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని పంచే విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటు భాగస్వామ్యం పెరిగింది.  ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భారత్‌ ఎలాసాధ్యమో ఆలోచించాలి.