29, నవంబర్ 2010, సోమవారం

'గోవత్సం' కాడు గొప్పోడవుతాడా?

గోవత్సం అనే సంస్కృత పదానికి తెలుగులో ఆవుదూడ అని అర్థం. పశుసంపదను విక్రయించేటప్పుడు కొన్ని సర్వసాధారణ ప్రమాణాలుంటాయి. దూడ ఉన్న ఆవును అమ్మాల్సి వచ్చినప్పుడు ఆవుకు మాత్రమే ధరను నిర్ణయిస్తారు. దానితోపాటుగా ఉన్న దూడకు అప్పటికేమి విలువ ఉండదు. కొనుక్కునే వారికి ఉచితంగానే చేరుతుంటుంది. సమాజంలో కొంత మంది పరిస్థితి అలా ఉంటుంది. అమ్మకం విషయంలో ఆవుపక్కనున్న దూడకు విలువ లేనట్లుగానే పెద్దల పక్కనుంటూ సొంత వ్యక్తిత్వం లేకుండా ఆపెద్దలననుసరించే వారికి ఎవరూ తగినంత విలువనివ్వరు. ఆవాడొట్టి గోవత్సంగాడు వాడేంచేయలేడు. అనేలాంటి ప్రయోగాలున్నాయి.
మరి రాజకీయంగా కాంగ్రెస్‌పార్టీలో ఉన్న వైఎస్‌ జగన్‌కు ఇప్పటివరకు అదేపరిస్థితి. తండ్రి పుణ్యమాని ఆస్తి వచ్చింది. ఎంపీ పదవి వచ్చింది. తండ్రిపోయాక ఆస్తిని పెంచుకున్నాడు. కాని పదవిని పెంచుకోలేక పోయాడు. ముఖ్యమంత్రి కావాలని విఫలమయ్యాడు. తరువాత కాంగ్రెస్‌ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు. తల్లిలాంటి పార్టీకి దూరమయ్యాడు. పదవికీ దూరమయ్యాడు. ధనమయితే ఉంది. పార్టీని వదిలాక ప్రస్తుతం గోవత్సం కాడు కదా భవిష్యత్తులో ఎంతగొప్పోడవుతాడో చూడాలి.
వైఎస్‌ తనయుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. లేఖలో అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆమోదించారు. తనయుడి బాటలోనే వైఎస్‌ సతీమణి విజయలక్ష్మమ్మ నడిచారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆమె కూడా రాజీనామా చేశారు. స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంవల్ల డిప్యూటి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు విజయమ్మ లేఖ పంపారు. సంప్రదాయాలకనుగుణంగా రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని నాదెండ్ల చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి మండలి బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో దానికి రెండు రోజుల ముందు జగన్‌ రాజీనామా చేయడం కాంగ్రెస్‌ వర్గాలను ఒక్క కుదుపు కుదిపింది. జగన్‌ రాజీనామా వల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్‌ కూడా ఎమ్మెల్యేలనెవర్నీ రాజీనామా చేయవద్దన్నట్లు ఆయన మద్దతుదార్లు చెబుతున్నారు. ఒక వేళ జగన్‌ వెంట కొంత మంది ఎమ్మెల్యేలు నడిచినప్పటికీ ఆ లోటును పిఆర్‌పితో భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఆందుకు కొన్ని రోజులుగా పావులు కదుపుతూనే ఉంది. రెండో విడత, మూడో విడత జరిపిన ఓదార్పు యాత్రలోనే జగన్‌ తన రాజకీయ భవిష్యత్తుపై పరోక్షంగా సంకేతాలిచ్చారు. 'ఈ సహనం ఎన్నాళ్లుంటుందో తెలీదు' అని అన్నప్పుడే ఏదోక రోజు పార్టీ నుండి బయటికొస్తారని రాజకీయ విశ్లేషణలొచ్చాయి. కొత్త పార్టీ పెడుతున్నారన్న ఊహాగానాలూ కొంత కాలంగా వినపడుతున్నాయి.
కాంగ్రెస్‌పార్టీలో బీహార్‌ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ముసలం పుట్టింది. రోశయ్య రాజీనామా అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతుండగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమాడు కడప ఎంపి జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భార్య విజయలక్ష్మి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్‌రాజీనామాను వెంకటనే ఆమోదించారు. విజయమ్మ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. జగన్‌రాజీనామా అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల నిరసనతు వ్యక్త మయ్యాయి. కడపలో డిసిసి కార్యాలయానికి వైఎస్‌ కార్యాలయంగా మార్చేశారు. అనంతపురంలో డిసిసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కర్నూలులో ఇటలీగాంధీ డౌన్‌డౌన్‌ అంటూ ఆమె ప్లెక్సీనీ తగులబెట్టారు. ఆమె పోస్టర్‌ను చెప్పులతో కొట్టారు.

కామెంట్‌లు లేవు: