17, డిసెంబర్ 2013, మంగళవారం

65 పేజీలు 13 షెడ్యూళ్లు

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం 
                 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 2013 డిసెంబర్‌ 16న ప్రవేశపెట్టిన  పునర్వ్యవస్థీకరణ బిల్లులో 65 పేజీలు, 12 భాగాలు 13 షెడ్యూల్స్‌ ఉన్నాయి. మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు, రెండో షెడ్యూల్‌లో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వివరాలు, మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు,  నాలుగో షెడ్యూల్‌లో శాసనమండలి సభ్యుల విభజన, ఐదో షెడ్యూల్‌లో తెలంగాణా రాష్ట్రంలోని దళిత వర్గాల వివరాలు, ఆరో షెడ్యూల్‌లో తెలంగాణా రాష్ట్రంలోని గిరిజన వర్గాల వివరాలు, ఏడో షెడ్యూల్‌లో నిధులు, ఎనిమిదో షెడ్యూల్‌లో పింఛన్ల వివరాలు, తొమ్మిదో షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు, 10 షెడ్యూల్‌లో రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు, 11 షెడ్యూల్‌లో నదీజలాల నిర్వహణ బోర్డుల విధివిధినాలు, 12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్‌ విధివిధానాలు, 13వ షెడ్యూల్‌లో విద్య మౌలిక సదుపాయాల అంశాలు ఉన్నాయి. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. బిల్లు ప్రతులు ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు అందాయి. 17న జరిగిన బిఎసిలో 18, 19 తేదీల్లో  బిల్లుపై చర్చ జరగాలని నిర్ణయించారు. 
అందులోని ముఖ్యాంశాలు: 
»10 జిల్లాలతో కూడిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, 
»13 జిల్లాల సీమాంధ్రతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 
» పదేళ్లు మించకుండా ూమ్మడి రాజధానిగా హైదరాబాద్‌, పదేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తరాజధాని ఏర్పాటు. 
»కొత్తరాజధానిపై నిఫుణుల కమిటీ ఏర్పాటు. 
»నిఫుణుల కమిటీ బిల్లు పాసైన 45 రోజుల్లో రాజధాని ఏర్పాటుకు సంబంధిత నివేదిక అందించనుంది.
» పదేళ్ల తరువాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌.
» ప్రస్తుత గవర్నరే రెండు రాష్ట్రాలకు ూమ్మడి గవర్నర్‌గా కొనసాగింపు.
» గవర్నర్‌ పరిధిలోనే శాంతిభద్రతలు, రెవెన్యూ ప్రభుత్వ భవనాలు ూంటాయి. 
»ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 175 అసెంబ్లీస్థానాలు, 25 పార్లమెంటుసీట్లు, 50 మంది ఎమ్మెల్సీలు.
» తెలంగాణకు 119 అసెంబ్లీస్థానాలు, 17 ఎంపీసీట్లు, 40 మంది ఎమ్మెల్సీలు.
»ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు ఏర్పాటు. 
»అప్పటి వరకు ూమ్మడిగానే ప్రస్తుత హైకోర్టు.
» అనంతరం ఇది తెలంగాణకు చెందుతుంది. 
»మూడేళ్లపాటు పోలీస్‌ట్రైనింగుసెంటర్‌ కేంద్రం పరిధిలో ూంటుంది. 
»మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రైనింగు సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. 
»నదీజలాల నిర్వహణకు కేంద్ర ూన్నతస్థాయి మండలి ఏర్పాటు. 
»ఈ మండలంలో సభ్యులుగా కేంద్ర మంత్రి, ఇరు ప్రాంత సిఎంలు ూంటారు. 
»జాతీయ ప్రాజెక్టుగా పోలీవరం.
» ఇరు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర సహాయం. 
»సింగరేణి గనులు తెలంగాణకే. 
»జెన్‌కో పవర్‌ ప్లాంట్లు ఎక్కడుంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి.
»ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఎం, ఐఐఎన్‌ఇఆర్‌, ట్రిపుల్‌ ఐటి, ఎయిమ్స్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ. 
»రెండు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు.
» కేంద్రసహకారంతో తెలంగాణాలో ఒక ూద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు. 
»ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా దుగ్గిరాజుపట్నం వద్ద కొత్త మేజర్‌పోర్టు నిర్మాణం చేపడుతారు. ఇది 2013 లోపు పూర్తి అవుతుంది. 
»ఖమ్మంలో స్టీల్‌ప్లాంటు  ఏర్పాటు అంశాన్ని సెయిల్‌ పరిశీలిస్తోంది. 
»ఆర్టికల్‌ 371 `డి రెండు రాష్ట్రాలకు కొనసాగింపు.
» ప్రస్తుత ఆంధ్రసర్వీస్‌కమిషన్‌  ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుంది. 
»తెలంగాణాలో కొత్త సర్వీస్‌కమిషన్‌ ఏర్పాటు చేస్తారు. 
»ఆంధ్రప్రదేశ్‌  కొత్తరాజధానిలో ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. 
»విద్యాసంస్థలో  అడ్మిషన్‌ కోటాలు పదేళ్లపాటు యధాతథంగా ూంటాయి. 
»తెలంగాణాలోని అన్ని వెనుకబడిన ప్రాంతాలకు జాతీయ హైవే అథారిటీ ద్వారా రహదారుల నిర్మాణం కేంద్ర పరిశీలనలో పలు అంశాలు. 
» విశాఖపట్నం`చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు. 
» విశాఖ పట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ అంశం.  
»తెలంగాణాలో 4 వేల  మెగావాట్ల విద్యుత్‌ ూత్పత్తి ప్లాంటు నిర్మాణం. 
» ఆంధ్రప్రదేశ్‌లో కొత్తరైల్వేజోన్‌ ఏర్పాటు.
» హైదరాబాద్‌ నుంచి విడిపోయే ఆంధ్రప్రదేశ్‌  కొత్తరాజధానికి రాపిడ్‌ రెయిల్‌, రోడ్‌ కనెక్టివిటీ అంశాన్ని కేంద్రం పరిశీలన. 

కామెంట్‌లు లేవు: