మూడోస్థానానికి పడిపోయిన బిల్‌గేట్స్

అమెజాన్ చీఫ్ బెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ బెజోస్‌కు భారీగా భరణం సమర్పించుకున్నప్పటికీ 125బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్ తన సంపదలోని 35 బిలియన్ డాలర్లను గేట్స్ అండ్ మిలిందా సంస్థకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సంపద 107 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక ఆర్నాల్డ్ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్ 500 మంది ధనికుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆర్నాల్ట్ తొలిస్థానంలో నిలిచారు.
మహిళల్లో నాలుగో స్థానం మెకంజీదే..
అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకుని భరణం పొందిన మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్ నిలిచారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్ డాలర్లు. ప్రపంచ వ్యాప్తంగా 13 వస్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత స్థానంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 20.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్ శివ నాడార్ 92 స్థానంలో, కొటాక్ మహీంద్రా ఎండీ ఉదయ్ కొటాక్ 96స్థానంలో నిలిచారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి