

విజయవాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు రవాణా శాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య (Nani), రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆధ్వర్యంలో పెన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపకులు బడే ప్రభాకర్ అధ్యక్షతన సీనియర్ జర్నలిస్టులకు ఫోటో వీడియో జర్నలిస్టులకు అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సభను ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో సాహసంతో కూడుకున్న పని అని, ఈ ఫోటోలు నిరంతరం చిరకాలం జ్ఞాపకాలతో పాటు ప్రతి ఒక్క ప్రతిమలకు కార్యక్రమాలకు గుర్తింపుగా ఉండిపోతుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా జర్నలిజంలో వృత్తిలో పని చేస్తూ ఉన్న ఫోటోగ్రాఫర్లకు సన్మానించారు. కర్నూల్ సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధాకర్ గారికి సన్మానం చేశారు . ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా కర్నూలు జిల్లాలో ఎంపికయిన సుధాక రు ను. సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మంచి ఫోటో గుర్తింపు గా సన్మానం అందుకోవడం అదృష్టమన్నారు. ఇందులో పలువురు సీనియర్ నాయకులు పాత్రికేయులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి