28, డిసెంబర్ 2019, శనివారం

ఇవిఎం కుంభకోణంపై దేశవ్యాప్త ఉద్యమం

కాశీ నుంచి కన్యాకుమారి వరకు జాతా లు ,

జనవరిలో నూతన కార్యవర్గం ఎన్నిక,

బామ్‌సెఫ్‌, బిఎంఎం  జాతీయ సమ్మేళనం నిర్ణయం 

ప్రజాశక్తి`ప్రత్యేక ప్రతినిధి కర్నూలు

                    ప్రజా తీర్పును తప్పుదోవ పట్టిస్తున్న ఇవిఎం కుంభకోణంపై జనవరి 16 నుంచి ఏప్రెల్‌ 26 వరకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు జాతా నిర్వహించనున్నట్లు బామ్‌సెఫ్‌, భారత్‌ ముక్తిమోర్చా జాతీయ సమ్మేళనం తీర్మానిచింది. బామ్‌సెఫ్‌, మూలవాసీ, భారత్‌ ముక్తిమోర్చా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలులో నిర్వహిస్తున్న జాతీయ సమ్మేళనం శుక్రవారం ముగిసింది.  2019 డిసెంబర్‌  23 నుంచి 27 వరకు జరిగిన జాతీయ  సమ్మేళనానికి దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు, జాతీయ నాయకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక కార్యకర్తులు హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో పాతకమిటీని రద్దు చేశారు. 2020 జనవరి 11,12 తేదీల్లో డిల్లి లోని కరోల్‌ బాగ్‌ లో నిర్వహించే ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో  జాతీయ కమిటీని ఎన్నుకోనున్నామని బామ్‌సెఫ్‌ జాతీయ అధ్యక్షులు వామన్‌ మేశ్రమ్‌ ప్రకటించారు.  చివరి రోజు రాఖీగఢ డిఎన్‌ఎ తవ్వకాలు, వైజ్ఞానిక అన్వేషణ, సంచార జాతుల, తెగల, పరిశీలన, 2020లో ఎస్‌సి, ఎస్‌టి రాజకీయ రిజర్వేషన్ల పొడగింపు ప్రపంచీకరణ , ప్రయివేటీకరణ నేపథ్యంలో రిజర్వేషన్లపై , బడుగు ప్లిలల ఆరోగ్య సమస్య తదితర అంశాలపై చర్చ జరిపారు. భారత్‌ ముక్తిమోర్చా జాయతీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ విలాస్‌ ఖరత్‌ మాట్లాడుతూ హర్యానాలోని రాఖిగఢ తవ్వకాల్లో బయటపడిన మృతదేహాల డిఎన్‌ఎ పరీక్ష  ఆధారంగా బ్రాహ్మణులు భాతర దేశానికి సంబంధించిన వారు కాదని తేలిందని తెలిపారు. డాక్టర్‌ వసంత్‌ సిండే, నీరబ్‌ రాయ్‌ మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకు 2011లో డాక్టర్‌ మైకెల్‌ బామ్‌సెఫ్‌ ఫిర్యాదు మేరకు వసంత్‌ సిండేకు లీగల్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఈమెరకు లెప్ట్‌నెంట్‌ కల్నల్ పురోహిత్‌ ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య సమావేశంలో బ్రాహ్మణులు  భారతీయులు    కారన్న విషయాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఆతరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ 100 బాంఋలు  పేల్చి విధ్వంసం సృష్టించిందని తెలిపారు. భారత్‌ ముక్తిమోర్చాపార్టీ జాతీయ ఉపాధ్యక్షు దాస్‌రామ్‌నాయక్‌ మాట్లాడుతూ సంచార జాతులు ఈదేశంలో 11 కోట్ల   మంది ఉన్నారని తెలిపారు. బ్రాహ్మణులు  కేవం 3 కోట్లు ఉన్నారని తెలిపారు. సంచార జాతులకు సంఘనిర్మాణం , నాయకత్వం, భాష లేదన్నారు. అందుకే వారికి స్థిరనివాసం, రిజర్వేషన్లు, కావల్సిన సట్టిఫికెట్లు ఏమి లేవని అన్నారు. అదే 3 కోట్ల బ్రాహ్మణుకు అన్నీ ఉన్నాయని తెలిపారు. లoబాడ, బుడగజంగాలు, వడ్డెరులు, తదితర సంచార జాతుల కోసం ప్రత్యేక షెడ్యూులు తయారు చేసి రాజ్యాంగపరమైన ఫలితాలు వారికి దక్కేలా చూడాలన్నారు.

కామెంట్‌లు లేవు: