ఆ లక్ష్యానికి నాలుగేళ్ల ముందే దానిని సాధించామని చెప్పారు. వనరు, సమాచార పరంగా 2018-19లో నిర్వహించిన సర్వే నాలుగో దశ చాలా సమగ్రమైనది. 141 ప్రాంతాల్లోని 26,838 చోట్ల కెమెరాలు ట్రాప్‌లు (మోషన్‌సెన్సార్లతో అమర్చిన కెమెరాలు, జంతువు ఆ పరికాల ఎదుట నుంచివెళుతున్నప్పుడు ఫోటో తీస్తాయి) అమర్చారు. 1,21,337 చ.కి.మీ. (46,848 చ.మై) విస్తీర్ణంలో సర్వే జరిగింది. కెమెరా ట్రాప్‌లు మొత్తం 3,48,58,623 ఫోటోలు (వీటిలో 76,651 పులులు, 51,777 చిరుతలు, మిగిలినవి ఇతర జంతుజాలం) తీశాయి. వీటి నుంచి 2,461 పులులను (పులికూనలుకాక) చారలను గుర్తించే సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించారని గిన్నీస్‌బుక్‌సైట్‌లో రాశారు.
వన్య ప్రాణుల సంస్థ సాంకేతిక సాయంతో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ యంత్రాంగం పులుల జనాభా లెక్కింపు చేపడుతుంది. రాష్ట్ర అటవీ శాఖలు, వాటి భాగస్వాములు ఈ గణన చేపడతాయి. ప్రపంచవ్యాప్తంగా 50 పులుల సంరక్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియలు, మన దేశంలో చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్’ కార్యక్రమానికి సాటిరాలేదు. పులుల సంరక్షణలో భారత్ అగ్రస్థానంలో వుంది. భారత్ చేపట్టిన చర్యలను బంగారు ప్రమాణాలుగా ప్రపంచం భావిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి