13, జనవరి 2021, బుధవారం

ఎపి లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం అవాస్తవం : డిజిపి గౌతం సవాంగ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం అని ఎపి డిజిపి గౌతం సవాంగ్‌ ఐపిఎస్‌ స్పష్టం చేశారు. బుధవారం గౌతం సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు. దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఎపి లో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలుపరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం చర్చించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లో గత సెప్టెంబరు 5 వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్‌ తో అనుసంధానం చేశామన్నారు. 43,824 సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను ఎపి లోని అన్ని ఆలయాలకు కల్పిస్తున్నామని డిజిపి గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతోపాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను, ముఠాలను అరెస్ట్‌ చేశామన్నారు. గత సంవత్సరం (2020) సెప్టెంబర్‌ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్‌ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని డిజిపి ప్రకటించారు.

    కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. అలా ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నామని డిజిపి తెలిపారు. ఎపి రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు లో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతోపాటు సిట్‌ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది ఎంఒ అఫెండర్స్‌ ను ఇప్పటికే గుర్తించామని, వారందరినీ జియో మ్యాపింగ్‌ తో అనుసంధానం చేశామని చెప్పారు. వీరిపై నిరంతర నిఘాను కొనసాగించడంతోపాటు అవసరమైన వారిపై సస్పెక్ట్‌ షీట్స్‌ ను ఓపెన్‌ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఎపి లో దేవాలయాలకు, పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రతను ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ కల్పిస్తోందని స్పష్టం చేశారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిది అని, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డిజిపి కోరారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ 100 కి, దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా 9392903400 నెంబర్‌ కు సమాచారం ఇవ్వాలని డిజిపి గౌతం సవాంగ్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలుకు అందుబాటులో ఉంటుందని డిజిపి పేర్కొన్నారు.

5 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

ఏపీలో ఆలయాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపినందుకు సంతోషం. రామతీర్ధంలో రామప్రతిమకు అపచారం జరిగిందని తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పైగా ఆ విగ్రహం మరలా తిరుపతిలో తయారు చేస్తున్నారు అని కూడా ప్రచారం ఒకటి! ఏమీ జరగని దానికి కొత్త విగ్రహాన్ని ఎందుకు చేస్తారూ?

ప్రజలందరూ ప్రభుత్వంవారూ, పోలీసు వారూ చెప్పేవి మాత్రమే నమ్మాలని విన్నపం చేస్తున్నాను.

ప్రభుత్వం మాటలో పోలీసు మాఃనో నమ్మక ఏమన్నా మాట్లాడటం ప్రమాదకరం అని అందరూ గమనించగలరు.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

ఆయన "సురక్షితం" అన్నట్టు లేదు, "దాడులు" జరగ లేదని అన్నారు. కొందరు నేరస్థులు రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్న చిల్లర పనులకు "దాడి" అనే పెద్ద బిరుదు ఇవ్వనక్కర లేదని వారి తాత్పర్యం కాబోలు!

PS: good news గత దార్శనిక హయాములో "సుందరీకరణ" పేరిట ప్రభుత్వమే దగ్గరుండి పని కట్టుకొని నేలకూల్చిన (అన్నీ కాకపోయినా కొన్ని) గుడుల పునర్నిర్మాణం మొదలయింది.

Chiru Dreams చెప్పారు...


బుర్రున్నోడికెవడికైనా "ఇలాంటి పనులు చేసేవారు... మత పిచ్చతోనో, రాజకీయ అధికారంకోసమో చేస్తారు" అని తెలిసిపోతుంది.

జగన్ కే గనక మత పిచ్చ వుంటే, పుష్కరాల్లో మునగడు.. తిరిపతి ధర్శనానికి వెల్లడు. అర్జెంటుగా క్రీస్తు రాజ్యం ఇక్కడ దిగబెట్టి పరలోకంలో టికెట్ రిజర్వ్ చేసుకోవాలనే మతపిచ్చగాల్లకే ఇది అవసరం.

ఇక రెండో పాయింట్(రాజకీయ అధికారం): దీనికోసం ఎంత నీచానికైనా దిగజారేది ఎవరో మతపిచ్చగాల్లకి తప్ప అందరికీ తెలుసు.

Chiru Dreams చెప్పారు...

>>ప్రభుత్వం మాటలో పోలీసు మాఃనో నమ్మక ఏమన్నా మాట్లాడటం ప్రమాదకరం అని అందరూ గమనించగలరు.

అందుకేనా రోజూ బండనాయుడు అంత నోరేసుకోని బోకుజ్యోతిలో జగన్ కి వార్నింగులిస్తాకూడా.. ఇంకా బయట తిరుగుతున్నాడూ? ఏం కామెడీ పీసుల్రాబాబూ..

Chiru Dreams చెప్పారు...

"ఏడు ఘటనల్లో నేరుగా టీడీపీ నేతల ప్రమేయం

రెండు ఘటనల్లో నేరుగా బీజేపీ నేతల ప్రమేయం"


ఈ విషయం నమ్మారంటే మాత్రం... మీరు హిందూ వ్యతిరేకులే, దేశద్రోహులే.