3, అక్టోబర్ 2025, శుక్రవారం

ఆటవిక క్రీడకు అడ్డుకట్ట పడదా

`బన్నీ ఉత్సవం పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన
 `భక్తి పేరుతో  పాతకక్షలు తీర్చుకుంటున్నారు
`ఎంతకాలం మూఢనమ్మకాలు  

             కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో దసరాకు
రంలో అడుగడుగునా మానవహక్కులను ఉల్లంఘిస్తున్నారు. దేవరగట్టు కర్రల సమరం చరిత్రను పరిశీలిస్తే కర్నూలు జిల్లా, హోళగుంద మండలం, దేవరగట్టులో కొండపై శ్రీ మాళ మల్లేశ్వర స్వామి (శివుడు), మాలమ్మ (పార్వతీ దేవి) గుడి ఉంది.  మాళ మల్లేశ్వర స్వామి మని, మల్లాసురులు అనే ఇద్దరు రాక్షసులు సాధువులకు ఆటంకం కలిగించే వారని, వారిని  సంహరించారని చెబుతారు.   చనిపోయే ముందు ఆ రాక్షసులు, తాము మరణించిన దసరా రోజున నరబలి కావాలని శివపార్వతులను కోరారని,  శివపార్వతులు ఆ కోరికను తిరస్కరించారని చెబుతారు. ఆ రాక్షసుల కోరిక మేరకు దసరా పండుగ రోజున దేవరగట్టు ప్రాంతంలో రక్తం చిందుతుందని భక్తులు నమ్ముతారు. దీనికి గుర్తుగా ఏటా రక్షపడి వద్దకు వచ్చి కొంత రక్తాన్ని సమర్పించడం ఆనవాయితీగా ఉండేది.  మరొక నమ్మకం ప్రకారం, పూర్వకాలంలో విష సర్పాలు, జంతువుల నుండి రక్షణ కోసం భక్తులు దివిటీలు, కర్రలతో కొండపైకి వెళ్లి దేవుడి విగ్రహాలను తాకడానికి పోటీ పడేవారు. ఈ క్రమంలోనే గాయాలయ్యేవని చెబుతారు. కాని గత 40 యేళ్ల నుంచి ఈతంతు గ్రామాల మధ్య పోటీగా మారింది. మాళ మళ్లేశ్వరుల విగ్రహాలను స్వాధీనం చేసుకునే క్రమంలో కర్రలతో కొట్టుకుంటారు. ప్రతి ఏడాది దసరా సందర్భంగా వందలాది మంది గాయపడటం ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారు.  ఈఏడాది కూడా ఇద్దరు మతి చెందారు. 78మందికి పైగా గాయపడ్డారు. రక్తపాతం జరగకూడదని పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం రాత్రి 8 గంటల నుంచి దేవర గట్టు జనం రావడం మొదలైంది... రాత్రి 12గంటల తరువాత రింగ్‌ కర్రలతో వేలాది మంది విడతల వారీగా దివిటీలు, డప్పు శబ్దం చేస్తూ వచ్చారు. 1-30 గంటలకు లక్షకు పైగా జనం చేరుకున్నారు.  స్త్రీలు, పురుషులు 50 వేలకు పైగా సందర్శకులు వచ్చారు. కిక్కిరిసిన జనంతో వాతావరణం గాంభీరంగా మారుతుంది. నిర్వాహకులు మూడు ఔట్స్‌ (భారీ శబ్దం తో టపాసులు) పేల్చుతారు. సమీపంలో  సందర్భకులు, విఐపిలకోసం నిర్మించిన భవనాలు ఆశబ్ధాలకు కదులుతాయి. ఒళ్లుగగుర్పాటు కలిగించే ఈ చర్యలు అనేక ఉంటున్నాయి. ప్రధానంగా కర్రలతో కొట్టుకుని చావడం  అనేది  మానవ హక్కుల ఉల్లంఘన.
ఫలించని అవగాహన కార్యక్రమాలు
                 దేవరగట్టు కర్రల సమరంలో హింసను అరికట్టేందుకు పలువురు, మేథాలువు, జెవివి శాస్త్రీయతను కోరుకునే వారు, రెవెన్యూ , పోలీసు అధికారులు దేవరగట్టు సమీప గ్రామాలకు వెళ్లి అవగాహన కల్ఫించినా ఫలితం లేదు. అవగాహన కల్పించిన సమయంలో గ్రామాల్లో వృద్ధులు, పిల్ల్లలు మాత్రమే ఉంటున్నారు. యువకులు ఇక్కడ ఉపాధి లేక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస పోతారు. వారంతా దసరా పండుగలకు వస్తారు.  ఈసారి 20 యేళ్లనుంచి 30 యేళ్లలోపు వారే అధికం. ఎందుకు కర్రలతో వస్తారని  వారిని వివరణ కోరితే మా పూర్వికుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అందుకే మేము వస్తున్నాం. దేవుని కోసం వస్తున్నామని చెబుతున్నారు.
                   మూఢనమ్మకాలు, అనాగరిక చర్యలు , సాంఘిక దురాచారాలను రూపు మాపేందుకు  గతంలో కొందరు మహానుభావులు చేసిన కృషి ఫలించింది. సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతు వివాహాలు వంటికి పోయాయి. ఇది కూడా ఒక ఆటవిక చర్య. యథేచ్చగా మానవహక్కులు ఉల్లంఘిస్తుంటే పాలకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
టిడిపి గ్రూపుల మధ్య వివాధంగా మారింది
                ఈసారి టిడిపి గ్రూపుల మధ్య వివాదంగా మారింది. వీరభద్రగౌడ్‌, వైకుంఠం సోదరుల మధ్య ఉన్న తగాదాలు బన్ని ఉత్సవంలో ప్రతిబింబించినట్లు కొందరు చెప్పారు. ఈఉత్సవానికి  రెండు రోజుల క్రితం కలెక్టర్‌ కర్నూలు ఎస్‌పి కూడా ప్రకటించింది అదే. కొందరి కక్షసాధింపు  కోసం ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. వారిని గుర్తించాం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలూరు నియోజకవర్గ  మాజీ టిడిపి ఇన్‌చార్జి అనుచరులను చంపేస్తామని ముందే హెచ్చరికలు చేసినట్లు చర్చ జరిగింది. ఈసారి ఆలూరు మండలం అరికెర గ్రమానికి చెందిన వారికి ఎక్కువ మందికి గాయాలయ్యాయి. ఒక టిడిపి కార్యకర్త కూడా మాట్లాడుతూ తగాదాలున్నాయని అందుకే ఘర్షణ జరిగిందని చెప్పాడు.
నెరణిక గ్రామానికి చెందిన మళ్లికార్జున గౌడ్‌ నిర్వహకులలో ఒకరు మాట్లాడుతూ ఇక్కడ కేవలం భక్తికోసమే వస్తున్నారు. కొట్టుకోవడానికి కాదు అన్నారు. మధ్యం తాగువచ్చిన వారికి దెబ్బలు తగులుతాయి. మిగతావారికి ఏమి కాదని చెబుతాడు. నేను 40 ఏళ్లనుంచి పాల్గొంటున్నా నాకు ఏమి కాలేదని చెప్పారు.