నెలాఖరున పోలింగ్
14వ తేదీ నాటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు
వేగవంతంగా ఎన్నికల ప్రక్రియ

ముగిసిన వార్డుల పునర్విభజన
ప్రభుత్వం
ఇటీవల ఇచ్చిన ఆర్డినెన్స్ మేరకు రాష్ట్రంలో వార్డుల సంఖ్య పెరిగింది.
కొత్త పురపాలక సంఘాల ఏర్పాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల విస్తరణ
నేపథ్యంలో కొత్త వార్డులు ఏర్పడ్డాయి. వార్డులను ప్రకటించి ప్రజల నుంచి
అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు వాటిని పరిష్కరించి పురపాలక సంఘాలు, నగరపాలక
సంస్థల్లో పునర్విభజన మేరకు ఆదివారం వార్డులను ఖరారు చేశారు. కొత్త
వార్డుల ప్రకారం ఈ నెల 14వ తేదీ లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను
గుర్తించి ప్రకటించనున్నారు. ఇది పురపాలక ఎన్నికల నిర్వహణలో కీలకమైన
రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదిక కానుంది. పోలింగ్ కేంద్రాల ప్రకటనకు ఈ నెల
18వ తేదీ వరకు గడువు ఉంది. కానీ తాజాగా ఈ నెల 14 లోపు పురపాలక ఎన్నికల
ముందస్తు ప్రక్రియను పూర్తి చేసే నేపథ్యంలో ఈ షెడ్యూలు కూడా మారనుందని
తెలిసింది. ఈ నెల 14వ తేదీ లోపే పోలింగ్ కేంద్రాలను గుర్తించి
ప్రకటించనున్నారు.
పరోక్ష పద్ధతిలోనే ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక
పరోక్ష పద్ధతిలోనే ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక
పురపాలక
సంఘాల ఛైర్మన్లు, నగరపాలక సంస్థల మేయర్లను ఈ సారీ పరోక్ష పద్ధతి ద్వారానే
ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పురపాలక చట్టం నేపథ్యంలో ఈ
అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో చర్చించారు. పురపాలక చట్టంలో సమూల
మార్పుల నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతి
ద్వారా నిర్వహించడం బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఎన్నికలను ఈ
నెలాఖరులోపు పూర్తి చేయాలనే లక్ష్యం నేపథ్యంలో ఈ సారీ పరోక్ష పద్ధతి
ద్వారానే ఎన్నుకునే విధానంతో ముందుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రక్రియ
దీనికి అనుగుణంగానే సాగుతోంది. పురపాలిక ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో
పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు తాజా షెడ్యూలు ఇది
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు తాజా షెడ్యూలు ఇది
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ముసాయిదా ప్రచురణ : జులై 10
అభ్యంతరాల స్వీకరణకు గడువు : జులై 11, 12 తేదీల్లో
అభ్యంతరాల పరిష్కారం : జులై 13
తుది జాబితా ప్రచురణ : జులై 14
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి