11, అక్టోబర్ 2019, శుక్రవారం

పల్లవుల నగరంలో మోడి జిన్ పింగ్



  చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు మోదీ అపురూపమైన బహుమతులు ఇచ్చారు. అనధికారిక చర్చలు జరిపేందుకు మహాబలిపురం వచ్చిన ఇరువురు నేతలు ఆత్మీయ స్నేహితులుగా మెలిగారు. భరత నాట్యం, కథకళి నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. ఈ నృత్యాల వివరాలను జిన్‌పింగ్‌‌కు మోదీ తెలిపారు. ఇరువురు నేతలు కళాకారులతో ఫొటో దిగారు. అంతకుముందు ఉభయులు మహాబలిపురంలోని శిల్పాలను తిలకించారు. మోదీ ఈ శిల్పాల ప్రత్యేకతను జిన్‌‌పింగ్‌కు వివరించి చెప్పారు. ఇరువురు కొబ్బరి నీళ్ళు తాగారు. జిన్‌పింగ్‌కు మోదీ స్వయంగా కొబ్బరి బొండం ఇచ్చారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు మోదీ నృత్య సరస్వతి చిత్ర పటం, నచియార్‌కోయిల్ హంస దీపం బహుమతిగా ఇచ్చారు. తంజావూర్ పెయింటింగ్‌ ప్రముఖుడు బి లోగనాథన్ రూపొందించిన నృత్య సరస్వతిని జిన్‌పింగ్‌కు బహూకరించారు. ఇది 16వ శతాబ్దంనాటి చిత్ర కళా రూపమైన తంజావూర్ పెయింటింగ్. నాయక, మరాఠా రాజుల పరిపాలనా కాలంలో ఈ చిత్ర కళ వృద్ధి చెందింది.

కామెంట్‌లు లేవు: