11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందా?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలుతుందని ఒక చర్చ నడుస్తోంది. రాజకీయ పరిశీలకుల అంచనాలకు అందకుండా ఎపిలో మార్పులు జరుగుతున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించాక ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనడిచింది. రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే ఎవరనేది తరువాత నిర్ణయిస్తామని అధిష్టానం చెప్పింది. ఈలోపు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కొందరు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ఆస్తికి మాత్రమే జగన్‌ వారసుడు...రాజకీయ వారసుడు కాదు అని ఒకచర్చ నడిచింది. ఇదిలా ఉండగానే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వ్యవహారంతో రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుంది మధ్యంతర ఎన్నికలు వస్తాయేమో అనుకున్నారు. తెలంగాణా అంశాన్ని అధ్యయనం చేయడానికి నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాగానే రాష్ట్రం అళ్లకల్లోలం అవుతుందని ఒక విశ్లేషణ నడిచింది. కాంగ్రెస్‌ అధిష్టానం ఈలోపు రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసి రోశయ్యను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించింది. ఇటు జగన్‌కు, అటు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని రెండింటినీ అదుపులోకి తెచ్చే తరహాలో అధిష్టానం ఆలోచించింది. ఎవరూ ఊహించని తరహాలో కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణావాడా, రాయలసీమవాడా అనే చర్చనడిచింది. ఈలోపు శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు రానే వచ్చింది. రిపోర్టులో ఏమున్నా కాంగ్రెస్‌ అధిష్టానమే తెలంగాణా అంశాన్ని తేల్చాలనేది తెలిసిందే. జగన్‌పార్టీ పార్టీ పెడుతాడు ఈలోపు మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ వెంట వెళ్తారని ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని విశ్లేషకులు భావించారు. తెలంగాణా అంశాన్ని తేల్చక ముందే జగన్‌పార్టీ రాకముందే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి అధిష్టానం పావులు కదిపింది. కాంగ్రెస్‌లో విలీనం కావడానికి ప్రజారాజ్యం అంగీకరించింది. రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో మెజార్టీ ఓటింగుకోసం ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టే ప్రయత్నం చేసింది. చర్చబండ మొదలెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రచ్చబండలో వచ్చిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించి త్వరలో మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈలోపు తెలంగాణా వాదులు ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటిస్తారు. మరో సారి మున్సిపల్‌ ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకోవాలని చూస్తారు. పుణ్యకాలం దగ్గర పడుతుంది. ప్రజల సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కో అంశాన్ని ఇలా కాంగ్రెస్‌ దాటుతూ చివరికి తెలంగాణాలోని టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని తెలంగాణా రాష్ట్రం ప్రకటించడానికి ప్రయత్నిస్తుంది. 2013 వరకు తెలంగాణా విషయం ఎటూ తేల్చదు. 2013లో కూడా ఎందుకు తేల్చుతుందంటే తెలంగాణాలో ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. సెంటిమెంటుతో ఉన్న ప్రజలు ఇతర పార్టీలను అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి తెలంగాణా అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. తెలంగాణా వాదులు ఉద్యమం ఉదృతం చేస్తే 2013లోపే ఒక నిర్ణయం తీసుకుని తెలంగాణాలోనూ సీమాంధ్రలోనూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తుంది. కాని అంత సులభంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని వదులుకునే పని కాంగ్రెస్‌ మాత్రం చేయదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రెండు రాష్ట్రాలు డిస్టర్బ్‌ అయితే యుపిఎ -2కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎక్కువమంది ఎంపీలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌వాళ్లు ఉండటం ప్రధాన కారణం. కాబట్టి కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని 2014 వరకూ కాపాడుకోచ్చు. అవినీతి, అధికధరలు, ప్రజల అన్ని రకాల సమస్యలు పెరుగుతున్నాయి. వాటిలో డబ్బుతో ముడిపడి ఉన్న అంశాలు కాకుండా కొన్నింటికి ఈలోపు పరిష్కారం చూపవచ్చు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లేందుకు స్థానిక ఎన్నికలు, తెలంగాణా వేర్పాటు వాదం వంటి వాటిని చర్చకు తెస్తారు పాలకులు. ప్రజలు అర్థం చేసుకుని తిరగబడనంతకాలం ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అవిశ్వాసం పెడతామంటున్నా, అది జంగన్ క్యాంపును లేపడానికే. తెరాస కోసం కాకపోయినా ప్రధాన ప్రత్యర్థిగా తెదెపా ఎలాగూ సపోర్ట్ చేస్తుంది. అందరినీ లేపి తాము కాంగ్రెస్ కొంగుచాటున తెరాస దాక్కున్నా ఆశ్చర్యం లేదు. ప్రరాపా కన్నా హీనమైన దివాళాకోరు పార్టీ కాకున్నా తేడా అంత ఎక్కువేం కాదు. ఆఖరున తెరాస వాళ్ళే అవిశ్వాసం వెనక్కితీసుకుని మనకు వినోదం పంచుతారు. ప్రరాప అంతలా కాకున్నా, తెరాస కాంగ్రెస్ ఏజంట్ పార్టీ అన్నది తెలుస్తూనేవుంది.