7, మే 2015, గురువారం

‘చంద్ర’కుమారులు

                                                            
ఇక్కడ తండ్రులు.. అక్కడ కొడుకులు
  అమెరికాలో కేటిఆర్‌, లోకేష్‌ల బిజీబిజీ
     రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడులే లక్ష్యం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభివృద్ధికి గంటల తరబడి తీరికలేకుండా ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారు. కెసిఆర్‌ ఢల్లీిలో ఉంటే, చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరి తనయులు మంత్రి కేటిఆర్‌, లోకేష్‌ అమెరికాలో బిజీబిజీగా ూన్నారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ ఇద్దరు యువనేతలు అమెరికాలో వ్యాపార దిగ్గజాలను కలుసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బబామాతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందని టిఆర్‌ఎస్‌, టిడిపి నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టబడులే లక్ష్యంగా మంత్రి కేటిఆర్‌ ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌ నుండి అమెరికాకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం కేటిఆర్‌ వాషింగ్టన్‌ డిసీలో జరిగిన పలు సమావేశాల్లో పెట్టుబడుల అవకాశాల మీద మాట్లాడారు. అమెరికాలో భారత రాయబారి అరుణ్‌కుమార్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం కేటిఆర్‌ బోయింగ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు మార్క్‌ ఎలెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విమానయాన, రక్షణరంగాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న ప్రాధామ్యాలను మంత్రి వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మంత్రి అభ్యర్థనపై బోయింగ్‌ సంస్థ స్పందిస్తూ.. త్వరలోనే రాష్ట్రానికి ప్రతినిధి బృందంను పంపనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఐటీ దిగ్గజ్జం హెచ్‌పీ సంస్థ ఉపాధ్యక్షుడు సువర్ణో బెనర్జీతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. హెచ్‌పీ ప్రింటర్ల యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పాలని కోరారు. వాటర్‌గ్రిడ్‌, మిషన్‌ కాకతీయలపైనా కేటిఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా వాషింగ్టన్‌ డిసి ఎన్నారైలు మిషన్‌ కాకతీయకు 50 వేల అమెరికన్‌ డాలర్లు విరాళాన్ని అందజేశారు.తెలుగుదేశం పార్టీ యువనేత, ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్‌ పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. మూడు రోజులక్రితమే అమెరికా చేరుకున్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన బిజీబిజీగా గడిపారు. ఏపీలోని వనరులను, అవకాశాలను వినియోగించుకుని విరివిగా పెట్టుబడులు పెట్టడంతో పాటు, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరారు. సిస్కో ఎగ్జిక్వూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ గ్లోబలైజేషన్‌ ఆఫీసర్‌ విమ్‌ ఎల్‌ ఫ్రింక్‌తో లోకేష్‌ భేటీ అయ్యారు. వైజాగ్‌లో తమ పరిశ్రమను పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యప్రముఖల్లో ఒకరైన వినోద్‌ ఖోస్లాతోనూ ఆయన సమావేశమయ్యారు. ఇంకా అమెరికా ప్రిసిడెంట్‌ అడ్వయిజరీ బోర్డులో సభ్యుడైన అడోబో సిఇఓ శంతనునారాయణను కలుసుకున్నారు.


కామెంట్‌లు లేవు: