5, నవంబర్ 2015, గురువారం

మహాకూటమికే మొగ్గు !


                                                                ఎగ్జిట్‌ పోల్స్‌వెల్లడి
                                                              ముగిసిన పోలింగ్‌ ఘట్టం
                                                                8న బీహార్‌ భవితవ్యం
    పాట్నా :
బీహార్‌ శాసభసభ ఎన్నికల్లో మహాకూటమికి గెలుపు అవకాశాున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన  ఆయా వార్తా సంస్థలు ప్రకటించాయి.  ఎన్నిక సమరంలో పోలింగ్‌ ఘట్టం ముగిసింది. 2015 నవంబర్‌ 5న జరిగిన చివరి ఐదో విడతలో 59.46 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 56.8 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. ఫలితాలు ఈ నెల ఎనిమిదో తేదీన రానున్నాయి. చివరి దశ పోలింగ్‌ ముగిసిన వెనువెంటనే వివిధ వార్తా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌తో హోరెత్తించాయి. ఎన్డీయే, మహాకూటమి హోరాహోరీగా స్థానాలు కైవసం చేసుకోనున్నాయని తెలిపాయి. అయితే  స్వల్పఆధిక్యతతో మహాకూటమే పైచేయి సాధించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేశాయి. టైమ్స్‌నౌ వార్తా సంస్థ ఎన్‌డియేకు 111, మహాకూటమికి 122, ఇతరులు 10 సీట్లు గొచుకునే అవకాశం ఉందని చెప్పింది.   ఎన్‌డిటివి ఎన్డీయేకు 116, మహాకూటమికి 120, ఇతరుకు ఏడు వస్తాయని చెప్పింది. న్యూస్‌ఎక్స్‌ ఎన్‌డియేకు 90 నుంచి100, మహాకూటమికి 130 నుంచి140, ఇతరుకు 13 నుంచి 23  వస్తాయని ప్రకటించింది.  ఇండియా టుడే ఎన్‌డియేకు 112 నుంచి113, మహాకూటమికి 113నుంచి127, ఇతరులకు ఆరు వస్తాయని తేల్చింది. టుడేస్‌ చాణిక్య మాత్రం ఎస్‌డియేకు 155, మహాకూటమికి 83 వస్తాయని ఎన్‌డియేకు అనుకూలంగా ఫలితాలుంటాయని తేల్చింది. అయితే నవంబర్‌ 8న ఎన్నిక లఫలితాలు వచ్చాక ఎవరి అంచనాలు ఏమిటనేది తేల నుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు లేవు: