8, నవంబర్ 2015, ఆదివారం

‘మహా’ ప్రభంజనం


                                                        బీహార్‌లో నితీష్‌కే పట్టం
                                                    చావుదెబ్బతిన్న కాషాయదళం
                                                   జెడియు కూటమి అఖండ విజయం
                                                        మూడుచోట్ల లెఫ్ట్‌ గెలుపు

               బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమికి 178, ఎన్‌డిఏ కూటమి 58, లెఫ్ట్‌ప్రంట్‌ 3, ఇతయి 4 స్థానాలు గెలుచుకున్నారు.  ఆయా వార్తా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ మహాకూటమికి అనుకూలంగా వెల్లడించాయి. అయితే తక్కువ సీట్లతో గెలుస్తుందని ప్రకటించాయి. అంచనాకు మించి భారీ మెజార్టీతో విజయం సాధించింది. బిజెపికి  మరో గట్టి  ఎదురుదెబ్బ తగిలింది. మొన్నఢిల్లీలో  నేడు బీహార్‌లో అది  ఘోర పరాజయాన్ని చవిచూసింది. మోడీ ప్రభుత్వ 18 మాసాల పాలనపై బీహార్‌ ప్రజులు తమ అసమ్మతిని స్పష్టంగా తెలియజేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాను తలకిందు జేస్తూ  జెడియు నేతృత్వంలోని మహా కూటమికి మూడిరట రెండొంతులు మెజార్టీతో తిరుగులేని విజయం చేకూర్చారు. ఈ హ్యాట్రిక్‌ విజయంతో నితీష్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. గోవధ,  గొడ్డు మాంసం, రిజర్వేషన్లు వంటి వాటిని ముందుకు తీసుకొచ్చి దేశంలో అసహనాన్ని పెంచి, రాజకీయ లబ్ధి పొందాలని చూసిన  బిజెపికి తగిన శాస్తి చేశారు. మతోన్మాద శక్తులపై లౌకిక కూటమి సాధించిన ఈ విజయం  బీహార్‌ రాజకీయాల్లోనే గాక దేశ రాజకీయాల్లోనూ కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. జెడియు, ఆర్జెడి మద్దతుదారులు రాష్ట్ర వ్యాపితంగా  బాణ సంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడంతో బీహార్‌కు మూడు రోజుల ముందే దీపావళి వచ్చినట్లుయింది. ఈ పరిణామంతో  వచ్చే శీతాకాల సమావేశాల్లో  కార్పొరేట్‌  అనుకూలబిల్లు,  జిఎస్‌టి, కార్మిక చట్ట సవరణ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తున్న మోడీ సర్కార్‌కు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకానుంది.

కామెంట్‌లు లేవు: