10, నవంబర్ 2015, మంగళవారం

అంబేద్కర్‌ దార్శనికత పై చర్చించాలి

                                                             
   సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌
                        న్యూఢల్లీి : ఈ నె 26 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మొదటి రెండు రోజును అంటే 26, 27 తేదీలను డా॥బి.ఆర్‌.అంబేద్కర్‌ 125వ జయంతిని పాటించేందుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు  మీడియా వార్తలు తెలుపుతున్నాయి. కానీ ఈ రెండు రోజును పూర్తి చేయని ఎజెండాలను పూర్తి చేయడానికి, సామాజిక న్యాయంపై అంబేద్కర్‌ దార్శనికతను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కోరింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు రంగానికి రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతమున్న రాజ్యాంగ నిబంధనను విస్తరించేందుకు చట్టాన్ని చేయడం, అలాగే లోక్‌సభలో ఆమోదించినా రాజ్యసభలో పెండిరగ్‌లో వున్న ఎస్‌సి ఎస్‌టి అత్యాచారా నిరోధక బిల్లును పరిష్కరించడం వంటి చర్యను ఈ రెండు రోజుల్లో చేపట్టాలని పొలిట్‌బ్యూరో కోరింది. ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికకు చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించే బిల్లును కూడా ఆమోదించాలని, ఎస్‌సి, ఎస్‌టి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు జరగాలని కోరింది. ఇదేమీ ప్రత్యేక సమావేశం కాకపోయినప్పటికీ, భారత సమాజంలో సిగ్గుచేటైన విధంగా పరిణమించిన ‘పుట్టుక, వారసత్వం ప్రాతిపదికన అసమానత’ను నిర్మూలించడానికి సమగ్రమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అత్యావశ్యకత వుందని దాని కోసం ఈ రెండు రోజులు కేటాయించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. అంబేద్కర్‌ దార్శనికతను ముందుకు తీసుకెళ్ళడానికి భారత పార్లమెంట్‌ చేయాల్సిన కనీసచర్య ఇదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అంబేద్కర్‌ జయంతిని జరుపుకు నేందుకు, ఆయన్ని స్మరించేందుకు ఇది చక్కటి మార్గమని తెలిపింది.

కామెంట్‌లు లేవు: