
ఇప్పటివరకు కశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ రీజియన్లుగా వ్యవహరించేవారు. కాగా, జమ్ములో 10 జిల్లాలు, కశ్మీర్‌లో 10, లద్దాఖ్‌లో రెండు జిల్లాలు ఉండేవి. తాజా కేంద్రం నిర్ణయంతో లెహ్, కార్గిల్ జిల్లాలతో కూడిన లఢఖ్ రీజియన్ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. పది జిల్లాలతో కూడిన కశ్మీర్‌ను మరో పది జిల్లాలతో కూడిన జమ్ముతో కలిపి చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు.
జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ఆమోదానికి రానుంది. అలాగే వీటితో పాటు అధికరణ 370ని కేంద్ర రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి