
ఇప్పటి వరకు వి.జి.సిద్ధార్థే ఈ కంపెనీకి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. 29వ తేదీ నుంచి ఆయన కనిపించకపోవడంతో నిన్న సీడీఈ రెగ్యూలేటరీలకు ఈమేరకు సమాచారం అందజేసింది. కంపెనీని నిపుణుల సాయంతో నిర్వహిస్తూ ముందుకు తీసుకెళతామని పేర్కొంది. నిన్న 20శాతం.. నేడు 19శాతం మేరకు సీడీఈ షేర్లు కుంగాయి.
బోర్డులో మిగిలిన సభ్యలు వీరే..
మాళవికా హెగ్డే: దివంగత వి.జి.సిద్ధార్థ సతీమణి ఈమె. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కుమార్తె కూడా. 2008 నుంచి గ్రూపు నిర్వహించే ఆతిథ్య వ్యాపార కార్యకలాపాలకు బాధ్యురాలు.
డాక్టర్ ఆల్బర్ట్ హైరోనిమస్: స్వతంత్ర డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు 11 ఏళ్ల నుంచి మైండ్‌ట్రీ బోర్డులో కూడా ఉన్నారు. బాష్ రెక్సోర్త్ ఏజీలో బోర్డులో కూడా ఆయన పనిచేశారు. మాన్నెస్‌మన్న బాష్ గ్రూప్‌తో 30ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన 2003లో మోటార్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్‌గా పనిచేశారు.
సంజయ్ ఓంప్రకాశ్ నాయర్: నాన్ ఎగ్జిక్యూటీవ్, నామినీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం కేకేఆర్ ఇండియాకు సీఈవోగా కూడా పనిచేస్తున్నారు. 2009లో కేకేఆర్‌లో చేరడానికి ముందు ఆయన సిటీగ్రూప్‌లో 24ఏళ్ల పనిచేశారు. ఆయన 2002-2009 మధ్యలో సిటీ గ్రూప్ భారతీయ విభాగం సీఈవోగా కూడా విధులు నిర్వహించారు.
సులక్షణ రాఘవన్: ప్రస్తుతం ఈమె లాండోర్ ముంబయికి ఎండీగా పనిచేస్తున్నారు. ఇదే సంస్థలో 18ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె శాన్ఫ్రాన్సిస్కోలోని లాండోర్స్ కార్యాలయంలో కూడా పనిచేశారు. మేనేజర్, బ్రాండ్ వ్యూహకర్త, కార్పోరేట్ వ్యూహకర్త, క్లైంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.