22, ఆగస్టు 2010, ఆదివారం

ఈ బిడ్డకు ప్రాణం పోయండి

ఈ  బిడ్డకు ప్రాణం పోయండి
పేదింటి అబ్బాయికి హిమోఫిలియా వ్యాధి
ఇంజక్షన్‌ ఖరీదు రూ. 4 వేలు
ఆపరేషన్‌ ఖర్చు రూ. 10 లక్షలు
దాతల కోసం తల్లిదండ్రుల ఆరాటం 
         మాయదారి రోగం మాబిడ్డకొచ్చింది. మందుల ఖర్చు భరించలేకున్నాం.. ఎవరైనా ఆదుకోకపోతే బతకడం కష్టం... నాబిడ్డకు ప్రాణం పోయండి... అంటూ తల్లిదండ్రులు వేడుకోవడం చూస్తే తప్పక ఆదుకోవాలనిపిస్తోంది. హిమోఫిలియా ఇది ఏ వెయ్యి మందిలోను ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుడికి ఏ చిన్న గాయమైనా రక్తం ఆగకుండా శరీరం నుంచి పోతూనే ఉంటుంది. అతి ఖరీదైన ఇంజక్షన్‌ వాడినప్పుడే ఈ రక్త ప్రసరణ ఆగుతుంది. ఇలాంటి రోగం ఓ పేదింటి అబ్బాయిని పట్టిపీడిస్తుంది. ఆ అబ్బాయి పరిస్థితిని చూడలేక తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన పలువురిని కంటతడి పెట్టించే పూర్తి వివరాలిలా ఉన్నాయి.
                ఆళ్లగడ్డ తాలూకాలోని చిన్నవంగళి గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, లకీëనరసమ్మల కుమారుడు రాఘవేంద్రకు పుట్టుకతోనే హిమోఫిలియా వ్యాధి వచ్చింది. తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా ఈ వ్యాధి తాలూకు బాధలు, మందుల గురించి వివరించారు. ముఖ్యంగా ఏ చిన్న గాయం తగిలినా రక్తం వస్తూనే ఉంటుంది. దీనివల్ల బాలుడు నీరసించి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉందని చెప్పారు. రక్తం కారకుండా ఆగాలంటే రూ. 4 వేల విలువైన ఇంజక్షన్‌ ఇప్పించాలని సూచించారు. అలాగే సుమారు రూ. 10 లక్షల ఖర్చుతో వైద్యం చేయిస్తే ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి నుండి ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు కరువైంది. ఇప్పటికే కుమారిని ఆరోగ్యం కోసం ఉన్న పొలం, ఇల్లు, బంగారం తెగనమ్మి వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయంకాకపోవడంతో తమ కుమారుడు ఏమైపోతాడోననే దిగులుతో తల్లి లకీëనరసమ్మ మంచం పట్టింది. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నచందంగా కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండగా మరోవైపు భార్య మంచం పట్టడంతో భర్త వెంకటసుబ్బయ్య అన్నీ తానై కుమారునికి, భార్యకు సేవలు చేస్తున్నాడు. రాఘవేంద్ర పాఠశాలకు వెళ్లే మార్గంలో కాళ్లకు ఏం గుచ్చుకుంటాయనే భయంతో తానే కుమారున్ని భుజానికి ఎత్తుకొని రోజు పాఠశాలలో దించడం, తీసుకురావడం దినచర్యలో భాగమైంది. తమ కుమాడిని కాపాడాలంటూ కన్పించని దేవుడితోపాటు తమ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి చేతులు జోడించి దండం పెడుతున్నారు. దాతలు స్పందించి తమ అబ్బాయికి ఆర్థిక సహాయం అందించి ప్రాణాలు కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. మానవత్వం ఉన్న హృదయాలు స్పందించి రాఘవేంద్రుడు ఆరోగ్యవంతుడై నిండునూరేళ్లు జీవించాలని ప్రజాశక్తి కోరుకుంటుంది. 

కామెంట్‌లు లేవు: