23, సెప్టెంబర్ 2013, సోమవారం

బెయిల్‌తో ఏమవుతుంది?                               జగన్‌కు బెయిల్‌ వస్తే ఎవరికి మేలు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలగా, జగన్‌ కుటుంబానికా, వైఎస్‌ఆర్‌సి పార్టీకా?. అక్రమ ఆస్తులు సంపాదించారని జగన్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ఆరుసార్లు బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకున్న జగన్‌కు ఏడో సారి సుప్రీకోర్టు ఆదేశానుసారం సిబిఐ షపరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయన సరివర్తన చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తారా? కనీసం ఆయన ఏ ఆశయం కోసం పార్టీని పెట్టారో దానికి అప్పగిస్తారా?. ఇన్నాళ్లు జైల్లో పెట్టిన కాంగ్రెస్‌పై కక్షసాధిస్తారా?. అందరి అభిమానాన్ని కొల్లగొట్టి తండ్రి ఆశయ సాధన పేరుతో ముఖ్యమంత్రి అయి రాష్టాన్ని మరింత దోచేసి ఆస్తులు పోగేసుకుంటారా?. అయితే బెయిల్‌ రావడమంటే ఆయనపై ఉన్న కేసులన్నీ పోతాయని వైఎస్‌ఆర్‌సిపి అభిమానులు నమ్ముతున్నారు. మ్యాచ్‌ ఫిక్సింగు వల్ల బెయిల్‌ వచ్చిందని కొందరంటున్నారు, జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి. బెయిల్‌ మాత్రమే వచ్చింది... నిర్దోషిగా నిరూపించుకోలేదని టిడిపి నాయకులంటున్నారు. అవినీతిపై ప్రపంచమంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆయన పట్ల ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఏదేమైనా బెయిల్‌తో వచ్చే మార్పులెలా ఉంటాయో పరిశీలించాల్సిందే. రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరే మార్పులు జరిగాలని ఆశిద్ధాం.......జైలు నుంచి బెయిల్‌ వరకు జరిగిన పరిణామాలను పరిశీలిద్దాం.......
                                    అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ను సిబిఐ 2012 మే 27న అరెస్టు చేసింది. సాక్షి దినపత్రిక, సాక్షి టివి, జననీ ఇన్‌ఫ్రా, సండూర్‌ పవర్‌, భారతి సిమెంట్స్‌ తదితర కంపెనీల్లో వచ్చిన పెట్టుబడులపై ప్రశ్నించాలని జగన్‌ను పిలిపించిన సిబిఐ అధికారులు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. అయితే అరెస్టు చేస్తున్నట్లు సిబిఐ అధికారులు 27వ తేదీన జగన్‌కు చెప్పారు. 2012 మే 28న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అప్పటి నుంచి బెయిల్‌ రాకుండా జైలులో 484 రోజుల పాటు గడిపారు. బెయిల్‌ కోసం జగన్‌ సిబిఐ, హైకోర్టు, సుప్రీం కోర్టులో ఆరుసార్లు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ పిటీషన్లను ఆయా కోర్టులు తిరస్కరించాయి. కేసులో దర్యాప్తు పూర్తయ్యిం దంటూ పదో ఛార్జిషీట్‌ దాఖలు సమయంలో సిబిఐ తెలపడంతో అదే రోజు జగన్‌ మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ 71 మందిని నిందితులుగా పేర్కొంది. పది ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ పది ఛార్జిషీట్లలో వైఎస్‌ జగన్‌ ఎ-1 నిందితుడిగా ఉన్నారు. రెండో నిందితుడిగా జగతి పబ్లికేషన్స్‌ వైస్‌ ఛైర్మన్‌ విజయసాయిరెడ్డి ఉన్నారు. 2010 అక్టోబర్‌లో జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక, సాక్షిటీవిలలో పెట్టుబడులపై విచారణ కోరుతూ కంటోన్మెంట్‌ శాసనసభ్యులు శంకరరావు హైకోర్టుకు లేఖ రాశారు. 2011 జనవరి 24న ఈ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అదే నెల 31న జగన్‌కు చెందిన అక్రమాస్తులను జప్తుచేయా లని కోరుతూ శంకరరావు హైకోర్టుకు మరికొన్ని ఆధారాల సమర్పించారు. ఫిబ్రవరి 9వ తేదీన శంకరరావు 333 పేజీల డాక్యుమెంట్లతో కూడిన మరో అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించారు. ఇదిలావుండగా మార్చి 14న జగన్‌ ఆస్తులపై సీబిఐ, ఏసిబి దద్యాప్తు కోరుతూ టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, పి. అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా జగన్‌పై కేసు ఫైల్‌ చేసినందుకు గానూ శంకరరావుకు మంత్రి పదవి దక్కింది. దీంతో అదే ఏడాది ఏప్రిల్‌న ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన శంకరరావు సోనియా ఆదేశాల మేరకే జగన్‌పై ఆరోపణలు చేశాం, కేసులూ వేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అదే ఏడాది జూలై 11న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణంపై ప్రాథమిక విచారణ జరపాలంటూ హైకోర్టు సిబిఐని ఆదేశించింది.
అదే నెల 12న వైఎస్‌. జగన్‌కు చెందిన కంపెనీలు, సాక్షిలో వచ్చిన పెట్టుబడులపై ప్రాథ మిక విచారణ జరపాలని హైకోర్టు సిబిఐని ఆదేశిం చింది. హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ జగన్‌ అదే ఏడాది జూలై 22వ తేదీన దాఖలు చేసుకున్న పిటి షన్‌ను సుప్రీం కోర్టు తిరస్క రించింది. హైకోర్టు ఆదేశం మేరకు ప్రాథమిక విచా రణ జరిపిన సిబిఐ అదే నెల 26న హైకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందజేసింది. ఆగస్టు 1వ తేదీన సిబిఐ హైకోర్టుకు రెండో నివే దికను అందజేసింది. వీటిపై అదే నెల 4న హైకో ర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన తర్వాత హైకోరు తీర్పు వాయిదా వేసింది. ఇదిలావుండగా అదే నెల 18న సిబిఐ అధికారులు జగన్‌కు చెందిన కంపెనీలు, సాక్షి టివి, సాక్షి దినపత్రిక కార్యాలయాలపై సీబిఐ ఏకకాలంలో దాడులు చేసింది. సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)చేత విచారణ జరిపించాలంటూ అదే నెల 30న న్యాయస్థానాన్ని కోరింది. అయితే సిబిఐ న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈడి అధికారులు అదే రోజు సాయంత్రం వైఎస్‌ జగన్మోహన రెడ్డి పై కేసు నమోదు చేసింది. ఇదిలావుండగా వైఎస్‌ జగన్‌ సెప్టెంబర్‌ 4వ తేదీన గాలి జనార్ధనరెడ్డికి చెందిన ఓబబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో సాక్షిగా తమ ఎదుట హాజరుకావాలని సిబిఐ జగన్‌ను ఆదేశించింది. దాంతో విచారణకు ఆయన హాజరై వివరణ ఇచ్చారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు 2012 జనవరి 2వ తేదీన జగతి పబ్లికేషన్స్‌ ఆడిటర్‌ విజయసాయి రెడ్డి అరెస్టు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ 2012 మార్చి 31వ తేదీన మొదటి చార్జ్‌షీటు దాఖలు చేసింది. అయితే అరెస్టయిన విజయసాయిరెడ్డిని సిబిఐ న్యాయస్థానం అదే ఏడాది ఏప్రిల్‌ 13న షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదిలావుండగా విజయసాయి రెడ్డి బెయిల్‌ను హైకోర్టు ఏప్రిల్‌ 20వ తేదీన రద్దు చేసింది. జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు అదే ఏడాది ఏప్రిల్‌ 23న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో రెండో చార్జ్‌షీటు దాఖలు చేసింది. ఇదిలావుండగా జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు అదే ఏడాది మే 7న మూడో చార్జ్‌షీటు దాఖలు చేశారు. కాగా అదే నెల 7వ తేదీన సిబిఐ న్యాయస్థానం తమ ఎదుట హాజరుకావాలని జగన్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండగా అదే నెల 8వ తేదీన జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, జననీ ఇన్‌ఫ్రాల బ్యాంకు ఖాతాలను (ఎస్‌బిఐ, ఓబీసీ) ఫ్రీజ్‌ సిబిఐ ఫ్రీజ్‌ చేసింది. అదే నెల 9వ తేదీన జగతి పబ్లికేషన్స్‌, జననీ ఇన్‌ఫ్రాలకు చెందిన మరో రెండు బ్యాంకు ఖాతాలను (ఓబీసీ, ఐఓబీ) సిబిఐ స్తంభింపజేసింది. ఖాతాల స్తంభనపై జగతి పబ్లికేషన్స్‌ వేసిన పిటిషన్‌ను సిబిఐ న్యాయస్థానం కొట్టివేసింది. జగన్‌ తరపున వాదించేందుకు జగన్‌ తరపున ఆయన వ్యక్తిగత న్యాయవాది హాజరుకు చేసిన అభ్యర్ధనను తిరస్కరించిన సీబిఐ కోర్టు 21న తిరస్కరిస్తూ మే 28న జగన్‌ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని సిబిఐ న్యాయస్థానం జగన్‌కు నోటీసులు జారీ చేసింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా రెంటచింతలలో ఉన్న జగన్‌కు సిబిఐ అధికారులు సమన్లు అందజేసింది. సిబిఐ అరెస్టు చేస్తుందని ముందుగానే ఊహించిన జగన్‌ అదే నెల 24 ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేసుకోగా సిబిఐ న్యాయస్థానం తిరస్కరించింది.  జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ మే 24వ తేదీన అరెస్టు చేసింది. 25వ తేదీన సీబీఐ ముందు హాజరైన వైఎస్‌ జగన్‌ ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు విచారించింది. మరుసటి రోజు సీబీఐ ముందు హాజరైన వైఎస్‌ జగన్‌. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. మూడో రోజు మే 27వ తేదీన సీబీఐ ముందు హాజరైన జగన్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించిన సిబిఐ అధికారులు రాత్రి 07.20 సమయంలో అరెస్టు చే సినట్లు ప్రకటించారు. 28వ తేదీన సిబిఐ అధికారులు జగన్‌ను కోర్టులో ప్రవేశ పెట్టగా 14రోజుల జుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించింది. జగన్‌ అరెస్టు చట్టవిరుద్దమని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది అదే నెల 29న పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే జగన్‌ బెయిల్‌ను నిరాకరిస్తూ ఆ పిటిషన్‌ను జూన్‌ 1వ తేదీన సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఆ మరుసటి రోజు వైఎస్‌ జగన్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. జగన్‌ కు జూన్‌ 25 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన సీబీఐ కోర్టు అదే నెల 11న సాధారణ ఖైదీలను తరలించే పోలీసు వ్యానులో కోర్టుకి తీసుకురావడంపై జడ్జికి జగన్‌ ఫిర్యాదు చేశారు. అలాగే అదే నెల 21న బెయిల్‌ కోరుతూ హైకోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు జూలై 4వ తేదీన జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టు కొట్టివేసింది. అదే నెల 9వ తేదీన బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. అదే నెల 13వ తేదీన చంచల్‌గూడ జైల్లో జగన్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఆగస్టు 13న జగన్‌ ఆస్తుల కేసులో నాలుగో చార్జ్‌షీటు దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో వాన్‌పిక్‌ భూముల వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును 5వ నిందితుడిగా సిబిఐ పేర్కొంది. బెయిల్‌ కోరుతూ జగన్‌ సీబీఐ కోర్టులో అదే ఏడాది నవంబర్‌ 16 రెండు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఒకటి సాధారణ, మరొక స్టాట్యుటరీ బెయిల్‌ పిటిషన్‌. అయితే సిబిఐ కోర్టు అదే నెల 28న స్టాట్యుటరీ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించింది. అదే నెల 30 సీబీఐ కోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో జగన్‌ తిరిగి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. సీబీఐ కోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ జగన్‌ అదే ఏడాది డిసెంబర్‌ 5వ తేదీన హైకోర్టులో మరో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 167(2) కింద చట్టబద్ద బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అదే ఏడాది డిసెంబర్‌ 24న జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సాంకేతిక కారణాలతో హైకోర్టు కోట్టివేసింది. బెయిల్‌ కోరుతూ జగన్‌ జనవరి 24న దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సీబీఐకి ఇచ్చిన గడువు ముగిసినందున బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ జగన్‌ ఈనెల 11వ తేదీన సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదిలావుండగా సిబిఐ ఈనెల 17వ తేదీన మరో రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందూ టెక్‌ అంశాలపై అభియోగాలు మోపింది. జగన్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత 2013 సెప్టెంబర్‌ 23న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 24న మధ్యాహ్నం విడుదల చేస్తారని ప్రకటించింది.