31, ఆగస్టు 2017, గురువారం

ఏడు దీవుల నగరం ముంబయి

        ఏడు దీవులను కలపడం ద్వారా      ముంబయి ఒక నగరం నిర్మించారు. కాల క్రమేణా ఆ దృశ్యం అదృశ్యమైంది. ముంబై నగర ఉత్తర భాగంలో కాందివలిలో లభించిన కళాఖండాల ఆధారంగా ఇక్కడ రాతియుగం నుండి నివసించినట్లు విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 250 నుండి వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని గ్రీకు రచయిత హెప్టెనేషియాగా (గ్రీకు భాషలో:సప్త ద్వీప సమూహం) వ్యవహరించాడు. క్రీ.పూ 3 వ శతాబ్దంలో ఈ సప్త ద్వీపాలు మౌర్య బుద్ధ మత్యావలంబీకుడైన ఆశోక చక్రవర్తి సామ్రాజ్యంలో భాగంగా మారాయి. మొదటి కొన్ని శతాబ్ధాల వరకు ఈ ద్వీపాలపై ఆధిపత్యంలో ఇండో సితియన్ స్ట్రాప్స్ మరియు శాతవాహనుల మధ్య వివాదాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఈ ద్వీపాలు సిల్హరా సామ్రాజ్యంలో భాగమైనాయి. 1343 వరకూ ఈ ద్వీపాలు గుజరాత్ లో కలిసే వరకూ సిల్హరా పాలనలోనే ఉన్నాయి. కొన్ని పురాతన నిర్మాణాలున్న ఎలెఫెంటా గృహలు, వాకేశ్వర్ గుడుల సమూహం ఇక్కడ ఉన్నాయి.
                 1534 లో ఈ ద్వీపాలు బహదూర్ షాహ్ ఆఫ్ గుజరాత్ నుండి పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చాయి. 1661లో ఈ ద్వీపాలు ఇంగ్లాండుకు చెందిన రెండవ చార్లెస్‌కు కేథరిన్ డీ బ్రగాంజాను వివాహమాడిన సందర్భంలో వరకట్నముగా లభించాయి. 1963లో ఈ ద్వీపాలు ఈస్టిండియా కంపనీకు 10 పౌండ్ల సంవత్సర లీజు కింద ఇవ్వబడ్డాయి. వారు ఈ ద్వీపాల తూర్పు తీరంలో భారత ద్వీపకల్పంపంలోని తమ మొదటి రేవుని నిర్మించారు. 1661లో 10,000 జనాభా ఉన్న ఈ ప్రాంతం జనాభా 1675 మరియు 1687నాటికి 60,000 జనాభాగా త్వరితగతిని అభివృద్ధి చెందింది.ది బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ తన ప్రధాన కార్యాలయాన్ని సూరత్ నుండి బాంబేకు మార్చింది. ఎట్టకేలకు ముంబై నగరం బాంబే ప్రెసిడెన్సీకు ప్రధాన నగరంగా మారింది. 1817 నుండి బృహత్తర నిర్మాణ ప్రణాళికల ద్వారా అన్ని ద్వీపాలను అనుసంధానించాలని తలపెట్టారు.1845 నాటికి హార్న్‌బై వల్లర్డ్ పేరుతో నిర్మాణకార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దీని ఫలితంగా మొత్తం ద్వీపాలు 438 చదరపు కిలోమీటర్ల ప్రదేశానికి విస్తరించాయి. 1853లో మొదటి రైలు మార్గాన్ని బాంబే నూడి థానే వరకు నిర్మించారు. అమెరికన్ సివిల్ వార్ (1861-1865) కాలంలో ముంబై నగరం నూలు వస్త్రాల వ్యాపార కేంద్రంగా మారింది. ఫలితంగా నగర ఆర్థిక పరిస్థితులలో పెను మార్పు సంభవించింది. ఆ కారణంగా నగర రూపురేఖలలో విశేష మార్పులు వచ్చాయి.
               1955లో బాంబే రాష్ట్రం భాషాపరంగా మహారాష్ట్రా మరియు గుజరాత్‌లుగా విభజింప బడిన తరువాత ఈ నగరం స్వయంపాలిత ప్రాంతంగా మార్చాలన్న ఆలోచనని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రీయులు బాంబే ముఖ్యపట్టణంగా మహారాష్ట్రా రాష్ట్రం కావాలని కోరుతూ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం లేవదీయడంతో, పోలీసు కాల్పుల్లో 105 మంది మరణంతో ఉద్యమం విజయవంతంగా ముగిసింది. మహారాష్ట్రా రాష్ట్రం బాంబే ముఖ్యపట్టణంగా వెలిసింది.
                    1970 తరువాత నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిని అభివృద్ధి చెందటం, వలస ప్రజల స్త్ఝిర నివాసం కారణంగా జనసంఖ్యలో బాంబే కలకత్తాను అధిగమించింది. వలస ప్రజల ప్రవాహం ముంచెత్తడం మహారాష్ట్రీయులను కొంత అశాంతికి గురి చేసింది. వారి నాగరికత, భాష మరియు ఉపాధి పరంగా జరిగే నష్టాలను ఊహించి ఆందోళన పడసాగారు. ఈ కారణంగా బాలాసాహెబ్ థాకరే నాయకత్వంలో మాహారాష్ట్రీయుల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యాంశంగా శివసేనా పార్టీ ప్రారంభం అయింది. 1992-1993లో నగర సర్వమత సౌజన్యం చీలికలైంది. దౌర్జన్యాలు విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల కారణంగా మారాయి. కొన్ని నెలల తరువాతి కాలంలో మార్చి 12 వ తారీఖున ముంబాయి మాఫియా ముఠాల ఆధ్వర్యంలో ప్రధాన ప్రదేశాలలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ సంఘటనలో 300 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. 1995లో శివసేనా ప్రభుత్వ పాలనలో ఈ నగరం పేరు పురాతన నామమైన మూంబైగా మార్చబడింది. 2006లో ముంబై మరో తీవ్రవాద దాడికి గురైంది ఈ సంఘటన 200 ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడి ముంబై నగర రైల్వే పైన జరిగింది.  అవిభాజ్యమైన నగరంగా ముంబయి రూపొందింది. విచ్చల విడిగా పెరిగిన నిర్మాణాలు ఒకప్పుడు వర్షపు నీటిని ఎప్పటికప్పుడు సముద్రానికి తరలించిన జల మార్గాలను పూర్తిగా మాయం చేశారు. ఫలితంగా వర్షపు నీటి ప్రవాహానికి ప్రకృతి సహజమైన మార్గాలు మూసుకుపోయాయి. దీనికి తోడు భూ గర్భ, ఉపరితల మిళితంగా ఉన్న డ్రెయినేజి వ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మురుగు నీటిని తరలించడానికి ఏకైక వాహకంగా ఉన్న మితి నది ఆక్రమణలకు గురైంది. అది పేరుకే నదిగా మిగిలింది. ఈ స్వయం కృతాపరాధమే ముంబయి వాసులకు వర్షకాలంలో తిప్పలు తెచ్చిపెడుతోంది. సమైక్య రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ఇదే స్థితి. ఒక అధ్యయనం ప్రకారం 404 చెరువులు అదృశ్యమైనాయి. ప్రస్తుతం వీటి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. కీలకమైన హుస్సేన్‌సాగర్‌ 40 శాతం పైగా ఆక్రమణలకు గురైంది. మూసీ నది పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇటీవల భాగ్యనగర వాసులను కలవరపరుస్తున్న నురుగు సమస్యకు మురుగునీటి పారుదల వ్యవస్థలోని లోపాలే కారణం. 2015లో చెన్నై నగరాన్ని ముంచెత్తిన వరదకూ సహజ నీటి ప్రవాహనికి ఆటంకాలు ఏర్పడటమే కారణం. బెంగళూరుతో పాటు దేశంలోని ఇతర కీలకమైన అన్ని ముఖ్య నగరాల్లోనూ ఇదే స్థితి! 
              2017లో   అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్షపాతం కురవడమన్నది  సాధారణ అంశంగా మారింది. అనూహ్యంగా విరుచుకుపడుతున్న ఈ వర్షపు ధాటికి మహా నగరాలు పండుటాకుల్లా వణికిపోతున్నాయి. మరోవైపు ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు నగరాలు, పట్టణాలపై పెనుభారం మోపుతున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఫలితంగా అక్రమార్కులకు, కబ్జా రాయుళ్లకు పాలకవర్గాలు బాహాటంగానే మద్దతు పలుకుతున్నాయి. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం గత 30 సంవత్సరాల కాలంలోనే ముంబయి నగరంలో ఆక్రమణల పర్వం జోరుగా సాగింది. హైదరాబాద్‌లోనూ 1980వ దశాబ్దం తరువాతే కబ్జా రాయుళ్లు చెలరేగిపోయారు. మిగిలిన నగరాల్లోనూ ఇదే స్థితి. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలుకు పర్యావరణ విధ్వంసానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది ధృవీకరిస్తోంది. జాతీయ విపత్తుల నివారణ కమిటీ నగరాల అభివృద్ధికి చేసిన ఎన్నో సూచనలు అమలు కాకపోవడానికి కూడా ఈ నేపథ్యమే కారణం. ఇక పర్యావరణ ఉద్యమకారులు చేసే విజ్ఞప్తులు ప్రభుత్వాల చెవికెక్కడం లేదు. వరుసగా సంభవిస్తున్న విపత్తుల నేపథ్యంలోనైనా పాలకవర్గాల వైఖరి మారాల్సివుంది. 




28, ఆగస్టు 2017, సోమవారం

నంద్యాల ఉప ఎన్నికలో తెదేపా గెలుపు


 
           తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలో  తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని బ్రహ్మాండమైన మెజార్జీతో గెలిపించారు. 27,466 ఓట్ల ఆధిక్యంతో ఆయ‌న‌ ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్లలో తెదేపాకు 56 శాతం ఓట్లు రాగా.. వైకాపాకు 40 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు ప్రతి రౌండ్‌లో తెదేపా అభ్యర్థికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి ఏ దశలోనూ ఆధిక్యాన్ని కనబరచలేకపోయారు. ఇక కాంగ్రెస్‌ సుమారు వెయ్యి ఓట్లకే పరిమితమైంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. తెదేపా అభ్యర్థికి 97,076 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థికి 69,610 ఓట్లు వచ్చాయి. నంద్యాల ఉప ఎన్నికను అటు అధికార తెదేపా, ఇటు విపక్ష వైకాపా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఈ ఎన్నిక ఫలితంపై ఎంతో ఆసక్తి కనబరిచారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలు మార్గనిర్దేశం చేస్తాయని, ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమని భావించడంతో ఇరు పార్టీల నేతలు జోరుగా ప్రచారం కొనసాగించారు. చివరి క్షణం వరకూ ఓటర్ల మద్దతు సంపాదించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష నేత జగన్‌ 13 రోజులపాటు నియోజకవర్గంలో ఉండి ప్రచారం నిర్వహించగా.. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో రెండు రోజులు, నోటిఫికేషన్‌కు ముందు రెండు పర్యాయాలు నంద్యాలలో పర్యటించారు. చివరికి పోటీ.. అభ్యర్థుల మధ్య కాకుండా పార్టీ అధినేతల మధ్య అన్నట్లుగా సాగింది.

27, ఆగస్టు 2017, ఆదివారం

డేరా బాబా అశ్రమం గురించి తెలుసా


                  సిర్సాలోని డేరా హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటున్న వేలాది మంది గుర్మీత్‌ బాబా భక్తు లకు అదో వినూత్న ప్రపంచం. ఇక్కడి నుంచే బాబా 150 కార్లతో (కాన్వాయ్‌) అట్టహాసంగా 25-08-2017న  పంచకుల కోర్టుకు వచ్చారు.  అత్యాచారం కేసులో గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు  దోషిగా ప్రకటించడంతో కథ అడ్డం తిరిగింది. పర్యవసానంగా హర్యానా, పంజాబ్‌లో ఉవ్వెత్తున హింసాకాండ చెలరేడంతో సిర్సా ప్రధాన కార్యాయం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అధికారు ల ఆదేశాతో 103 డేరా కేంద్రాను సీజ్‌ చేసిన పోలీసులు బలగాలు తాజాగా డేరా హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద భారీగా మోహరించాయి. ఆర్మీని ఇంతవరకూ డేరా ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి అధికాలు అనుమతించలేదు.  డేరా కార్యాలయం బయటే బలగాలను మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. 28-08-2017న  గుర్మీత్‌కు విధంచబోయే జైలు శిక్ష నేపథ్యంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ఒకవైపు డేరా బాబా అనుచరులను ఆశ్రమం ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆర్మీ రెండ్రోజులుగా నచ్చచెబుతుండగా....లోపలున్న వేలాది మంది బాబా అనుచరగణం మాత్రం కర్రలు, ఇతర ఆయుధాలతో అప్రమత్తంగా ఉన్నట్టు సమాచారం. ఆర్మీ ఆదేశాలను బాబా ‘ప్రైవేట్‌ సైన్యం’ ధిక్కరిస్తూ ఆశ్రమం లోపల లౌడ్‌ స్పీకర్ల ద్వారా బాబా అనుచరులకు ధైర్యం నూరిపోస్తున్నాయని తెలుస్తోంది. ఎవరూ బయటకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారం తెలిసినా గుడ్డిగా నమ్మవద్దని లౌడ్‌ స్పీకర్లలో అనౌన్స్‌ చేస్తున్నారు.
            ఆసక్తికరంగా సిర్సా హెడ్‌క్వార్టర్స్‌ విషయాలు ఒకొటొక్కటిగా మెలుగు చూస్తున్నాయి. 700 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రధాన కార్యాయం (డేరా హెడ్‌క్వార్టర్స్‌)లో సక సౌక ర్యాలు ఉన్నాయి. వినోదం కోసం ఓ సినిమా థియేటర్‌, వైద్యం కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, బాబా అనుచరులకు లoచ్‌, డిన్నర్‌ వగైరా కోసం ఓ భారీ హోటల్‌, సిబ్బంది కోసం రెసిడెన్షియల్‌ క్వార్టర్లు, భక్తులు ఉండేందుకు లెక్కకు మించిన గదులు, ఓ ఫ్యాక్టరీ, విలాసవంతమైన రోడ్లు, రిసార్ట్‌లు, అత్యంత విశాలమైన బాబా మందిరం, ఇలా చెప్పుకుంటూపోతే డేరా బాబా ప్రధాన ఆశ్రమం ఓ వినూత్న ప్రపంచాన్నే తలపిస్తుంది. కాగా, ఆర్మీ ఆదేశాల నేపథ్యంలో రెండ్రోజులుగా బాబా అనుచరులు స్వచ్ఛందంగానే ఆశ్రమం విడిచిపెడుతున్నప్పటికీ ఇప్పటికీ లోపల 30 వేల మందికి పైగా ఉన్నారని అంటున్నారు.  అదురూబెదురూ లేకుండా డేరా బాబా అనుచరులు దైనందిన కార్యక్రమాలతో ప్రశాంతంగానే ఉన్నారని ఆశ్రమం విడిచిపెడుతున్న బాబా అనుచరులు చెబుతుండటం విశేషం. కాగా, డేరా బాబా ఆస్తుల వివరాలు తమకు అందజేయాలని పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆదేశాలు నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సైన్యం లోపలకు ప్రవేశించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

26, ఆగస్టు 2017, శనివారం

అసలు గుర్మీత్ సింగ్ ఎవరు?

                 
           

 ★గుర్మీత్ సింగ్ ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి భూస్వామి. అప్పుడప్పుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమ గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్‌ను 7 సంవతర్సాల వయసులోనే చేరదీశాడు. ఆ సమయంలో గుర్మీత్ పేరును రామ్హ్రీమ్‌గా మార్చి మరింత ఆధ్యాత్మికతను నింపాడు.

◆పదహారు సంవత్సరాల తర్వాత 1990లో షా సత్నాం సింగ్ తన శిష్యులను అందరినీ పిలిచి తన వారసుడిగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను ప్రకటించాడు. అప్పుడు రామ్ రహీమ్ వయసు 23 ఏళ్లు. అప్పటికే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రహీమ్.. హర్జీత్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు.

★డేరా సచ్చా సౌధ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు గుర్మీత్. పేద పిల్లలకు విద్యను అందించడం, రక్త దానం, అవయవ దానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేవాడు. ఇతని ఉపన్యాసాలతో పలువురిని సేవా కార్యక్రమాలకు ప్రేరేపించేవాడు. గుర్మీత్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. అవి.. ఎంఎస్‌జీ(మెసెంజర్ ఆఫ్ గాడ్), ఎంఎస్‌జీ 2.

◆ఇక సిర్సాలోని గుర్మీత్‌కు ఒక పెద్ద టౌన్‌షిప్ ఉంది. 1000 ఎకరాల స్థలంలో నిర్మించిన టౌన్‌షిప్‌లో పాఠశాలలు, స్పోర్ట్స్ విలేజ్, ఆస్పత్రి, సినిమా హాలుతో పాటు ఇతర భవనాలు ఉన్నాయి. డేరాలోకి రాజకీయ నేతలు రావడం సహజమే. కానీ వారు వస్తున్న విషయం మూడో కంటికి తెలియదు. పొలిటికల్ లీడర్స్ వస్తున్నప్పటికీ.. రాజకీయ వ్యవహారాల్లో గుర్మీత్ జోక్యం చేసుకోలేదు. అయితే 2014 ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ తరపున ప్రచారం చేశాడు రామ్ రహీమ్ సింగ్.

■గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదు అయ్యాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25, 2017న తీర్పునిచ్చింది. ఆగస్టు 28న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ క్రమంలో రామ్ రహీమ్‌ను అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. రామ్ దోషి అని నిర్ధారించడంతో.. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఆయన మద్దతుదారులు ఆందోళనల బాట పట్టారు.

◆డేరాసచ్చాసౌదా చీఫ్‌గా ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ స్వచ్చ సౌదాలో మూడో తరం వ్యక్తి….. డేరా స్వచ్చ సౌదాను స్థాపించిన బెలూచిస్తాన్‌ ప్రాంతానికి చెందిన మస్తానా బలూచిస్తానీని అనుచరులు పునీత బెపరవాహ్‌ మస్తానా జీ మహరాజ్‌ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్‌ 18న ఆ‍యన చనిపోయాక షా సత్నాం స్వచ్చ సౌదా బాధ్యతలు స్వీకరించారు. మస్తానా నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించారు. 1991 డిసెంబర్‌ 13న ఆయన చనిపోయారు. ఆయన బతికుండగానే 1990 సెప్టెంబర్‌ 23న గుర్మీత్‌ రాం రహీమ్ సింగ్ డేరా చీఫ్‌ అయ్యారు.    
                                                                 ఆ బాబా సీక్రెట్‌ ఏంటి?
        బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్ధ చీఫ్‌. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో లక్షలాది మంది నిమ్నజాతీయులు ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తారు. నడిచే దేవుడిగా భావిస్తారు. 2002లో ఆయనపై హత్య, అత్యాచార కేసు నమోదైంది. అయినా, బాబాను పూజించే వారి సంఖ్య తగ్గలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.

                                                                  ఎవరీ డేరాలు..
           సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు గుర్మీత్‌ ప్రారంభించిన డేరా సచ్చా సౌధాలో చేరారు. ఈ గ్రూపులో చేరిన వారందరినీ డేరాలు అంటారు. ఈ గ్రూపులో చేరిన అత్యధికులు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే. సమాజం తమపై చూపుతున్న వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. డేరాల సంస్కృతి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. మధ్యయుగ కాలం నుంచి ఉత్తర భారతదేశంలో డేరాలు ఉన్నాయి.

          డేరా సచ్చాసౌధాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో కులాల వంటి అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది నిమ్నజాతీయులు డేరా సచ్చాసౌధా చేరడానికి ఆసక్తిని కనబరుస్తారు. ప్రార్థనల కోసం నామ్‌ చర్చాఘర్‌లను నిర్మించుకున్నారు. డేరాల్లో శ్రీమంతుడినైనా, బీదవాడినైనా ఒకే రకంగా పరిగణిస్తారు. పంజాబ్‌, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది దళితులు గుర్మీత్‌ బోధనల పట్ల ఆకర్షితులై అందులో చేరారు.

                   డేరా సచ్చాసౌదాను యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌కు భంగీదాస్‌ అనే వ్యక్తి బాధ్యత వహిస్తారు. సభ్యుల ఇబ్బందులను తెలుసుకుని కేంద్ర కార్యాలయమైన సిర్సాకు తెలియచేయడం వీరి ప్రధాన విధి. అనారోగ్యంగా ఉన్న వారి గురించి తెలియజేయడంతో పాటు వారిని చికిత్స కోసం కూడా సిర్సాకు తరలిస్తారు. ఇక్కడ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి ఉంది. ఇందులో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు.

                                                       పేదల పాలిట పెన్నిధి..
        డేరాల్లో సభ్యులకు సబ్సిడితో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ప్రభుత్వం రేషన్‌ ద్వారా అందించే వాటి కన్నా ఇవి ఎంతో నాణ్యంగా ఉంటాయి. ఎలాంటి అవినీతి కనిపించదు. ఇది డేరాల్లోని పేదలకు ఎంతగానో లాభిస్తుంది. పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌ కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేయడం విశేషం. ఇన్ని ప్రజాపయోగమైన కార్యక్రమాలు చేపడుతుండటంతో డేరా సచ్చాసౌధాలో లక్షలాది మంది సభ్యులుగా చేరారు.      

                                                     బాబాలకు ఎందుకు ఆదరణ
                బాబాలు సేవలు చేస్తుంటే ...పాలకులు ఏమి చేస్తున్నారు...బాబాలు చేసినంత కూడా ఎందుకు చేయలేకున్నారు. ప్ర్జజాస్వామ్యం ఎందుకినంత దిగజారిపోతుంది. ఎవరు ఆలోచించాలి. బాబాల మీద పెరుగుతున్న  ఆదరణ ఎమ్మేల్యేలు, ఎంపీల మీద ఎందుకు పెరగదం లేదు. లోపమెక్కడ  ప్రజలు ..బుద్ది జీవులు ఆలోచించాలి            

16, ఆగస్టు 2017, బుధవారం

బాలయ్య పై రోజా సంచలన వ్యాఖ్యలు

        
నంద్యాల ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా వైసీపీనుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు రోజా కౌంటర్ ఇచ్చారు. మహిళలను బాలకృష్ణ అగౌరవ పరుస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దులు పెట్టండి, కడుపులు చేయండని అంటారు.. అలాంటి వ్యక్తికి వైసీపీని విమర్శించే స్థాయి లేదన్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ అమాయకులు అని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతారని వ్యాఖ్యానించారు. తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దారని టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన శిల్పా చక్రపాణినుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రోజా అంతే ఘాటుగా స్పందించారు.
               తల్లిపాలు తాగి రొమ్ములు గుద్ది టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి, అఖిల ప్రియ, అమర్‌నాథ్ రెడ్డిలను పక్కన పెట్టుకొని బాలయ్య డైలాగ్‌లు కొడుతున్నారని రోజా విమర్శించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి లాక్కున్న ఆ ముగ్గురిని పక్కన పెట్టుకొని టీడీపీని వదిలిన శిల్పా సోదరులపై కామెంట్ చేయడం ఘోరం అని వ్యాఖ్యానించారు.
ఇకపోతే టీడీపీలోకి ఎందుకు వెళ్లారంటే.. చెప్పుకోలేని స్థితిలో భూమానాగిరెడ్డి కుటుంబం ఉందన్నారు. భూమా నాగిరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబు పక్కన వుండి తమకు ఓటేయమని అఖిలప్రియ అడగడం బాధాకరమన్నారు. నంద్యాల ఓటర్లు మూడేళ్ల ప్రజాకంటక పాలనకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఏ శోభక్కనైతే చంద్రబాబు కష్టాలు పెట్టారో అదే చంద్రబాబు పక్కన నిలబడి అఖిలప్రియ శోభక్క ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతోందని వ్యాఖ్యానించారు.