26, ఆగస్టు 2017, శనివారం

అసలు గుర్మీత్ సింగ్ ఎవరు?

                 
           

 ★గుర్మీత్ సింగ్ ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి భూస్వామి. అప్పుడప్పుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమ గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్‌ను 7 సంవతర్సాల వయసులోనే చేరదీశాడు. ఆ సమయంలో గుర్మీత్ పేరును రామ్హ్రీమ్‌గా మార్చి మరింత ఆధ్యాత్మికతను నింపాడు.

◆పదహారు సంవత్సరాల తర్వాత 1990లో షా సత్నాం సింగ్ తన శిష్యులను అందరినీ పిలిచి తన వారసుడిగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను ప్రకటించాడు. అప్పుడు రామ్ రహీమ్ వయసు 23 ఏళ్లు. అప్పటికే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రహీమ్.. హర్జీత్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు.

★డేరా సచ్చా సౌధ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు గుర్మీత్. పేద పిల్లలకు విద్యను అందించడం, రక్త దానం, అవయవ దానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేవాడు. ఇతని ఉపన్యాసాలతో పలువురిని సేవా కార్యక్రమాలకు ప్రేరేపించేవాడు. గుర్మీత్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. అవి.. ఎంఎస్‌జీ(మెసెంజర్ ఆఫ్ గాడ్), ఎంఎస్‌జీ 2.

◆ఇక సిర్సాలోని గుర్మీత్‌కు ఒక పెద్ద టౌన్‌షిప్ ఉంది. 1000 ఎకరాల స్థలంలో నిర్మించిన టౌన్‌షిప్‌లో పాఠశాలలు, స్పోర్ట్స్ విలేజ్, ఆస్పత్రి, సినిమా హాలుతో పాటు ఇతర భవనాలు ఉన్నాయి. డేరాలోకి రాజకీయ నేతలు రావడం సహజమే. కానీ వారు వస్తున్న విషయం మూడో కంటికి తెలియదు. పొలిటికల్ లీడర్స్ వస్తున్నప్పటికీ.. రాజకీయ వ్యవహారాల్లో గుర్మీత్ జోక్యం చేసుకోలేదు. అయితే 2014 ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ తరపున ప్రచారం చేశాడు రామ్ రహీమ్ సింగ్.

■గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదు అయ్యాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25, 2017న తీర్పునిచ్చింది. ఆగస్టు 28న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ క్రమంలో రామ్ రహీమ్‌ను అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. రామ్ దోషి అని నిర్ధారించడంతో.. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో ఆయన మద్దతుదారులు ఆందోళనల బాట పట్టారు.

◆డేరాసచ్చాసౌదా చీఫ్‌గా ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ స్వచ్చ సౌదాలో మూడో తరం వ్యక్తి….. డేరా స్వచ్చ సౌదాను స్థాపించిన బెలూచిస్తాన్‌ ప్రాంతానికి చెందిన మస్తానా బలూచిస్తానీని అనుచరులు పునీత బెపరవాహ్‌ మస్తానా జీ మహరాజ్‌ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్‌ 18న ఆ‍యన చనిపోయాక షా సత్నాం స్వచ్చ సౌదా బాధ్యతలు స్వీకరించారు. మస్తానా నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించారు. 1991 డిసెంబర్‌ 13న ఆయన చనిపోయారు. ఆయన బతికుండగానే 1990 సెప్టెంబర్‌ 23న గుర్మీత్‌ రాం రహీమ్ సింగ్ డేరా చీఫ్‌ అయ్యారు.    
                                                                 ఆ బాబా సీక్రెట్‌ ఏంటి?
        బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్ధ చీఫ్‌. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో లక్షలాది మంది నిమ్నజాతీయులు ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తారు. నడిచే దేవుడిగా భావిస్తారు. 2002లో ఆయనపై హత్య, అత్యాచార కేసు నమోదైంది. అయినా, బాబాను పూజించే వారి సంఖ్య తగ్గలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.

                                                                  ఎవరీ డేరాలు..
           సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు గుర్మీత్‌ ప్రారంభించిన డేరా సచ్చా సౌధాలో చేరారు. ఈ గ్రూపులో చేరిన వారందరినీ డేరాలు అంటారు. ఈ గ్రూపులో చేరిన అత్యధికులు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే. సమాజం తమపై చూపుతున్న వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. డేరాల సంస్కృతి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. మధ్యయుగ కాలం నుంచి ఉత్తర భారతదేశంలో డేరాలు ఉన్నాయి.

          డేరా సచ్చాసౌధాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో కులాల వంటి అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది నిమ్నజాతీయులు డేరా సచ్చాసౌధా చేరడానికి ఆసక్తిని కనబరుస్తారు. ప్రార్థనల కోసం నామ్‌ చర్చాఘర్‌లను నిర్మించుకున్నారు. డేరాల్లో శ్రీమంతుడినైనా, బీదవాడినైనా ఒకే రకంగా పరిగణిస్తారు. పంజాబ్‌, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది దళితులు గుర్మీత్‌ బోధనల పట్ల ఆకర్షితులై అందులో చేరారు.

                   డేరా సచ్చాసౌదాను యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌కు భంగీదాస్‌ అనే వ్యక్తి బాధ్యత వహిస్తారు. సభ్యుల ఇబ్బందులను తెలుసుకుని కేంద్ర కార్యాలయమైన సిర్సాకు తెలియచేయడం వీరి ప్రధాన విధి. అనారోగ్యంగా ఉన్న వారి గురించి తెలియజేయడంతో పాటు వారిని చికిత్స కోసం కూడా సిర్సాకు తరలిస్తారు. ఇక్కడ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి ఉంది. ఇందులో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు.

                                                       పేదల పాలిట పెన్నిధి..
        డేరాల్లో సభ్యులకు సబ్సిడితో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ప్రభుత్వం రేషన్‌ ద్వారా అందించే వాటి కన్నా ఇవి ఎంతో నాణ్యంగా ఉంటాయి. ఎలాంటి అవినీతి కనిపించదు. ఇది డేరాల్లోని పేదలకు ఎంతగానో లాభిస్తుంది. పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌ కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేయడం విశేషం. ఇన్ని ప్రజాపయోగమైన కార్యక్రమాలు చేపడుతుండటంతో డేరా సచ్చాసౌధాలో లక్షలాది మంది సభ్యులుగా చేరారు.      

                                                     బాబాలకు ఎందుకు ఆదరణ
                బాబాలు సేవలు చేస్తుంటే ...పాలకులు ఏమి చేస్తున్నారు...బాబాలు చేసినంత కూడా ఎందుకు చేయలేకున్నారు. ప్ర్జజాస్వామ్యం ఎందుకినంత దిగజారిపోతుంది. ఎవరు ఆలోచించాలి. బాబాల మీద పెరుగుతున్న  ఆదరణ ఎమ్మేల్యేలు, ఎంపీల మీద ఎందుకు పెరగదం లేదు. లోపమెక్కడ  ప్రజలు ..బుద్ది జీవులు ఆలోచించాలి            

కామెంట్‌లు లేవు: