31, జనవరి 2014, శుక్రవారం

ఉన్నత శిఖరాలకు ఎదగాలి


ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌ఎస్‌  ప్రవీణ్‌ కుమార్‌

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదివిన, చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలనే తపనతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌  చెప్పారు. కర్నూలు  బి క్యాంపులో 2014`01`2014న ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల పూర్వ విద్యార్థుల(స్వారోస్‌) సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గురుకుల పాఠశాలలో చదువటం వల్ల తాను ఐపిఎస్‌  స్థాయికి ఎదిగానని అన్నారు. నేనిప్పుడు అనుభవిస్తున్న హోదా  కేవలం  గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల భిక్ష అని అన్నారు.  పేద విద్యార్థులకు నా వంతు కర్తవ్యంగా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పోలీసుశాఖ నుంచి ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నానని  గర్వంగా చెప్పారు. దళితుడనైన నేను హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి తొలి పట్టభద్రుడిని కావడం  గర్వించదగ్గ విషయమని  అన్నారు. 16 నుంచి 18 ఏళ్లు ఎస్‌పిగా మచ్చలేని సేవ చేసిన నాకు ఐజి హోదా వస్తుందని, ఇంతటి ఘనతను నాకు ప్రసాదించిన నా గురువులందరికీ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు హృదయపూర్వక వందనాలు తెల్పుతున్నానన్నారు. కార్యదర్శిగా తన కృషి ఎంత ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని అన్నారు. గురుకుల విద్యాలయాల అభివృద్ధికి 150 కోట్లు మంజూరయ్యాయన్నారు. విద్యాలయాలు నడిపే దిశలో మా వైపు నుంచి కూడా లోపాలుంటాయని, వాటిని సరిచేసుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ డిగ్రీ కాలేజి కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అంతేకాకుండా రొబోటిక్‌ కాంప్స్‌, సైంటఫిక్‌ క్యాంప్స్‌, లీడర్‌షిప్‌ క్యాంప్స్‌, బుక్‌ రైటింగ్‌ క్యాంప్స్‌, ఫిలిం ఆక్టింగ్‌ క్యాంప్స్‌ కూడా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సైకాలజిస్టు డాక్టర్‌ వీరేంద్ర విద్యార్థులు`తల్లిదండ్రుల పాత్రపై ూపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పూర్వవిద్యార్థులతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంభాషించారు.  ఈ కార్యక్రమంలో ఎపిఆర్‌ఎస్‌డబ్యుఆర్‌ కన్వీనర్‌ విమల కుమారి, మహమ్మద్‌ ఇర్ఫాన్‌, సోషల్‌వెల్ఫేర్‌ డిడి శోభా రాణి, డాక్టర్‌ సి వీరేంద్ర, గీతావాణి, ప్రస్తుత, పూర్వ విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు, ూపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. 

స్వారోస్‌ నెట్‌వర్క్‌ను పెంచాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

            ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల ( ఎస్‌డబ్ల్యుఎఇఆర్‌ఓఇఎస్‌) స్వారోస్‌ నెట్‌వర్క్‌ను పెంచాలని ప్రభుత్వ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. కర్నూలులో స్వారోస్‌తో ఆయన సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి సమస్యలు, సాధించిన విజయాలను తెలుసుకున్నారు. స్వారోస్‌ నెట్‌ వర్క్‌ ప్రాధాన్యతను తెలుపుతూ ఇజ్రాయిల్‌ దేశంలోని యూదులు నెట్‌వర్క్‌తో ప్రపంచ రికార్డులు సృష్టించారని తెలిపారు.ఉన్నతస్థితికి ఎదిగిన వారు అట్టడుగున ూన్నవారికి శక్తి మేకరకు సహకరించాలని చెప్పారు. కుల, ప్రాంతీయ బేధాలు లేకుండా తోటివారికి  మేలు చేయడమే స్వారోస్‌ ప్రదాన లక్ష్యమని చెప్పారు.  ఇప్పటికీ తెలంగాణా, ఆంధ్ర జిల్లాల్లో స్వారోస్‌ కార్యక్రమాలు చేస్తున్నారని, రాయలసీమలో కూడా విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వారోస్‌ రాష్ట్ర అధ్యక్షులు కన్నారపు ూపేందర్‌, ఫ్రధాన కార్యదర్శి దామోదర్‌రావు, కోశాధికారి సుధాకర్‌, సహాయ కార్యదర్శి స్వాములు పాల్గొన్నారు. సుబ్బయ్య ప్రవీణ్‌కుమార్‌పై రాసిన  కవితను అందజేశారు. స్వారోస్‌ కార్యక్రమాలు నచ్చి సహకరిస్తున్న ఇంజనీరింగు విద్యాసంస్థల అధినేత సతీష్‌, బాలకృష్ణ, మరి కొందరు పోలీసు అధికారులను స్వారోస్‌కు ప్రవీణ్‌కుమార్‌ పరిచయం చేశారు.