23, నవంబర్ 2018, శుక్రవారం

రాజకీయంగా నష్టపోయినా తెలంగాణ ఇచ్చాం

యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ

మేడ్చల్‌: రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చామని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరికీ కార్తీక పూర్ణిమ, గురు నానక్‌ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత సొంతబిడ్డల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత సంతోష పడుతుందో నేను అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్ర్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’’
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తాం!‘‘ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్‌లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, మీ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఈ నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం మీరు చేసిన పోరాటం తెరాస ప్రభుత్వం సాకారం చేసిందా?’’
వారి‌ కుటుంబానికి ఉపయోగ పడే పనులే చేసుకున్నారు‘‘ఈ నాలుగున్నరేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణ చట్టం అమలు చేయకుండా రైతులకు నష్టం చేసింది. కూలీలకు ఎంతో మేలు చేసే ఉపాధి హామీ చట్టాన్ని కూడా తెరా అమలు చేయలేదు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులకు మాత్రమే ఉపయోగపడే పనులు చేసుకున్నారు. ఎన్నో కలలు, ఆశయాలతో తెలంగాణ ఇస్తే.. అవి సాకారం కాలేదు’’
తెరాస పాలన అంతం చేసే సమయం ఇది!‘‘చిన్న పిల్లాడి పెంపకంలో లోపం ఉంటే అతడి భవిష్యత్‌ ఎలా నాశనం అవుంతుందో ఈ నాలుగున్నర పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టింది. భవిష్యత్‌ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలతోనే తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ముడి పడి ఉంది. తెరాస పాలన అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా.’’ అంటూ తెరాస పాలనపై సోనియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

19, నవంబర్ 2018, సోమవారం

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు

20న పరిశీలన

 21,22 తేదీల్లో నామినేష్ల ఉపసంహరణ

               తెలంగాణ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీక ఘట్టమైన నామినేషన్ల దాఖలు పర్వం సోమవారం 19-11-2018న పూర్తయింది.  ఈ నెల 12వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు.  వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18-11-18 నాటికి  1497 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారం  మూడు గంటల వరకు నామపత్రాలను స్వీకరిస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు పులవురు మంత్రులు, సీనియర్‌ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మరికొంత మంది తమ నామపత్రాలను సమర్పించనున్నారు. కొందరు అభ్యర్థు మంచిరోజు, ముహూర్తాలను ద్రుష్టిలో పెట్టుకొని తమ కుటుంబసభ్యుల, అనుచరుల ద్వారా ఇప్పటికే నామినేషన్లు వేయించారు. తాజాగా చివరి రోజు అట్టహాసంగా నామినేషన్లు వేశారు. జనాన్ని సమీకరించి భారీ ర్యాలీతో నామినేషన్‌ వేసి అభ్యర్థుల బప్రదర్శన చేశారు.
         అటు కొన్ని పార్టీలు అభ్యర్థిత్వాలను ఆదివారం  ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో వారందరూ  నామపత్రాలు సమర్పించారు. బీఫారాలు ఇవ్వకుండా కేవం నామినేషన్‌ వేసిన వారు ఇవాళ బీఫారాలు సమర్పించారు. నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ పూర్తయ్యాక రేపు పరిశీన చేపడతారు. 21, 22 తేదీల్లో నామపత్రాలు ఉపసంహరణకు గడువు ఉంటుంది.
    కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు ఇవాళ్టి నుంచి అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారు. 53 మంది వ్యయ పరిశీలకులు నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలోనే మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు. తాజాగా సాధారణ పరిశీలకులు, శాంతిభద్రత పరిశీలకులు కూడా   పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇప్పటికే 68 మంది సాధారణ పరిశీలకులు, పది మంది శాంతిభద్రత పరిశీలకులు జిల్లాలకు చేరుకున్నారు. రెండు, మూడు నియోజకవర్గాలకు ఒక సాధారణ పరిశీలకులు, ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున శాంతిభద్రతల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తిస్తారు.