రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలను పేదరికం ఉచ్చు నుంచి బయటపడేయడమే స్వేరోస్ నెట్‌వర్క్ స్వచ్ఛంద సంస్థ ధ్యేయమని తెలంగాణ ఐజీ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జీసస్‌నగర్‌లో జయమనెమ్మ కళ్యాణమండపంలో రెసిడెన్షియల్ పాఠశాలల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లార్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివి ఉన్నత స్థానంలో స్థిరపడిన వారందరినీ కలుపుతూ స్వేరోస్ నెట్‌వర్క్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న వారందరి వివరాలు సేకరించామని ఆసక్తి ఉండి పేదరికంతో చదువుకోలేని వారికి సంస్థ అండగా నిలుస్తుందని అన్నారు. నిరుద్యోగయువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో 2004`05లో తాను ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించానని పేర్కొన్నారు. జిల్లా అంటే ప్యాక్షన్ గుర్తొస్తుందని అయితే అంత కంటే ఎక్కువగా ఇక్కడ పేదరికం ఉందని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం ఉందని దానిని వారు వీడాలని సూచించారు. ఉన్నత స్థానంలో స్థిరపడిన ప్రతి ఒక్కరూ తన కుటుంబం, తన పని అని కాకుండా 5 శాతం సంపాదనను తాను వచ్చిన సామాజిక వర్గంలో వెనుకబడిన వారికి ఖర్చు పెట్టాలన్నారు. సమాజంలో అంతరాలను తొలగించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు. రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం రూపొందించిన ‘నేను నంబర్‌వన్ స్టూడెంట్’ అను పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ సంస్థ కేంద్రకమిటీ సభ్యులు సురేష్, రాజేష్, నవీన్, లోక్‌నాధ్‌రెడ్డి, చలపతి, నాగేంద్ర, రమణ పాల్గొన్నారు.
ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
24, మే 2015, ఆదివారం
వెనుకబడిన వర్గాల అభివృద్ధే ‘స్వేరోస్’ ధ్యేయం
17, మే 2015, ఆదివారం
పరిపక్వత చెందిన కథకుడు పాలగుమ్మి పద్మరాజు
‘గాలివాన’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
శతజయంతి సభలో వేదగిరి రాంబాబు
ప్రకృతి, సమాజ పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహనతో రచనలు చేసిన పాలగుమ్మి పద్మరాజు పరిపక్వత చెందిన కథకుడని ప్రముఖ రచయిత, సాహిత్య విశ్లేషకుడు డాక్టర్ వేదగిరి రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలగుమ్మి పద్మరాజు శతజయంతి సభ ఘనంగా నిర్వహించారు. సభకు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించారు. డాక్టర్ వేదగిరి రాంబాబు మాట్లాడుతూ పాలగుమ్మి కథానికలోని వాస్తవికతకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిందన్నారు. కథానికలు తక్కువ సమయంలో బుల్లెట్‌లా దూసుకెళ్లేలా ఉండాలని చెప్పారు. పాలగుమ్మి పద్మరాజు కథలు వాస్తవికతకు దగ్గరగా ఉంటూ అందరి మనస్సులకు హత్తుకుపోతాయన్నారు. గాలివాన కథానిక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిందని చెప్పారు. 1985లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుకు ఎంపికయిందన్నారు. కథలు, కథానికలు, ఏడు నవలలు రాశారు. ఆయన రచనల ఆధారంగా బంగారుపాప, భాగ్యరేఖ, భక్తశబరి, శాంతినివాసం, బికారి రాముడు, రంగుల రాట్నం, శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్ లాంటి సినిమాలు వచ్చాయని వివరించారు. ఆయన శత జయంతి ఉత్సవాలు జూన్ 24తో ముగుస్తాయని తెలిపారు. క్లుప్తంగా, స్పష్టంగా ముందుకు సాగే కథానికకు కొన్ని నింబంధలున్నాయని చెప్పారు. కథానికకు పరిమితులతోపాటు పరిపూర్ణత కూడా ూండాలని అన్నారు. బాగా పండిన పండు రాలితే ఎలా ఉంటుందో కథానిక అలా ఉండాలని వివరించారు. పాలగుమ్మి పద్మరాజు రాసిన కథానిక అలా ఉండటం వల్లనే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు. గాలివాన నవలను ఆయన ఆంగ్లంలోకి అనువదించారని, ఆ రోజుల్లో ఆంగ్లంలో కథలు రాసి ఉంటే గొప్ప ఆంగ్ల రచయితగా పేరు పొందేవారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో మన పాలకులు పద్మరాజు శతజయంతి ఉత్సవాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలగుమ్మి పద్మరాజు కుమార్తె సీత ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో తల్లీతండ్రితో ఉన్న అనుబంధం, అనుభూతులను ఆమె వివరించారు. మాతండ్రి జీవితంలో ప్రతి పాత్ర వాస్తవమని, కల్పితం కాదని చెప్పారు. ఆయన గొప్పతనం బతికుండగా తనకు తెలియలేదని మరణానంతరం తెలిసిందని అన్నారు. మనిషి యంత్రాలతో మాట్లాడటమనేది ఆరోజుల్లోనే ఆయన రచనల్లో తెలిసిందని చెప్పారు. మా తండ్రి బహుదూరపు బాటసారి అని చెబుతూ తిరుపతిపురంలో పుట్టి ఢల్లీిలో తుదిశ్వాస విడిచారన్నారు. క్రమశిక్షణ ఆయనను చూసి నేర్చుకున్నామని చెప్పారు. కథా రచయిత అనంతపురం శాంతి నారాయణ మాట్లాడుతూ జీవితాల మధ్య సంఘర్షణలో ూన్న కథలు నవల కన్నా ఆయన కథలే హృదయానికి తాకాయన్నారు. పడవ ప్రయాణం కథానికను వివరిస్తూ సభికులకు కళ్లకు కట్టేలా వివరించారు. కథా రచయిత నరసింహమూర్తి మాట్లాడుతూ పాలగుమ్మి పద్మరాజు కథలు మాతృత్వం గొప్పదనాన్ని, మానవ సంబంధాలను తెలిపాయన్నారు. తెలుగు రథం అధ్యక్షులు కొంపెల్లి శర్మ మాట్లాడుతూ పాలగుమ్మి రచనల గురించి వివరించారు. సాహితీ వేత్తల జయంతి, వర్ధంతులు ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. తెలుగు రథం పేరుతో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రముఖ కథారచయిత వియోగి ప్రసాద్ మాట్లాడుతూ పాలగుమ్మి పద్మరాజుతో ఉన్న పరిచయాలను, ఆయన రచనలను వివరించారు. సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కార్యదర్శి కెంగార మోహన్ మాట్లాడుతూ పాలగుమ్మి పద్మరాజు రచనల్లోని భాష సున్నితమైన వ్యవహారిక మాండలికాల్లో రాశారని చెప్పారు. అనంతరం అతిథులకు శాలువాలు, సాహితీ పుస్తకాలతో ఘనంగా సన్మానించారు. పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘అనుకోని అతిథి రాకోయి’ అనే పాటను ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి బసవరాజు పాడారు. ఈసభలో సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
16, మే 2015, శనివారం
ఈజిప్ట్ మాజీ అధ్యక్షునికి మరణశిక్ష
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి శనివారం ఈజిప్ట్‌లోని కోర్టు మరణదండన విధించింది. 2011లో ఖైదీలు జైలు నుంచి సామూహికంగా పారిపోవడానికి సంబంధించిన పాత్రకు 100 మంది ముద్దాయిలకు తోడు ఆయనకూ మరణశిక్ష విధించారు. ఈజిప్ట్‌లో స్వేచ్ఛగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మోర్సీ. అధ్యక్షునిగా ఉండగా ఉద్యమకారులను అరెస్ట్ చేయించి, చిత్రహింసలు పెట్టించినందుకు 20 ఏళ జైలుశిక్షను అనుభవిస్తున్నారు. హోస్నీ ముబారక్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక 2012లో ముస్లిం బ్రదర్‌హుడ్ ఉద్యమానికి చెందిన నాయకుడు మోర్సీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మోర్సీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగడంతో 2013లో ఈజిప్ట్ సైన్యం అతన్ని అధ్యక్షపీఠం నుంచి దించేసింది. మోర్సీని దించేయడానికి కారకుడైన సైన్యాధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్`ససి 2014లో అధ్యక్ష ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత ముస్లిం బ్రదర్‌హుడ్‌ను నిషేధించారు.అన్ని మరణశిక్షల లాగానే మోర్సీ మరణశిక్ష తీర్పు పై అభిప్రాయం కోసం ఈజిప్ట్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న గ్రాండ్ ముఫ్తీకి పంపారు. గ్రాండ్ ముఫ్తీ ఈ శిక్షకు ఆమోదం తెలిపినప్పటికీ, నేరారోపణలపై ఇప్పటికీ అప్పీల్ చేసుకోవచ్చు. జూన్ 2న ముఫ్తీ నిర్ణయం వెలువడుతుందనుకుంటున్నారు.
15, మే 2015, శుక్రవారం
రాహుల్ టూర్ సక్సెస్
15 కిలోమీటర్ల దూరం పాదయాత్ర
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పరామర్శ
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలోని కొంతమంది ధనికులు, బడా పారిశ్రామికవేత్తల కోసమే పని చేస్తోందని ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ విమర్శించారు. భవిష్యత్తులో భూమికి బంగారం విలువ రాబోతోందని, దాన్ని కొంత మంది పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకే మోడీ భూ సేకరణ చట్టంలో మార్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి గురించి పట్టించుకోకుండా ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. (2015 మే 15న )శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, లక్ష్మణచాంద మండలాల్లోని ఐదు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గురువారం రాత్రే నాందేడ్ నుండి రాహుల్ గాంధీ నిర్మల్‌కు చేరుకొని మయూరి హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి మామడ మండలంలోని కొరిటికల్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించారు. తిరుపల్లి, లక్ష్మణచాంద, పొట్టపల్లి, రాచపూర్, వడ్యాల్ వరకు 15కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అనంతరం నిర్మల్‌లో భోజనం చేసిన రాహుల్ గాంధీ సాయంత్రం 3 గంటలకు వడ్యాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. పాదయాత్ర సందర్భంగా ఐదు గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకొని ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఏదో విధంగా దేశానికి సేవ చేయగా, రైతులు మాత్రం రక్తం, శ్రమ ద్వారా సేవ చేస్తున్నారని తెలిపారు. రైతులకు వ్యవసాయ చేసుకునేందుకు తప్పనిసరిగా ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రుణాలు అవసరమన్నారు. కాని ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిని కల్పించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రాష్ట్రాల్లో రైతులకు అన్ని రకాల సాయం అందించి వారిని ముందుకు నడిపించామన్నారు. పదేళ్ల కాలంలో దేశంలో 6.5 కోట్ల రైతులకు రూ.70వేల కోట్లు రుణమాఫీ చేసినట్లుగా గుర్తు చేశారు. ప్రతి రైతుకు బ్యాంకు ద్వారా రుణాలు అవసరమని గుర్తించి అందజేశామని చెప్పారు. రైతులను మభ్యపెట్టి అధికారంలోకొచ్చిన మోడీ కనీసం కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మోడీగాని, కెసిఆర్‌గాని రైతులను పట్టించుకుంటే రైతుల సమస్యలపై పాదయాత్ర చేయాల్సిన అవసరం తనకు ూండేది కాదన్నారు. అధికారంలోకొచ్చిన ఏడాది కాలంలో అటు మోడీగాని, ఇటు కెసిఆర్‌గాని ఏ ఒక్కరికీ ూద్యోగం కల్పించలేదన్నారు. కెసిఆర్‌ను ఆయన మినీ మోడీగా అభివర్ణించారు. రైతు రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కోసం రైతుల తరపున పార్లమెంట్‌లో పోరాటం చేస్తానని భరోసా కల్పించారు. బిజెపి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా భూసేకరణ చట్టంలో మార్పులు చేసిందని మండిపడ్డారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే ప్రధాని మోడీ మాత్రం రూ.10లక్షల సూటు, బూటు వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయన వెంట ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు కుంతియా, దిగ్విజయ్‌సింగ్, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, టిపిసిసి అధ్యక్షులు ూత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌కమిటీ ప్రెసిడెంట్ బట్టివిక్రమార్క, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి, మండలి విపక్షనేత డి.శ్రీనివాస్, ఉపపక్షనేత షబ్బీర్‌అలీ, ఎంఎల్‌ఎలు గీతారెడ్డి, డికె.అరుణ, సంపత్, వంశీచందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, వివేక్, సిరిసిల్ల రాజయ్య, మధుయాష్కిగౌడ్, మాజీ కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, బలరామ్‌నాయక్, రాష్ట్ర మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
11, మే 2015, సోమవారం
జయలలితకు ఊరట
ఆదాయానికి మించి ఆస్తుల కేసును కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
తమిళనాడు మాజీ సిఎం జయలలితపై దాఖలైన అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో జయకు ఊరట లభించింది. ఈ కేసుపై సోమవారం కర్ణాటక హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. స్పెషల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ జయలలితకు, మరో ముగ్గురిపై నమోదైన అన్ని అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది. 18 ఏళ్లుగా సాగిన ఈ కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.వందకోట్లు జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తమిళనాడు అంతటా అన్నాడిఎంకె కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. జయలలిత నివాసం, పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోడీ జయకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని అన్నాడిఎంకె ప్రకటనలో తెలిపింది. కోర్టు తీర్పు అనంతరం జయలలిత మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసులు బనాయించారని జయలలిత విమర్శించారు. డిఎంకె వేసిన అభాండాలు నిరాధారమని నిరూపితమైందన్నారు. చివరికి ధర్మమే గెలిచిందన్నారు. తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుని మేలిమి బంగారంలా బయటపడ్డానని అన్నారు. హైకోర్టు తీర్పు తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తమిళ ప్రజల ప్రార్థనలను ఆలకిం చిన దేవుడు ఈ తీర్పు చెప్పించాడని తెలిపారు. ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం జయ లలితకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తనపైన ఉన్న అనర్హత వేటు రద్దయింది. ఈ మేరకు అధికారులు వేటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆమె ఎమ్మెల్యే కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనని తెలిపారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్ధోషిగా తేల్చిచెప్పడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులందరూ ఆమె నివాసానికి వెళ్లి జయకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత ఆదేశిస్తే సిఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని పన్నీర్ సెల్వం తెలిపారు. దీంతో ఈ నెల 17న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్టన్ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పు తుది తీర్పు కాదనీ, ఈ కేసును సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం కచ్చితంగా అప్పీలు చేయాలని పేర్కొన్నారు.
ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి
జయలలితకు అనుకూలంగా కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడంతో డిఎంకె అధినేత కరుణానిధి స్పందించారు. ఈ కేసుకు సంబంధించి ఇదే తుది తీర్పు కాబోదన్నారు. న్యాయ స్థానాలన్నింటి కంటే మనస్సాక్షే ఉన్నతమైనదని కరుణ అభిప్రాయపడ్డారు. తన ఇంటి వద్ద పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసే విషయమై చర్చించినట్లు సమాచారం.
తీర్పు విని షాకయ్యా! : సుబ్రమణ్య స్వామి
హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి పెదవి విరిచారు. కోర్టు తీర్పు తనను అసంతృప్తి పరిచిందన్నారు. తీర్పు విని తను షాక్‌కు గురయ్యానని తెలిపారు. తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
ట్విట్టర్‌లో విమర్శల వెల్లువ
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. పలువురు మమ్మీ రిటర్న్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధనికులు శిక్షల నుండి తప్పించుకోవచ్చునని మరో సారి రుజువైందని పేర్కొన్నారు.
పలువురి అభినందనలు
అక్రమాస్తుల కేసులో ఊరట లభించడంతో పలువురు రాజకీయ ప్రముఖుల నుండి జయకు అభినందనలు వెల్లువెత్తాయి. స్వయానా ప్రధాని మోడీ ఫోన్ చేసి తనకు అభినందనలు తెలియజేయటం విశేషం. తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నజ్మా హెప్తుల్లా, ఎన్సిపి నేత శరద్ పవార్, టిఎంసి నేత జికె వాసన్, తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటు, తమిళ చలన చిత్ర ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
కేసు విచారణ ఇలా...
1996: జయలలితకు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది, రాజకీయ వేత్త సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు
1996: డిసెంబర్7 జయలలిత అరెస్టు
1997: జయలలిత, ఇతర నిందితులకు వ్యతిరేకంగా చెన్నై అదనపు సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభం
1997, జూన్4: భారత శిక్షా స్మృతి 120`బి, 1988 అవినీతి నిరోధక చట్టం 13(1)(ఇ) కింద అభియోగ పత్రం దాఖలు
1997, అక్టోబర్1: విచారణకు గవర్నర్ ఫాతిమాబీవి జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని మద్రాస్ ఉన్నత న్యాయస్థానంచే కొట్టివేత
2000 ఆగస్టు: న్యాయస్థానంలో 250 సాక్షుల విచారణ, అప్పటికి ఇంకా పది మందిని విచారించాల్సి ఉండిరది.
2001 మే: విధాన సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయదుందుభి. ముఖ్యమంత్రి గద్దెపై మళ్లీ జయలలిత అధిరోహణ
తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల సంస్థ(టాన్సి) కేసులో 2000 అక్టోబర్‌లో శిక్షకు గురైనందున ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంపై అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు
2001 సెప్టెంబర్21: జయలలిత నియామకాన్ని రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం
2003: నిష్పక్షపాత విచారణకు కర్ణాటక కోర్టుకు కేసు విచారణను బదిలీ చేయాలని డిఎంకె ప్రధాన కార్యదర్శి అన్భాళగన్‌చే అత్యున్నత న్యాయస్థానానికి ఫిర్యాదు
2003 నవంబర్18 కేసు కర్ణాటక న్యాయస్థానానికి బదిలీ
2005 ఫిబ్రవరి 19: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, విశ్రాంత న్యాయవాది జనరల్ బివి ఆచార్య నియామకం
2011: జయలలిత విచారణ. న్యాయస్థానంలో 1,339 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
2012: ఆగస్టు 12: బివి ఆచార్య రాజీనామా
2013 ఫిబ్రవరి: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భగవాన్ సింగ్ నియామకం
2013 ఆగస్టు 26: కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించకుండా, ప్రత్యామ్నాయ నియామకాన్ని జరపకుండా భగవాన్ సింగ్ నియామకం ప్రభుత్వంచే రద్దు
2013 సెప్టెంబర్ 30: భగవాన్ సింగ్ రద్దు నియామకాన్ని కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం
2014 ఆగస్టు 28: తీర్పు సెప్టెంబర్ 20 కి వాయిదా. నిందితులు నలుగురూ హాజరు కావాలని న్యాయస్థానం ఉత్తర్వు
2014 సెప్టెంబర్ 20: తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు ప్రకటన
2014 సెప్టెంబర్ 27: జయలలిత, ఇతరులకు శిక్ష విధింపు
2014 అక్టోబర్ 7: బెయిల్ వినతి తిరస్కరణ
2014 అక్టోబర్ 17: బెయిల్ మంజూరు, 21 రోజుల చెరసాల నుండి విముక్తి
2015 మే 11 నిర్ధోషిగా కర్ణాటక హైకోర్టు తీర్పు

9, మే 2015, శనివారం
అమ్మ ప్రేమ అనంతం
నేడు మదర్స్‌డే
మాతృదేవోభవా, పితృదేవోభవా, ఆచార్య దేవోభవా అంటూ పలికినా తొలిపదం తల్లికే చోటిచ్చారు. అమ్మా, నాన్నను సమానంగా సృష్టించినా అమ్మ ప్రేమను వెలకట్టలేము. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా, ఏ దేశమేగినా, ఎక్కడ ఉన్నా అమ్మ ప్రేమలో మార్పు ఉండదు. తన ఆయువునే ఆరోప్రాణంగా మలచి జన్మనిచ్చి, పసివయస్సులో తొలిపరచమై బుడిబడి నడకలు నేర్పి, మమకారం ఆత్మీయతను పంచుతూ, గోరు ముద్దులు తినిపిస్తూ అన్నీ తానై ప్రేమకు ప్రతిరూపంగా నిలిస్తున్న అమ్మ రుణం తీర్చుకోలేనిది. ముఖ్యంగా టీనేజ్ వయస్సులోని పిల్లలతో తల్లి స్నేహంగా ఉంటూ వారికి ఏమీ కావాలో తెలుసుకొని అన్నీ తానై వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తుంది. ఇందులో అమ్మ పాత్ర మరువలేనిది. అందుకే అమ్మకు కూడా ఒక పండుగను నిర్వహించుకునేందుకు గాను ప్రతి మే నెల రెండో ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా ‘మదర్స్‌డే’ను నిర్వహిస్తున్నారు. గ్లోబలీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో మదర్స్‌డే ప్రాముఖ్యత పెరిగిపోయింది. నేడు మధర్స్ డే గురించి పలు వెబ్‌సైట్లలో, అన్ని భాషల్లో ఎన్నో వేల కోటేషన్లు దర్శనమిస్తున్నాయి. మదర్స్ డే రోజున పిల్లలు తమ తల్లికి అందమైన గ్రీటింగ్ కార్డులు, పలు రకాల బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ మదర్స్‌డే ప్రాముఖ్యం పట్టణాల నుండి ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి విస్తరిస్తోంది. మదర్స్‌డే రోజున పిల్లలు తమ తల్లితండ్రులతో కలసి విందులు, వినోదాలు చేసుకొవడం, బహుమతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా మారింది.
కమర్షియల్ గా మారిన మదర్స్‌డే...
ప్రపంచమే కుగ్రామైన ఈ రోజుల్లో మదర్స్‌డేను కార్పొరేట్ సంస్థలు కమర్షియల్ గా మార్చివేశాయి. మదర్స్‌డే సందర్భంగా భారీ స్థాయిలో పిల్లలు తమ తల్లులకు పెద్ద పెద్ద బహుమతులను అందిస్తున్నట్లుగా టివి, యాప్స్, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తూ సామాన్య పిల్లలకు కూడా తమ తల్లులకు అదే స్థాయిలో బహుమతులను అందించాలనే ఆలోచనలు రేకితిస్తున్నారు. తల్లికి, పిల్లల మధ్య ూన్న ప్రేమను వ్యాపారంగా మార్చుకొని తమ ూత్పత్తులను అమ్మకాలు సాగిస్తున్నారు.

అమ్మ పాట
అమ్మనాప్రాణమురా అమ్మనా సర్వమురా।2।
అమ్మకన్న మిన్న ఏది ముజ్జగాన లేదురా ।2।
అమ్మవెన్నమనుసులోతు ఎవరు కొలువలేరురా2
అమ్మఒడి తొలిబడి పలుకులమ్మ గర్భగుడి ।2।
వెలితిలేని ప్రేమ పంచు అమ్మకెవరు సాటిరా ।2।
కలతలన్ని తీర్చిధరి చేర్చు అమ్మ దేవతరా ॥అమ్మ॥
అమ్మనా తోడునీడ చూపదమ్మ ఏ తేడ 2
బుడిబుడి నడకలు నేర్పిన అమ్మమార్గదర్శిరా ।2।
కొసరికొసరి గోరుబుద్దలెట్టినన్ను సాకెరా ॥అమ్మ॥
అమ్మపలుకు నాకు స్పూర్తి అమ్మేనాలోనశక్తి
బాధలెన్నో దిగమింగి అమృతాన్ని పంచెరా
కోటిజన్మలెత్తినా అమ్మరుణం తీరదురా ॥అమ్మ॥

8, మే 2015, శుక్రవారం
బ్రిటన్ గద్దెపై మరోసారి కామెరాన్
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో మితవాద కన్సర్వేటివ్ పార్టీ అనూహ్యమైన మెజార్టీతో విజయం సాధించింది. ప్రధాని డేవిడ్ కెమరాన్ మరోసారి పదవ నంబర్ డౌనింగ్ స్ట్రీట్ (బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం)లో ప్రవేశించనున్నారు. కన్సర్వేటివ్‌ల భారీ విజయం బ్రిటిష్ రాజకీయాలు మరింతగా మితవాదం వైపు మళ్ళాయనడానికి ఒక తార్కాణమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని డేవిడ్ కెమరాన్ రాణి ఎలిజబెత్`2ను కలిశారు. అనంతరం ఆయన తన నివాసం వెలుపల మాట్లాడుతూ మెజారిటీ కన్సర్వేటివ్ ప్రభుత్వాన్ని తాను ఏర్పాటుచేయబోతున్నానని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తనతో పోటీపడిన మాజీ సంకీర్ణ భాగస్వామి , లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు నిక్ క్లెగ్, ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు ఇడి మిలిబండ్‌లను కెమరాన్ అభినందించారు.ప్రతి ఒక్కరూ చక్కటి మెరుగైన జీవితాన్ని గడిపే ప్రదేశంగా బ్రిటన్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని కెమరాన్ చెప్పారు. కన్సర్వేటివ్స్‌కు సీట్లలో దగ్గరగా నిలుస్తుందనుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ బాగా వెనకబడిరది. మొత్తం 650 స్థానాలున్న పార్లమెంటులో కన్సర్వేటివ్స్ పార్టీ 330 సీట్లు కైవసం చేసుకోగా, లేబర్ పార్టీ 230 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయిన ఎడ్వర్డ్ మిలిబాండ్‌తోపాటు లిబ్‌డెమ్స్ నేత నిక్ క్లెగ్, యుకెఐపి నేతనైజల్ ఫరాజ్ పదవులకు రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రజలు కన్జర్వేటివ్ పార్టీని గట్టిగా సమర్ధించారని శుక్రవారం ఉదయం ఫలితాలు తెలిసినవెంటనే ప్రధాని కామెరాన్ హర్షంవ్యక్తం చేశారు. తనను తిరిగి ఎన్నుకున్న ఆక్స్‌ఫర్డ్‌షైర్ వాసులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ‘మనదేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేవిధంగా ప్రతిఒక్కరికీ సుపరిపాలన అందించాలన్నది తన ఆకాంక్ష అని కామెరాన్ చెప్పారు. స్కాట్లండ్ స్వాతంత్య్ర రిఫరెండం సందర్బంగా చేసిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తన పార్టీ, తమ ప్రభుత్వం దేశానికి నేతృత్వం వహించాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
ఎస్‌ఎన్‌పి ప్రభంజనం
ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీ ప్రభంజనంలా విజృంభించటంతో లేబర్‌పార్టీకి ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో లేబర్‌పార్టీ నేతృత్వంనుండి తాను వైదొలుగుతున్నట్లు ఎడ్వర్డ్ మిలిబండ్ ప్రకటించారు. ఓటమిపాలయిన వారిలో స్కాటిష్ లేబర్ పార్టీ నేత జిమ్ మర్ఫీ, మరో సీనియర్ నేత డగ్లస్ అలెగ్జాండర్ కూడా ఓటమి పాల య్యారు. లిబ్‌డెమ్స్‌ను ఓడిరచినప్పటికీ లేబర్ పార్టీ కన్జర్వేటివ్‌ల విజయాన్ని నిలువరించటంలో ఘోరంగా విఫలమైంది. డాన్‌కాస్టర్ స్థానంలో తనను సమర్తించిన మద్దతుదారులకు మిలిబాండ్ కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ఐక్యంగా వుంచటంలో కొత్త ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రముఖుల్లో లండన్ నగర మేయర్ బోరిస్ జాన్సన్ తదితరులున్నారు.

7, మే 2015, గురువారం
‘చంద్ర’కుమారులు
అమెరికాలో కేటిఆర్, లోకేష్‌ల బిజీబిజీ
రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుబడులే లక్ష్యం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి గంటల తరబడి తీరికలేకుండా ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారు. కెసిఆర్ ఢల్లీిలో ఉంటే, చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరి తనయులు మంత్రి కేటిఆర్, లోకేష్ అమెరికాలో బిజీబిజీగా ూన్నారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ ఇద్దరు యువనేతలు అమెరికాలో వ్యాపార దిగ్గజాలను కలుసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బబామాతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందని టిఆర్‌ఎస్, టిడిపి నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టబడులే లక్ష్యంగా మంత్రి కేటిఆర్ ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ నుండి అమెరికాకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం కేటిఆర్ వాషింగ్టన్ డిసీలో జరిగిన పలు సమావేశాల్లో పెట్టుబడుల అవకాశాల మీద మాట్లాడారు. అమెరికాలో భారత రాయబారి అరుణ్‌కుమార్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం కేటిఆర్ బోయింగ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు మార్క్ ఎలెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విమానయాన, రక్షణరంగాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న ప్రాధామ్యాలను మంత్రి వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మంత్రి అభ్యర్థనపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ.. త్వరలోనే రాష్ట్రానికి ప్రతినిధి బృందంను పంపనున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఐటీ దిగ్గజ్జం హెచ్‌పీ సంస్థ ఉపాధ్యక్షుడు సువర్ణో బెనర్జీతో కేటీఆర్ సమావేశమయ్యారు. హెచ్‌పీ ప్రింటర్ల యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పాలని కోరారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయలపైనా కేటిఆర్ వివరించారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డిసి ఎన్నారైలు మిషన్ కాకతీయకు 50 వేల అమెరికన్ డాలర్లు విరాళాన్ని అందజేశారు.తెలుగుదేశం పార్టీ యువనేత, ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. మూడు రోజులక్రితమే అమెరికా చేరుకున్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా ఆయన బిజీబిజీగా గడిపారు. ఏపీలోని వనరులను, అవకాశాలను వినియోగించుకుని విరివిగా పెట్టుబడులు పెట్టడంతో పాటు, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరారు. సిస్కో ఎగ్జిక్వూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ గ్లోబలైజేషన్ ఆఫీసర్ విమ్ ఎల్ ఫ్రింక్‌తో లోకేష్ భేటీ అయ్యారు. వైజాగ్‌లో తమ పరిశ్రమను పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యప్రముఖల్లో ఒకరైన వినోద్ ఖోస్లాతోనూ ఆయన సమావేశమయ్యారు. ఇంకా అమెరికా ప్రిసిడెంట్ అడ్వయిజరీ బోర్డులో సభ్యుడైన అడోబో సిఇఓ శంతనునారాయణను కలుసుకున్నారు.
6, మే 2015, బుధవారం
శివాజీ దీక్ష భగ్నం
వైద్యానికి ససేమిరా అంటున్న శివాజీ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న సినీనటుడు శివాజీ దీక్షను పోలీసులు బుధవారం మధ్యాహ్నం భగ్నం చేశారు. గత ఆదివారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షకు దిగిన శివాజీ 100 గంటలపాటు దీక్షను కొనసాగించారు. దీక్షలకు వివిధ రాజకీయపార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. శివాజీని పోలీసులు రెండోరోజే అరెస్టు చేస్తారని భావించినా అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. అయితే బుధవారం శివాజీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి ఆరు కేజీల బరువుతగ్గారు. బీపీ, చక్కెర పరిమాణాలు తగ్గిపోయాయి. దీంతో అర్బన్ జిల్లా పోలీసులు హుటాహుటిన దీక్షా శిబిరానికి చేరుకుని ఆయన్ను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీక్ష భగ్నానికి నిరసనగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు కారెం శివాజీ, వికలాంగుల హక్కుల పోరాట సంఘం ప్రతినిధులు దీక్షాశిబిరం వద్ద కొద్దిసేపు రాస్తారోకో చేశారు.
ప్లూయిడ్స్ తీసుకోని శివాజీ
బలవంతంగా ఆస్పత్రికి తరలించి సెలైన్స్ ఎక్కిస్తున్నప్పటికీ శివాజీ మాత్రం వైద్యానికి సహకరించడంలేదు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

3, మే 2015, ఆదివారం
శివాజీదీక్ష ఫలించేనా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సినీనటుడు శివాజీ 2015 మే 3న (ఆదివారం ) గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్ష ప్రారంభించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగా శివాజీ ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే దీక్ష చేస్తున్నానని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఎన్నికల్లో తాను బిజెపి నాయకులతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బిజెపి గెలుపుకు కృషి చేశానని, బిజెపి గెలిస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని ఓటర్లకు చెప్పానని అన్నారు. అయితే నేడు ఎన్నికల అనంతరం బిజెపి ప్రత్యేక హోదా హామీ విషయంలో మాట తప్పిందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు ప్రచారం చేశారని ఆ హామీ నిలబెట్టుకోవటానికి కేంద్రంపై టిడిపి వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. దీక్షలకు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మాలమహానాడు నేత కారెం శివాజీ, లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, గిరిజన విద్యాసంఘాలు, ఎపి బిసి సంక్షేమ సంఘం, ముస్లిమ్ సంఘాల ఐక్య వేదిక, యువజన కాంగ్రెస్ నాయకులు రోహిత్, రజక సంఘాలు, నవతరం పార్టీ, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు వైవి సురేష్, కాపునాడు స్టేట్ ప్రెసిడెంట్ బాబురావు, పలు దళిత, ప్రజాసంఘాలు దీక్షలు మద్దతు తెలిపారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయపార్టీలు, ప్రధానంగా బిజెపి, టిడిపి ధీక్షలోకి వస్తే ప్రత్యేక హోదా రావచ్చని నాఅభిప్రాయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)