వైద్యానికి ససేమిరా అంటున్న శివాజీ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న సినీనటుడు శివాజీ దీక్షను పోలీసులు బుధవారం మధ్యాహ్నం భగ్నం చేశారు. గత ఆదివారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షకు దిగిన శివాజీ 100 గంటలపాటు దీక్షను కొనసాగించారు. దీక్షలకు వివిధ రాజకీయపార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. శివాజీని పోలీసులు రెండోరోజే అరెస్టు చేస్తారని భావించినా అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. అయితే బుధవారం శివాజీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి ఆరు కేజీల బరువుతగ్గారు. బీపీ, చక్కెర పరిమాణాలు తగ్గిపోయాయి. దీంతో అర్బన్ జిల్లా పోలీసులు హుటాహుటిన దీక్షా శిబిరానికి చేరుకుని ఆయన్ను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీక్ష భగ్నానికి నిరసనగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు కారెం శివాజీ, వికలాంగుల హక్కుల పోరాట సంఘం ప్రతినిధులు దీక్షాశిబిరం వద్ద కొద్దిసేపు రాస్తారోకో చేశారు.
ప్లూయిడ్స్ తీసుకోని శివాజీ
బలవంతంగా ఆస్పత్రికి తరలించి సెలైన్స్ ఎక్కిస్తున్నప్పటికీ శివాజీ మాత్రం వైద్యానికి సహకరించడంలేదు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి