5, ఆగస్టు 2015, బుధవారం

వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

                ‘అనంత’కరువు పరిశీనతో వి శ్రీనివాసరావు
    రాయసీమ లాంటి వెనుక బడిన జిల్లాలను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యు వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కరువుపై అధ్యయనం చేసేందుకు 2015 ఆగస్టు5న బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి ఓబులు, జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పిపెద్దిరెడ్డితో కలిసి కరువు పరిస్థితును పరిశీలించారు. అనంతరం మీడియాతో శ్రీనివాసరావు మాట్లాడారు. 15 ఏళ్లలో  13 ఏళ్లు పంటలు సరిగ్గా చేతికి రాలేదన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని కేంద్రం చెబుతోందన్నారు. వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం  విఫలమైంన్నారు. హంద్రీనీవాకు వచ్చే బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించాలన్నారు.  కరువు ప్రాంత అభివృద్ధికి జాతీయ స్థాయిలో ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడేలా కృషి చేస్తామని చెప్పారు.