12, జనవరి 2020, ఆదివారం

సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ


Mahesh Babus Sarileru Neekevvaru Telugu Movie Review And Rating - Sakshi
Rating: 
మూవీ: సరిలేరు నీకెవ్వరు
జానర్‌: కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటుల: మహేశ్‌బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
దర్శక​త్వం: అనిల్‌ రావిపూడి
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు

సంక్రాంతి పండుగ సీజన్‌లో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన మరో బిగ్‌ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టీజర్‌, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడం.. సంక్రాంతి సీజన్‌లో వస్తుండటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో సరిలేని జోరుతో ఈ బొమ్మ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనిపించుకుందా..
 
కథ: కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే భారతి (విజయశాంతి) చాలా నిక్కచ్చి, నిజాయితీగల వ్యక్తి. తప్పును ఎప్పుడూ రైట్‌ అని టిక్‌ చేయదు. ఆమె పెద్ద కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం​ అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలోనే ఉంటూ ఓ ఆపరేషన్‌లో గాయపడి.. చావుబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురికి పెళ్లి నిశ్చయమై.. ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి విషాదవార్తను చేరవేయాల్సి రావడంతో.. నైతిక కట్టుబాటుగా మేజర్‌ అజయ్‌ (మహేశ్‌బాబు)ను దగ్గరుండి పెళ్లి చేయించి.. ఈ వార్త చేరవేయాల్సిందిగా ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయి కొడుకు రవి మర్డర్‌ నేపథ్యంలో కర్నూలులో స్థానిక మినిష్టర్‌ నాగేంద్ర (ప్రకాశ్‌రాజ్‌) వల్ల భారతి చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతోంది. ఈ క్రమంలో శక్తిమంతుడైన నాగేంద్ర నుంచి భారతిని  అజయ్‌ ఎలా కాపాడారు.  ఈ మర్డర్‌ మిస్టరీని ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అన్నది మిగతా కథ..

నటీనటులు: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మరోసారి తన మ్యాజిక్‌ను తెరపై చూపాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్‌సమ్‌ లుక్‌తో, సెటిల్డ్‌ యాక్టింగ్‌తో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. కామిక్‌ టైమింగ్‌తో అలరించడమే కాదు యాక్షన్‌ పార్టులోనూ మహేశ్‌ దుమ్మురేపాడు. మహేశ్‌ ఎంట్రీ సీన్‌, తమన్నాతో ‘డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌’లో ఎనర్జిటిక్‌ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్‌ సీన్‌.. ‘మైండ్‌ బ్లాంక్‌’ పాటలో మాస్‌ స్టెప్పులతో ఇలా తనదైన పర్ఫార్మెన్స్‌తో మహేశ్‌ అలరించాడు. ఫస్టాప్‌లో రైలు జర్నీ సీన్లలోనూ పంచ్‌ డైలాగులు, కామెడీ సీక్వెన్‌తో నవ్వించాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సీన్‌లో యాక్షన్‌ పార్టు, మహేశ్‌ హీరోయిజం ఎలివేషన్‌ షాట్లు ఫ్యాన్స్‌ ను అలరిస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ పవర్‌ఫుల్‌గా ఉండటం ఫ్యాన్స్‌కు కిక్కు ఇస్తుంది. అల్లురి సీతారామరాజు సినిమాలోని సీన్‌ను సందర్భానుసారం వాడుకోవడం, సూపర్‌స్టార్‌ కృష్ణను గుర్తుచేయడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, సెకండాఫ్‌ వచ్చేసరికి కథ పెద్దగా ఏమీ లేదని తేలిపోవడంతో మహేశ్‌ పాత్ర కొంచెం స్లో అయిపోతోంది. ఇక, చాలాకాలం తర్వాత తెరపై మీద కనిపించిన విజయశాంతి భారతిగా పవర్‌ఫుల్‌ పాత్రలో అలరించారు. ఆమె సహజమైన అభినయం, డైలాగ్‌ డెలివరీ సినిమాకు ఒకింత నిండుతనం తెచ్చాయి. నిజాయితీగా గల ప్రొఫెసర్‌గా, ఆర్మీలో కొడుకులను కోల్పోయిన తల్లిగా ఆమె అభినయం ప్రేక్షకుల్లో గౌరవభావాన్ని, కంటతడిని పెట్టిస్తాయి. ఇక, హీరోయిన్‌గా రష్మిక మందన్నా మహేశ్‌ సరసన తనదైన ఎనర్జిటిక్‌ యాక్టింగ్‌తో అలరించింది. మీకు ఏమైనా అర్థమవుతుందా.. ఐ యామ్‌ ఇంప్రెస్డ్‌.. వంటి పంచ్‌ డైలాగులతో నవ్వించింది. ‘హి ఈజ్‌ సో’ క్యూట్‌ పాటలో అందంగా కనిపించిన రష్మిక.. ‘మైండ్‌ బ్లాక్‌’ పాటలో.. మాసీలుక్‌తో గ్లామరస్‌ డోస్‌ను పెంచిందని చెప్పాలి. ఇక, మినిస్టర్‌ నాగేంద్రగా విలన్‌ పాత్రలో కనిపించిన ప్రకాశ్‌ తన పాత్ర మేరకు అలరించారు. తనదైన యాక్టింగ్‌తో ప్రకాశ్‌ రాజ్‌ మెప్పించినప్పటికీ.. సినిమా క్లైమాక్స్‌ వెళ్లేసరికి నాగేంద్ర పాత్ర అనేక మలుపులు తిరుగుతుంది. ఇక, రాజేంద్రప్రసాద్‌, కౌముది, సంగీత, రావు రమేశ్‌, హరితేజ తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ: పక్కా కమర్షియల్‌ సినిమాలు తీస్తూ.. వరుస హిట్స్‌ అందుకుంటున్న అనిల్‌ రావిపూడి మరోసారి పూర్తిగా తన ఫార్మెట్‌లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ను తీశాడు. తన సినిమాల్లో ఉండే అన్ని దినుసులు ఈ సినిమాలోనూ జోడించాడు. హీరో-హీరోయిన్లతో కామెడీ చేయించడం,  క్యాచీ పదాలు, పంచ్‌ డైలాగులతో ఇలా తనకు తెలిసిన అన్ని మాస్‌-మసాలా అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఈ విషయంలో ఫస్టాప్‌ వరకు సక్సెస్‌ అయిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌ వచ్చేసరికి ఎప్పటిలాగే కథను లైట్‌గా తీసుకున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. సెకండాఫ్‌లో భారతి ఎందుకు కష్టాల్లో పడిందనే అంశాన్ని అంత గ్రిప్పింగ్‌గా, స్ట్రాంగ్‌గా అనిల్‌ చెప్పలేకపోయాడు. ఈ సినిమాలో జోడించిన మర్డర్‌ మిస్టరీ ఇన్వేస్టిగేషన్‌, దాని వెనుక ఉన్న నాగేంద్ర కరప్షన్‌ ఇలాంటి అంశాలు కొత్తగా ఉండకపోగా.. రోటిన్‌ అనిపించి బోర్‌ కొడతాయి. సెకండాప్‌ మొదట్లోనే ప్రకాశ్‌ రాజ్‌ను మహేశ్‌ ఢీకొనడంతో.. విలన్‌ పాత్ర వీక్‌ అవుతోంది.
అయితే, కథపై అంతగా శ్రద్ధపెట్టకపోయినా.. ఎప్పటిలాగే కామెడీ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై అనిల్‌ ఫోకస్‌ చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్‌కు నివాళులర్పించే సీన్‌, తల్లి (విజయశాంతి) భావోద్వేగం కంటతడి పెట్టిస్తాయి. డైలాగులు అక్కడక్కడ పేలి.. ప్రేక్షకులతో ఈల వేయించినా.. కొన్ని డైలాగుల రిపిటేషన్‌ కనిపిస్తుంది. మరికొన్నిసార్లు క్యాచీ వర్డ్స్‌ను ఫోర్స్‌డ్‌గా పెట్టినట్టు అనిపిస్తోంది. ఇక, సీఎం, మంత్రులను బంధించి.. హీరో లెంగ్తీ లెక్చర్‌ ఇవ్వడం బాగానే ఉన్నా.. మరీ అవుట్‌ ఆఫ్‌ లాజిక్‌ అనిపిస్తోంది. కథ పెద్దగా లేకపోయినా.. ఇలాంటి అంశాలు, భారీ భారీ డైలాగులతో సెంకడాఫ్‌ను మరీ లెంగ్తీగా చేసిన ఫీలింగ్‌ కలుగుతోంది. అయితే, మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎంటర్‌టైన్‌ చేసే అంశాలు ఉండటం, యాక్షన్‌పార్ట్‌ నీట్‌గా బాగుండటం, దేవీశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌ కావడంతో ఈ సంక్రాంతి సీజన్‌లో ఇది సూపర్‌స్టార్‌ అభిమానులు అలరించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశముంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉండటంతోపాటు సినిమా నిర్మాణ విలువలు రిచ్‌ ఉన్నాయి. అయితే, ఎడిటింగ్‌ విషయంలో మరింత కత్తెరవేసి.. క్రిస్ప్‌గా ప్రజెంట్‌ చేస్తే బాగుండేదన్న ఫీలింగ్‌ రాకపోదు.
ప్లస్‌ పాయింట్స్‌
మహేశ్‌బాబు యాక్టింగ్‌, కామెడీ
విజయశాంతి
పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
ఫస్టాప్
మైనస్‌ పాయింట్స్‌
కథ పెద్దగా లేకపోవడం
సెంకడాఫ్‌ లెంగ్తీగా ఉండటం