11, జనవరి 2017, బుధవారం

విద్యతోపాటు విలువలు పెంచుకోవాలి

                                                  జిల్లాపరిషత్‌ సిఇఒ క్ష్మీనారాయణ
           సమాజంలో విద్యకు ఉన్న విలువ దేనికీ లేదని, అందరూ కనీస విలువలు పెంచుకోవాలని తెంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ సిఇఒ వి.లక్ష్మీనారాయణ అన్నారు. 2017 జనవరి 10న గోపాల్‌పేట మండల బుద్దారం గ్రామానికి చెందిన  పలుస శేఖర్‌ గౌడ్‌ ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో డాక్టరేట్‌ పట్టా పొందిన సందర్భంగా ఆయనకు విశ్వవాణి యువజన సంఘం , బుద్దారం ఆత్మీయ మిత్ర బృందం  ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన  ఈకార్యక్రమానికి వి.లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు గ్రామాల్లో పాఠశాలు ఉండేవి కావని అన్నారు. చదువుకోవాలనుకునే వారు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాలు ఉడటం వల్ల సామాన్యునికి విద్య అందుబాటులోకి వచ్చిందని అన్నారు. బుద్దారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకున్న శేఖర్‌ గౌడ్‌ ఆంగ్లంలో పిహెచ్‌ డి  చేసి డాక్టరేట్‌ పట్టా తీసుకోవడం అభినందించ దగిన విషయమని అన్నారు. ఆయన్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉ న్నత చదువులకు వెళ్లాలని సూచించారు. 
                                                  బుద్దారం పాఠశాలకు రూ.5 లక్షలు
          బుద్దారం నుంచి ఈ సందర్భంగా  వినతులు అందాయని కాని పాఠశాలకు నా పరిధిలోని  సహాయం చేయానకున్నానని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల అదనపు భవనా నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సిఇఒ క్ష్మినారాయణ ప్రకటించారు. త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పూర్తి చేసుకున్న వారికి వెంటనే నిధులు వచ్చేలా చూస్తామని చెప్పారు. భవిష్యత్తులో నిర్మించుకోబోయే వారికి కూడా సహకరిస్తామని చెప్పారు. గ్రంథాలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని శేఖర్‌ గౌడ్‌ చేసిన విజ్ఞప్తిని ఇప్పుడే అములు చేయలేనని సున్నితంగా తిరష్కరించారు.
                                  పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన శేఖర్‌గౌడ్‌ : చందోజీ రావు
        పేదరికం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన శేఖర్‌ గౌడ్‌ అభినందనీయుడని డిగ్రికళాశాల ప్రొఫెసర్‌ చందోజీ రావు అన్నారు. శేఖర్‌గౌడ్‌ జీవిత విశేషాలను ఆసక్తికరంగా వివరించారు. సంపద ఎంత సంపాదించినా పోతుందని  విద్యమాత్రం ఎప్పటికీ చెరగని, తరగని దని పద్యం రూపంలో తెలిపారు. ఆయన చదువుకుని అందరికీ విద్యను బోధించే అలవాటు చిన్ననాటినుంచే అలవరుచుకున్నారని చెప్పారు. ట్యుటోరియల్‌, లయోలా జూనియర్‌ కళాశా ల ఏర్పాటు చేసి ఎందరినో విద్యావంతులను చేయడానికి కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం ఉపాధ్యాయునిగా సేవందిస్తున్నారని చెప్పారు. సభికులను ఆకట్టుకునేలా చమత్కారమైన భాష, చందోజిరావు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
                                               పీహెచ్‌డీ అత్యున్నత డిగ్రీ : పానుగంటి చంద్రయ్య
              డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) అనేది ఒక వ్యక్తి డాక్టరేట్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయటం ద్వారా విశ్వవిద్యాలయం నుండి పొందే ఒక అత్యున్నత డిగ్రీ అని ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య చెప్పారు. సాహిత్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సైన్స్‌, గణితం, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ/డిఫిల్‌ వంటి అనేక భిన్న రంగముల కొరకు పీహెచ్‌డీ  డిగ్రీలు ఉన్నాయని చెప్పారు. డాక్టరేట్‌ చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణించబడుతుందని వివరించారు.  ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క హాబిలిటేషన్‌ తప్ప డాక్టరేట్‌ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవని చెప్పారు.  డాక్టరేట్‌ అనే పదం లాటిన్‌ భాషలోని డాక్టర్‌ నుండి ఉదయించిందనీ, డాక్టర్‌ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం  చెప్పారు. ఉపాధ్యాయుడు అంటే మామూలు ఉపాధ్యాయుడు కాదని ఆయన ఎంచుకున్న రంగంలో నిష్నాతుడయిన ఉపాధ్యాయుడని తెలిపారు.  ఈ డిగ్రీ మధ్య యుగంలో వచ్చిందని, ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో బోధించాంటే డాక్టరేట్‌ తప్పనిసరిగా కావాల్సి ఉండేదన్నారు. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ , ఒక రంగంలో నిష్నాతులైన డాక్టరుకు మధ్య తేడాను వివరించారు. ఆంగ్లంలో నిష్నాతుడైన శేఖర్‌గౌడ్‌  డాక్టరేట్‌ పట్టాపొందారని చెప్పారు. ఈసందర్భగా అమ్మ గొప్పదనంపై  చంద్రయ్య పాట పాడారు.
                ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ బాలాజీ, బుద్దారం సర్పంచి పానుగంటి శివకుమార్‌, ఎంపిటిసి శేఖర్‌ గౌడ్‌, మాజీ సర్పంచు అచ్యుతరామారావు, జాంప్లానాయక్‌, మాజీ ఎంపిటిసి పూల్యానాయక్‌, పాలెం డిగ్రీ కళాశా ప్రిన్సిపాల్‌ రాజెంద్రసింగ్‌, రిటైర్డ్‌ ప్రధానోపా ధ్యాయు గోపాల్‌రెడ్డి, ఉపాధ్యా యు శ్రీనివాస్‌, పానుగంటి రాము, ప్రతాప్‌,  నరసింహా, డీర్‌ అమర్‌నాథ్‌, అంబేద్కర్‌ విజ్ఞాన సేవాసంఘం అధ్యక్షు పానుగంటి ఓంకార్‌, స్థానికు కుర్మయ్య, రిటైర్డ్‌ పిజికల్‌ డైరెక్టర్‌ పాం డురంగారావు, శ్రీకాంత్‌, నాగేంద్రం, పాఠశాల ప్రధానో పాధ్యాయులు , ఉపాధ్యాయు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు శేఖర్‌ గౌడ్‌ ను పూలమాలలు, శాలువాతో సన్మానించారు.