17, నవంబర్ 2010, బుధవారం

హంసను మీరు చూశారా?

హంస ఒక అందమైన పక్షి అంటారు. హిందూమతంలో హంసకొక ప్రత్యేకస్థానం ఉందట. హంస సరస్వతీదేవి వాహనమట. వేదాలలో అత్యున్నత స్థాయికి చేరిన వారిని పరమహంస అని ప్రస్తుతించేవారుట. హంసకు పాలను, నీరును వేరుచేసే సామర్థ్యం ఉందంటారు. కాని అది పాలు, నీరు కలిసిన మిశ్రమంలో నుండి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో మిగులుస్తుందట. ఇది వేదాలలో చెప్పబడిన హంస. ప్రస్తుతం ఇవి లేవు అంటారు. అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రవాణాశాఖ వారి సరికొత్త బస్సుసర్వీసుకు రాజహంసని పేరు పెట్టారు. ఆదిలోనే హంసపాదు అనే పదాన్ని ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో పత్రికల్లో రాసేస్తున్నారు. వయ్యారి భామ నీహంసనడక అని రచయితలు పాటను కూడా రాశారు. ఇలా హంస ప్రయోగం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. అబ్బో తెగ రాసేస్తున్నారు. ఇంతకూ హంసను చూశారా? చూస్తే ఎలా ఉంటుంది. పాలను, నీళ్లను వేరు చేసిన సందర్భాలున్నాయా? హంసపాదు అని ఎందుకు ప్రయోగించారు. హంస నడక చూశారా? చూసిన వారేవరయినా వివరణ ఇస్తారని ఆసిస్తున్నాను.

21 కామెంట్‌లు:

మైలవరం చెప్పారు...

ur 'HAMSA' interesting. 'AKALI' items also gud. continue

panuganti చెప్పారు...

మైలవరం మీసూచనలకు ధన్య వాదాలు

Surya చెప్పారు...

Rajahamsa is a name given to buses by Karnataka RTC long time ago and the name is still in use.

panuganti చెప్పారు...

కర్నాటక బస్సు పేరు సరే అందులో సర్వే సూచనతో అంగీకరిస్తాను. హంసను చూసారా లేదా

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

ఎక్కడైనా ఒక పదం రాయడం మర్చిపోతే v ఆకారంలో ఒక చిహ్నం పెట్టి పైన ఆ మర్చిపోయిన పదమో వాక్యమో రాస్తాము. ఆ ఆకారం హంస పాదంలా ఉంటుందని దాన్ని హంసపాదు అంటారు. ఇది మొదట్లోనే జరిగితె ఆదిలోనే హంసపాదు అని అంటారు.

panuganti చెప్పారు...

హంసపాదు గురించి చెప్పినందుకు చెప్పుదెబ్బలు- పూల దండల బ్లాగర్‌కు ధన్వవాదాలు. మీరు హంసను చూశారా? లేదా?

రాజేష్ జి చెప్పారు...

@ఫానుగంటి గారు

అన్నట్లు మీరు డైనోసార్ ని చూసారా? మీరు దీనికి స.ధా చెబితే మీ హంస ప్రశ్నకి స.ధా దొరుకుతుంది.

మీ మొదటి నాలుగైదు పేరాలలో "అట" లు ఎక్కువై చదివేటప్పుడు పంటి కింద రాయిల నన్ను హింస పెట్టాయి. మీకు అంతగా ఆ చెప్పిన వాటిమీద నమ్మకం లేకపోతే ఎంచక్కా ఆ నాలుగు మాటలు రాసేసి "నేను నమ్మ" అని పెట్టండి.

ఇహ ఇక్కడ ఒక చూపెయ్యండి http://en.wikipedia.org/wiki/Hamsa_(bird)

$సెప్పుదెబ్బలు గారు..

హ్మ్.. హంసపాదు మీద మీరు చెప్పింది ఏదో కొత్తగా వింటున్నట్లుంది. ఇంకెవరైనా దీన్ని బలపరచగలరా?

panuganti చెప్పారు...

రాజేష్‌ జీ : డైనోసార్‌ ఉన్నట్లు మన శాస్త్ర వేత్తల పరిశోధనలో తేలింది. దాని అవశేషాలు బయటపడ్డాయి. డైనోసార్‌ హస్థిపంజరం తదితరాలు దొరికాయని ధృవీకరించారు. వీటికి సంబంధించిన ఫొటోలను మీడియా ద్వారా చూపారు. ఇంటర్‌నెట్‌లోనూ డైనోసార్‌ గురించి పూర్తి అధారాలున్నాయి. హంసను చూసి పరిశోధనలు జరిపిన ఆధారాలు ఉంటే చెప్పగలరు.

అజ్ఞాత చెప్పారు...

పానుగంటిగారు, డైనోసార్లు ఉన్నాయి అన్నదానికి మీరు చూపించిన ఆధారాలు సరిపోతాయి, కానీ ఎటువంటి చారిత్రాత్మక ఆధారాలు లేవు కాబట్టి అటువంటి హంసలు లేవు అని చెప్పలేము, దానికి ఇంకా సపోర్ట్ కావాలి

Andhraman చెప్పారు...

What about Lufthansa?

panuganti చెప్పారు...

మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు.

panuganti చెప్పారు...

డ్యూయిషె లూఫ్తాన్స ఎజి మూస:IPA-deమూస:FWB అనేది జర్మనీకి చెందిన విమానయాన సంస్థ. మరియు ప్రయాణీకులను చేరే విషయంలో యూరోప్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇది. కంపెనీ యొక్క పేరు లుఫ్ట్ (ఈ జర్మనీ పదానికి గాలి అని అర్థం) మరియు హన్స (హాన్సియాటిక్‌లీగ్‌, మధ్యయుగంలో అతిశక్తివంతమైన వాణిజ్య బృందం)అనే పదాల ద్వారా వచ్చింది.ఈ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులను చేరేవేసే లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఎయిర్‌లైన్స్. జర్మనీలో 18 ప్రాంతాలకు, అంతర్జాతీయంగా ఆఫ్రికా, అమెరికాస్‌, ఆసియా మరియు యూరోప్‌లోని 78 దేశాల్లోని 183 ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. లుఫ్తాన్స తన యొక్క ఇతర భాగస్వాములతో మొత్తం 722 ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా 410 ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది. దీని యొక్క ఇతర సబ్సిడిరీలను కలుపుకుంటే ప్రపంచంలో అతి మూడో అతి పెద్ద ప్యాసింజర్‌ ఎయిర్‌లైన్స్ ఇది.కొలోన్‌లోని డ్యూష్జ్‌లో లుఫ్తాన్స యొక్క ప్రధాన ఆపరేషన్స్ యొక్క కేంద్రం లుఫ్తాన్స ఏవియేషన్‌ సెంటర్‌(ఎల్‌ఏసి) ఉంది. మరియు దీని యొక్క ప్రధాన ట్రాఫిక్‌ హబ్‌ ఫ్రాంక్‌ఫోర్ట్ లోని ఫ్రాంక్‌ఫోర్ట్ విమానాశ్రయంలో ఉంది. రెండో ప్రధాన హబ్‌ మ్యూనిచ్‌ ఏయిర్‌పోర్ట్ ‌లోఉంది. లుఫ్తాన్స యొక్క అధిక శాతం పైలట్లు, గ్రౌండ్‌ స్టాఫ్‌, ఫ్లైట్‌ అటెండర్లు ఫ్రాంక్‌ఫోర్ట్ కేంద్రంగా పనిచేస్తారు. ప్రపంచంలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్ అలయన్స్ అయిన స్టార్‌ అలయన్స్ లో లుఫ్తాన్సకు వ్యవస్థాపక సభ్యత్వం ఉంది. థాయ్‌ ఎయిర్‌వేస్‌, యునైటెడ్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ కెనడా మరియు స్కాండనేవియన్‌ ఎయిర్‌లైన్స్ సిస్టమ్‌ యొక్క కలయికలో 1997లో స్టార్‌ అలయన్స్ ను ప్రారంభించారు. లుఫ్తాన్స గ్రూప్‌ సుమారు 500 ఎయిర్‌క్రాఫ్ట్‌లను, ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలకు చెందిన 1,05,261 మంది ఉద్యోగులున్నారు. 2008లో సుమారు 70.5 మిలియన్ల ప్రయాణికులు లుఫ్తాన్స విమానాల్లో ప్రయాణించారు.( జర్మన్‌ వింగ్స్, బిఎమ్‌ఐ, ఎయుఏ, బ్రస్సెల్స్‌ ఎయిర్‌లైన్స్‌లను ఇందులో చేర్చలేదు).

సుజాత వేల్పూరి చెప్పారు...

హంస అంటే బాతుల్లో ఒక రకమైన జాతేనట! కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైంది. నెట్ లో డైనో సార్ల గురించి ఉన్నట్టే వీటి గురిచి కూడా ఉంది!

అది పాలు నీళ్ళను వేరు చేయడం చూస్తే తప్ప నమ్మలేను. కానీ ఆ శక్తి ఉంటే ఉండొచ్చు! ఎప్పుడైనా బాతు నీళ్లలో ఆహారాన్ని వెదికిపట్టుకునే విధానం గమనించారా! నీళ్లనీ, నాచునీ జాగ్రత్తగా వేరు చేయడానికి బోల్డంత గాలించి గాలించి మరీ పట్టుకుంటుంది. బాతుల గుంపుల్ని వేసుకుని మా పొలానికి ఇద్దరు మనుషులు వచ్చేవాళ్ళు. అప్పుడు గమనించేవాళ్ళం ఇవన్నీ!

హంసల్ని గురించి వినడమే తప్పచూసిన వాళ్ళెవరూ లేరు. పురాణాల్లో తప్ప దాని ప్రసక్తి ఎక్కడా కనిపించదు

panuganti చెప్పారు...

సుజాత గారు మీరు కొంత దగ్గరగా చెప్పారనిపించింది.ధన్యవాదాలు.

panuganti చెప్పారు...

సుజాత గారు మీరు కొంత దగ్గరగా చెప్పారనిపించింది.ధన్యవాదాలు.

రవి చెప్పారు...

swan - అంటే హంస కదా. వీటి ఫోటోలు ఏవో జపాను పత్రికలో చూశాను. హంస పాలను, నీళ్ళను వేరు చేయడం అన్నది - ఒక చమత్కారం మాత్రమే. నిజం కాదు.

Truely చెప్పారు...

మీరు ఫోటో లో చూపిన హంసలను నేను చాల చూసానండి . UK లో చాల వుంటై అవి . మీకు కావలి ఆంటే ఫొటోస్ పంపగలను

Dr.Suryanarayana Vulimiri చెప్పారు...

నిజానికి పాలలో 80-90% నీరు ఉండి అందులో మిగిలిన పోషకపదార్థాలు కలసి విడదీయలేని మిశ్రమంగా వుంటాయి. పాలలో స్వతహాగా ఉన్ననీటినే కాక, నీటితో కల్తీ చేసినా నీటిని పాల నుంచి విడదీయలేరు. పాలు పలచన అయినట్లు తెలుస్తుంది కాని. హంసల విషయంలో అది చమత్కారం కావచ్చు. ఎందుకంటే మనకు సరియైన దాఖలా లేదు గనుక.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మానస సరొవరం లొ ఉండే హంసలు పాలను నీళ్ళను వీరు చేస్తాయని ఎక్కడొ చదివిన గుర్తు.

కంది శంకరయ్య చెప్పారు...

హంసపాదుల గురించి ‘చెప్పుదెబ్బలు...’ గారు చెప్పిన దానిని నేను సమర్థిస్తున్నా... వారి వివరణ సరిగానే ఉంది.

బాలసుబ్రమణ్యం చెప్పారు...

I heard from my elders that there were swans in the Himalayan region in and around manasasarovar.the people living in the cold regions donot know the significance on hamsa's and they used to kill for their food.after some years they were all consumed by the local people.