16, నవంబర్ 2010, మంగళవారం

చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి


మనిషికి క్రమశిక్షణ ఎంత అవసరమో వివరించే సామెత ఇది. విచ్చల విడిగా తిరగడం, హద్దూపద్దూ లేకుండా వ్వవహరించడం , మంచితనం అనిపించుకోదు. ఈ విషయాన్నే ఈసామేత వివరిస్తోంది. ఎవరిదైనా ఒక చేను ఉన్నదంటే దానికి హద్దులను సూచించే విధంగా గట్టు ఉండటం ఎంత అవసరమో మనుషులంతా కలిసి మానవత్వంతో బతకాలనుకున్నపుడు వారు నివసిస్తున్న ఊరికి కొన్న కట్టుబాట్లు ఉండితీరాలి. ఆకట్టుబాట్లను ఆ ఊరిలోని వారంతా సమానంగా ఆచరించాలి. అప్పుడే అన్ని విధాలా సుఖశాంతులు వర్థిల్లుతాయి. చేనుకు వేసిన గట్టు ఆచేను హద్దును సూచించినట్లుగానే ఒక ఊరి ప్రజలు ఏర్పరుచుకున్న కట్టుబాట్లు వారి జీవనశైలిని , మంచితనం వంటి లక్షణాలను ఇతరులు సులభంగా చూసి తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ఒక దేశం కూడా మనుషులు ఎలా ఉండాలనేదానికోసం కొన్ని కట్టుబాట్లను రాజ్యంగ యంత్రం ద్వారా రూపొందించుకున్నాం. అవి పాటించడంలో లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయి. దేశంలో రాజకీయాలు అంటే అసహించుకునేలా మారింది. మనకున్న కట్టుబాట్లు, క్రమశిక్షణ ఎందుకని పాటించడం లేదు. ఎవరు బాధ్యత వహించాలి. గవర్నర్‌ అంటున్నారు. కాగ్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని అందుకు ఎమ్మెల్యేలు మంత్రులు సిద్దంగా ఉన్నారా? ఉంటే ఏ స్థాయిలో చర్చజరుగుతుందో వేచి చూడాలి.

2 కామెంట్‌లు:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

చాలా బాగా రాశారు. వ్యాసం చివరికి రాజకీయాల వైపు రావడం సూపర్ :)

మామూలుగా అయితే కాగ్ నివేదికని, పబ్లిక్ ఎకౌంట్స్ కమీటీ (usually headed by a member from opposition)రివ్యూ చేస్తుంది. కాగ్ నివేదిక అసెంబ్లీలో చర్చించడం మంచిదే. చూద్దాం ఎలా జరుగుతుందో!

panuganti చెప్పారు...

ధన్యవాదాలు నా ఆలోచన చక్కగా అర్థం చేసుకఁన్నారు.
-పానుగంటి