ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సినీనటుడు శివాజీ 2015 మే 3న (ఆదివారం ) గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్ష ప్రారంభించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగా శివాజీ ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే దీక్ష చేస్తున్నానని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఎన్నికల్లో తాను బిజెపి నాయకులతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బిజెపి గెలుపుకు కృషి చేశానని, బిజెపి గెలిస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని ఓటర్లకు చెప్పానని అన్నారు. అయితే నేడు ఎన్నికల అనంతరం బిజెపి ప్రత్యేక హోదా హామీ విషయంలో మాట తప్పిందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు ప్రచారం చేశారని ఆ హామీ నిలబెట్టుకోవటానికి కేంద్రంపై టిడిపి వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. దీక్షలకు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మాలమహానాడు నేత కారెం శివాజీ, లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, గిరిజన విద్యాసంఘాలు, ఎపి బిసి సంక్షేమ సంఘం, ముస్లిమ్ సంఘాల ఐక్య వేదిక, యువజన కాంగ్రెస్ నాయకులు రోహిత్, రజక సంఘాలు, నవతరం పార్టీ, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు వైవి సురేష్, కాపునాడు స్టేట్ ప్రెసిడెంట్ బాబురావు, పలు దళిత, ప్రజాసంఘాలు దీక్షలు మద్దతు తెలిపారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయపార్టీలు, ప్రధానంగా బిజెపి, టిడిపి ధీక్షలోకి వస్తే ప్రత్యేక హోదా రావచ్చని నాఅభిప్రాయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి