సిర్సాలోని డేరా హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటున్న వేలాది మంది గుర్మీత్ బాబా భక్తు లకు అదో వినూత్న ప్రపంచం. ఇక్కడి నుంచే బాబా 150 కార్లతో (కాన్వాయ్) అట్టహాసంగా 25-08-2017న పంచకుల కోర్టుకు వచ్చారు. అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించడంతో కథ అడ్డం తిరిగింది. పర్యవసానంగా హర్యానా, పంజాబ్‌లో ఉవ్వెత్తున హింసాకాండ చెలరేడంతో సిర్సా ప్రధాన కార్యాయం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అధికారు ల ఆదేశాతో 103 డేరా కేంద్రాను సీజ్ చేసిన పోలీసులు బలగాలు తాజాగా డేరా హెడ్ క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించాయి. ఆర్మీని ఇంతవరకూ డేరా ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి అధికాలు అనుమతించలేదు. డేరా కార్యాలయం బయటే బలగాలను మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. 28-08-2017న గుర్మీత్‌కు విధంచబోయే జైలు శిక్ష నేపథ్యంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ఒకవైపు డేరా బాబా అనుచరులను ఆశ్రమం ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆర్మీ రెండ్రోజులుగా నచ్చచెబుతుండగా....లోపలున్న వేలాది మంది బాబా అనుచరగణం మాత్రం కర్రలు, ఇతర ఆయుధాలతో అప్రమత్తంగా ఉన్నట్టు సమాచారం. ఆర్మీ ఆదేశాలను బాబా ‘ప్రైవేట్ సైన్యం’ ధిక్కరిస్తూ ఆశ్రమం లోపల లౌడ్ స్పీకర్ల ద్వారా బాబా అనుచరులకు ధైర్యం నూరిపోస్తున్నాయని తెలుస్తోంది. ఎవరూ బయటకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమాచారం తెలిసినా గుడ్డిగా నమ్మవద్దని లౌడ్ స్పీకర్లలో అనౌన్స్ చేస్తున్నారు.
ఆసక్తికరంగా సిర్సా హెడ్‌క్వార్టర్స్ విషయాలు ఒకొటొక్కటిగా మెలుగు చూస్తున్నాయి. 700 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రధాన కార్యాయం (డేరా హెడ్‌క్వార్టర్స్)లో సక సౌక ర్యాలు ఉన్నాయి. వినోదం కోసం ఓ సినిమా థియేటర్, వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బాబా అనుచరులకు లoచ్, డిన్నర్ వగైరా కోసం ఓ భారీ హోటల్, సిబ్బంది కోసం రెసిడెన్షియల్ క్వార్టర్లు, భక్తులు ఉండేందుకు లెక్కకు మించిన గదులు, ఓ ఫ్యాక్టరీ, విలాసవంతమైన రోడ్లు, రిసార్ట్‌లు, అత్యంత విశాలమైన బాబా మందిరం, ఇలా చెప్పుకుంటూపోతే డేరా బాబా ప్రధాన ఆశ్రమం ఓ వినూత్న ప్రపంచాన్నే తలపిస్తుంది. కాగా, ఆర్మీ ఆదేశాల నేపథ్యంలో రెండ్రోజులుగా బాబా అనుచరులు స్వచ్ఛందంగానే ఆశ్రమం విడిచిపెడుతున్నప్పటికీ ఇప్పటికీ లోపల 30 వేల మందికి పైగా ఉన్నారని అంటున్నారు. అదురూబెదురూ లేకుండా డేరా బాబా అనుచరులు దైనందిన కార్యక్రమాలతో ప్రశాంతంగానే ఉన్నారని ఆశ్రమం విడిచిపెడుతున్న బాబా అనుచరులు చెబుతుండటం విశేషం. కాగా, డేరా బాబా ఆస్తుల వివరాలు తమకు అందజేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలు నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సైన్యం లోపలకు ప్రవేశించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి