నంద్యాల
ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా
మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ
నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ
ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారం
సందర్భంగా వైసీపీనుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు రోజా కౌంటర్
ఇచ్చారు. మహిళలను బాలకృష్ణ అగౌరవ పరుస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్ల
కనిపిస్తే ముద్దులు పెట్టండి, కడుపులు చేయండని అంటారు.. అలాంటి వ్యక్తికి
వైసీపీని విమర్శించే స్థాయి లేదన్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ అమాయకులు అని,
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతారని వ్యాఖ్యానించారు. తల్లిపాలు
తాగి రొమ్ములు గుద్దారని టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన శిల్పా
చక్రపాణినుద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రోజా అంతే ఘాటుగా
స్పందించారు.
తల్లిపాలు
తాగి రొమ్ములు గుద్ది టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి, అఖిల ప్రియ,
అమర్‌నాథ్ రెడ్డిలను పక్కన పెట్టుకొని బాలయ్య డైలాగ్‌లు కొడుతున్నారని రోజా
విమర్శించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి లాక్కున్న ఆ ముగ్గురిని పక్కన
పెట్టుకొని టీడీపీని వదిలిన శిల్పా సోదరులపై కామెంట్ చేయడం ఘోరం అని
వ్యాఖ్యానించారు.
ఇకపోతే
టీడీపీలోకి ఎందుకు వెళ్లారంటే.. చెప్పుకోలేని స్థితిలో భూమానాగిరెడ్డి
కుటుంబం ఉందన్నారు. భూమా నాగిరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబు పక్కన వుండి
తమకు ఓటేయమని అఖిలప్రియ అడగడం బాధాకరమన్నారు. నంద్యాల ఓటర్లు మూడేళ్ల
ప్రజాకంటక పాలనకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఏ శోభక్కనైతే చంద్రబాబు
కష్టాలు పెట్టారో అదే చంద్రబాబు పక్కన నిలబడి అఖిలప్రియ శోభక్క ఫోటో
పెట్టుకొని ఓట్లు అడుగుతోందని వ్యాఖ్యానించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి