6, అక్టోబర్ 2010, బుధవారం

ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్‌

 

  • యువకుని ఆత్మహత్య
  • అనాథలైన భార్యాబిడ్డలు
వారం వారం చెల్లించాల్సిన మైక్రో ఫైనాన్స్‌ అప్పు ఓ యువకుడి ప్రాణం తీసింది. అప్పుతీర్చే మార్గం లేక, తోటి వారి సూటిపోటి మాటలతో తీవ్ర మానసిక వేదనకు గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌ పంచాయతీ పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో నర్సాగౌడ్‌ (30) బలవంతంగా ప్రాణం తీసుకునానడు. భార్య లకీë నర్సమ్మ కథనం ప్రకారం... ఏడాది క్రితం వరకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండ లానికి వలసెళ్లి జీవనం సాగించారు. ఈ మధ్యే గ్రామానికి వచ్చాక కుటుంబ పోషణ కోసం వారం వారంచెల్లించే విధంగా మైక్రో ఫైనాన్స్‌ ద్వారా అప్పులు చేశారు. వీరు వలసెళ్లడంతో అధికారులు వీరికి రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్‌కార్డు లేక చిరునామా తెలిపేందుకు ఎలాంటి ఆధారం లేక గ్రామంలోని ఇతరుల పేరు మీద మైక్రోఫైనాన్స్‌ ద్వారా అప్పులు చేశారు. దీంతో పాటు ఇతర ప్రైవేటు అప్పులు కూడా ఉన్నాయి. మొత్తంగా లక్ష వరకు అప్పులున్నాయి. వాటిని తీర్చే మార్గంలేక ఇటు కుటుంబం పూటగడవక, మైక్రో ఫైనాన్స్‌ వారి ఒత్తిడి ఎక్కువవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కూలీ పని చేసి తెచ్చిన డబ్బులు కుటుంబ పోషణకే సరిపోయేవి కావు.

ఇక వారం వారం చెల్లించాల్సిన అప్పులు ఎలా చెల్లించాలిని పలు మార్లు తన భర్త నర్సాగౌడ్‌ చెబుతూ ఏడ్చేవాడని ఆమె రోదిస్తూ తెలిపారు. రెండు రోజుల క్రితం పిల్లలతో పాటు తాను పుట్టింటికి వెళ్లానని ఈలోగా ఇంత దారుణం జరిగిపోయిందని ఆమె భోరున విలపించారు. తల్లి నిద్రలో ఉండగా నర్సాగౌడ్‌ ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. ఆయన మరణంతో భార్యాబిడ్డలు అనాథలయ్యారు.

కామెంట్‌లు లేవు: