హబూబ్‌నగర్ జిల్లా పాలమూరు పేరుతోనూ ప్రసిద్ధి. నిజాం నవాబ్ నీరుమహబూబ్‌అలీఖాన్ పేరిట మహబూబ్‌నగర్ జిల్లాగా ఆవిర్భవించింది. మొదట జిల్లా కేంద్రంగా నాగర్‌కర్నూల్ ఉండేది. తర్వాతి కాలంలో మహబూబ్‌నగర్ కేంద్రంగా పరిపాలన సాగుతోంది. ఉత్తరాన రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు, తూర్పున నల్గొండ, గుంటూరు జిల్లాలు, దక్షిణాన కృష్ణా, తుంగభద్ర నదులూ, పడమరన రాయచూరు, గుల్భర్గ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 18 వేల 432 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద జిల్లా. మైదాన ప్రాంతంతో పాటు కొండలూ, అడవులూ, నదులూ, వాగులూ, వంకలూ, ప్రసిద్ధి గాంచిన దర్శనీయ క్షేత్రాలూ జిల్లా అందాలను ఇనుమడింపజేస్తున్నాయి. నల్లమల అడవులు జిల్లాకు అదనపు ఆకర్షణ. కృష్ణా, తుంభద్ర నదులు ఈ జిల్లా నుండి ప్రవహిస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గం తంగిడి గ్రామం వద్ద కృష్ణానది జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. మక్తల్, గద్వాల, ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్, అలంపూర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో ప్రవహిస్తోంది. దాదాపు 300 కిలో మీటర్ల మేర ఈ నది పారుతోంది. తుంగభద్ర నది గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో ప్రవహిస్తోంది. కృష్ణానది ఉప నది అయిన డిండి కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో ప్రవహిస్తూ తిరిగి కృష్ణానదిలో కలుస్తోంది. పెద్దవాగు, చిన్నవాగులూ కృష్ణానదికి ఉప నదులుగా ఉన్నాయి. జిల్లాలో వరి, జొన్న, సజ్జ, రాగులు ప్రధాన ఆహార ధాన్యాలుగా ఉన్నాయి. వేరుశనగ, ఆముదం, మిరప, పొగాకు వాణిజ్య పంటలుగా ఉన్నాయి. అనేక ఖనిజ సంపదలు జిల్లాలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖనిజ సంపదలో దేశంలో రెండో స్థానంలో ఉంది. అదే ప్రాధాన్యత క్రమంలో మహబూబ్‌నగర్‌లోనూ రాష్ట్రంలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయి. పారిశ్రామిక ఖనిజ సంపదకూ కొదవ లేదు. వజ్రాలు, బంగారం, ఆస్‌బెస్టాస్, బంకమట్టి, క్వాడ్జ్, పల్డ్స్‌పర్, లయన్‌స్టోన్స్ తదితరాలు లభిస్తాయి. పూర్తి స్థాయిలో ఈ ఖనిజ సంపదను వినియోగించుకునే శాస్త్ర విజ్ఞానం జిల్లా పరిధిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. జిల్లాలో 1,544 నివాస ప్రాంతాలు ఉండగా 1.475 నివాస ప్రాంతాలు విద్యుత్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. ఏడో నంబర్ జాతీయ రహదారి ప్రధాన రవాణా మార్గం. నాగాపూర్, బెంగుళూరు వంటి ముఖ్య పట్టణాలను ఈ రహదారి కలుపుతోంది. హైదరాబాద్, గుంతకల్, హుగ్లీ, తిరుపతి లాంటి ముఖ్య పట్టణాలను కలిపే బ్రాడ్‌గేజ్ రైల్వే సౌకర్యం ఉంది. నారాయణపేట, కొత్తకోట, గద్వాల పట్టణాలు చేనేత వస్త్రాలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధిగాంచాయి. జిల్లా ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతోంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొత్తూరు పట్టణాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 126 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. 25 వేల మంది కార్మికులు పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. జడ్చర్ల మండలం పోలెపల్లి ప్రత్యేక ఆర్థిక మండలితో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
జిల్లా సంఖ్యా వివరాలు
భౌగోళిక విస్తీర్ణం - 18,432 చ.కి.
రెవెన్యూ మండలాలు - 64
గ్రామాలు - 1,544
గ్రామ పంచాయతీలు - 1,346
జనాభా - 35,09,182
పురుషులు - 17,81,667
స్త్రీలు - 17,27,515
అక్షరాస్యులు - 13,57,063
పురుషులు - 8,75,077
స్త్రీలు - 4,81,986
సాధారణ సగట వర్షపాతం-942.60మి.మీ
సాగు భూమి - 22,53,142 ఎకరాలు
పశువులు - 7,36,996
గేదెలు - 3,69,849
గొర్రెలు - 33,67,635
మేకలు - 5,07,856
కోళ్లు - 42,63,569
భూమి కలిగిన వారు - 6,56,062
దళితులు - లక్షా 5,791
గిరిజనులు - 52 వేలా 63
అటవీ విస్తీర్ణం - 6,58,265 ఎకరాలు
ప్రధాన ఆస్పత్రులు - 1
తాలుకా ఆస్పత్రులు - 18
కుష్టువ్యాధి నివారణా కేంద్రాలు - 6
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 84
ఆరోగ్య ఉప కేంద్రాలు - 539
క్షయ నివారణా కేంద్రాల - 7
వైద్యులు - 150
సంచార వైద్య వాహనాలు - 1
ఆయుర్వేద వైద్యశాలలు - 43
యునానీ వైద్యశాలలు - 20
హోమియోపతి వైద్యశాలలు - 9
వాణిజ్య బ్యాంకులు - 130
సహకార బ్యాంకులు - 19
గ్రామీణ బ్యాంకులు - 72
భారీ, మధ్య తరహా పరిశ్రమలు - 60
చిన్నతరహా పరిశ్రమలు - 3,308
పోలీస్ స్టేషన్లు - 75
ఆర్టీసీ డిపోలు - 8
సాగునీటి ప్రాజెక్టులు - 2
ఎత్తిపోతల ప్రాజెక్టులు - 4
మేజర్ చెరువులు - 674
మైనర్ చెరువులు - 5,376
చిన్నతరహా ఎత్తిపోతలు - 40
హైడల్ ప్రాజెక్టులు - 1
రెవెన్యూ మండలాలు - 64
గ్రామాలు - 1,544
గ్రామ పంచాయతీలు - 1,346
జనాభా - 35,09,182
పురుషులు - 17,81,667
స్త్రీలు - 17,27,515
అక్షరాస్యులు - 13,57,063
పురుషులు - 8,75,077
స్త్రీలు - 4,81,986
సాధారణ సగట వర్షపాతం-942.60మి.మీ
సాగు భూమి - 22,53,142 ఎకరాలు
పశువులు - 7,36,996
గేదెలు - 3,69,849
గొర్రెలు - 33,67,635
మేకలు - 5,07,856
కోళ్లు - 42,63,569
భూమి కలిగిన వారు - 6,56,062
దళితులు - లక్షా 5,791
గిరిజనులు - 52 వేలా 63
అటవీ విస్తీర్ణం - 6,58,265 ఎకరాలు
ప్రధాన ఆస్పత్రులు - 1
తాలుకా ఆస్పత్రులు - 18
కుష్టువ్యాధి నివారణా కేంద్రాలు - 6
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 84
ఆరోగ్య ఉప కేంద్రాలు - 539
క్షయ నివారణా కేంద్రాల - 7
వైద్యులు - 150
సంచార వైద్య వాహనాలు - 1
ఆయుర్వేద వైద్యశాలలు - 43
యునానీ వైద్యశాలలు - 20
హోమియోపతి వైద్యశాలలు - 9
వాణిజ్య బ్యాంకులు - 130
సహకార బ్యాంకులు - 19
గ్రామీణ బ్యాంకులు - 72
భారీ, మధ్య తరహా పరిశ్రమలు - 60
చిన్నతరహా పరిశ్రమలు - 3,308
పోలీస్ స్టేషన్లు - 75
ఆర్టీసీ డిపోలు - 8
సాగునీటి ప్రాజెక్టులు - 2
ఎత్తిపోతల ప్రాజెక్టులు - 4
మేజర్ చెరువులు - 674
మైనర్ చెరువులు - 5,376
చిన్నతరహా ఎత్తిపోతలు - 40
హైడల్ ప్రాజెక్టులు - 1
మండలాలు
1. కోడంగల్, 2. బొంరాస్‌పేట 3. కోస్గీ 4. దౌల్తాబాద్ 5. దామరగిద్ద 6. మద్దూరు 7. కోయిల్‌కండ 8. ధన్వాడ 9. నవాబ్‌పేట 10. బాలానగర్ 11. కొందుర్గు 12. ఫరుఖ్‌నగర్ 13. కొత్తూరు 14. కేశంపేట 15. తలకొండపల్లి 16. ఆమనగల్ 17. మాడ్గుల 18. వంగూరు 19. వెల్దండ 20. కల్వకుర్తి 21. మిడ్జిల్ 22. తిమ్మాజిపేట 23. జడ్చర్ల 24. భూత్పూర్ 25. మహబూబ్‌నగర్ 26. అడ్డాకుల 27. దేవరకద్ర 28. ధన్వాడ
29. నారాయణపేట 30. ఊట్కూర్ 31. మాగనూరు 32. మక్తల్ 33. నర్వ 34. చిన్నచింతకుంట 35. ఆత్మకూరు 36. కొత్తకోట 37. పెద్దమందడి 38. ఖిల్లఘనపూర్ 39. బిజినేపల్లి 40. నాగర్‌కర్నూల్ 41. తాడూరు 42. తెలకపల్లి 43. ఉప్పునుంతల 44. అచ్చంపేట 45. అమ్రాబాద్ 46. బల్మూరు 47. లింగాల 48. పెద్దకొత్తపల్లి 49. కోడేరు 50. గోపాల్‌పేట 51. వనపర్తి 52. పాన్‌గల్ 53. పెబ్బేరు 54. గద్వాల్
55. ధరూర్ 56. మల్దకల్ 57. గట్టు 58. అయిజ 59. వడ్డెపల్లి 60. ఇటిక్యాల 61. మానవపాడు 62. అలంపూర్ 63. వీపనగండ్ల 64. కొల్లాపూర్
29. నారాయణపేట 30. ఊట్కూర్ 31. మాగనూరు 32. మక్తల్ 33. నర్వ 34. చిన్నచింతకుంట 35. ఆత్మకూరు 36. కొత్తకోట 37. పెద్దమందడి 38. ఖిల్లఘనపూర్ 39. బిజినేపల్లి 40. నాగర్‌కర్నూల్ 41. తాడూరు 42. తెలకపల్లి 43. ఉప్పునుంతల 44. అచ్చంపేట 45. అమ్రాబాద్ 46. బల్మూరు 47. లింగాల 48. పెద్దకొత్తపల్లి 49. కోడేరు 50. గోపాల్‌పేట 51. వనపర్తి 52. పాన్‌గల్ 53. పెబ్బేరు 54. గద్వాల్
55. ధరూర్ 56. మల్దకల్ 57. గట్టు 58. అయిజ 59. వడ్డెపల్లి 60. ఇటిక్యాల 61. మానవపాడు 62. అలంపూర్ 63. వీపనగండ్ల 64. కొల్లాపూర్
అసెంబ్లీ నియోజకవర్గాలు
1. కొడంగల్ 2. షాద్‌నగర్ 3. కల్వకుర్తి 4. జడ్చర్ల 5. మహబూబ్‌నగర్ 6. దేవకరద్ర 7. నారాయణపేట 8. నాగర్‌కర్నూల్ 9. అచ్చంపేట
10. వనపర్తి 11. గద్వాల 12. అలంపూర్ 13. కొల్లాపూర్ 14. మక్తల్
10. వనపర్తి 11. గద్వాల 12. అలంపూర్ 13. కొల్లాపూర్ 14. మక్తల్
రెవెన్యూ డివిజన్ కేంద్రాలు
1. మహబూబ్‌నగర్ 2. నారాయణపేట 3. గద్వాల 4. నాగర్‌కర్నూల్ 5. వనపర్తి
మున్సిపాల్టీలు
1. మహబూబ్‌నగర్ 2. వనపర్తి 3. గద్వాల 4. నారాయణపేట
1 కామెంట్:
ఇలా ఎవరికి వారయినా అన్ని జిల్లాల సమాచారాన్ని బ్లాగుల్లొ గుదిగుచ్చాలని నా కొరిక మీకు అభినందనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి