ఈ విగ్రహం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిళం లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఎంట్రన్స్‌లో ఉంది. అక్టోబరు 28న మా కార్యాలయ సిబ్బంది సమావేశం అక్కడ జరిగింది. నాకు ఫొటోలు తీయడం హాబీ కాబట్టి కంటికి నచ్చిన ఈ విగ్రహం నాతో ఉన్న చిన్నకెమెరాకు బాగా వస్తుందో లేదో అనుకున్నా. పరవా లేదు కదా. ఇక్కడ ఈ దేవాలయంతో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సి నుంచి వచ్చే చిన్నపాటి కోన కూడా ఉంది. చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. ఏదెమయినా ఇక్కడ సమావేశం పెట్టటం వల్ల ఈ ప్రదేశాన్ని చూడగలిగాను. అవును ఈ విగ్రహాన్ని చూస్తే భాగవతంలోని దశావతార కథ గుర్తుకు వస్తుంది. ఈ విగ్రహాన్నిశిల్పి కళ్లకు కట్టినట్లుగా తయారు చేశాడు. ఆయనకు నాజోహార్లు.
ఈ కథగురించి కొంత ..........
హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై పగదీర్చుకునే ధ్యేయంతో హిరణ్యకశిపుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. చతుర్ముకుడు ప్రసన్నుడై వరాలు కోరుకోమన్నాడు. నరుల చేత , దేవత చేత, జంతువుల చేత ఆయుధాల చేత పగలు గాని , రాత్రి గాని భూమి మీదగాని, ఆకాశంలో గాని నీటిలో గాని తనకు చావులేకుండా వరాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. తదాస్తు అన్నాడు పరమపిత. వరబల గర్వంతో దురహంకారియై అకృత్యాలు ప్రారంభించాడు హిరణ్య కశిపుడు. ఇతని పుత్రుడు ప్రహ్లాదుడు బాల్యంనుండే హరిభక్తితె నిరంతరం హరినామ చింతనతో కాలం గడిపేవాడు ప్రహ్లాదుని చేత హరినామ స్మరణం మాన్పించాలని ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తాడు. అనేక విధాలుగా హింసించి విఫలుడైన హిరణ్యకశిపుడు తనకు హరిని చూపమని కొడుకును బాధిస్తాడు. ప్రహ్లాదుడు...
ఇందుగల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదికి చూచిన
నందందు గలడు దానవాగ్రణి! వింటే.
అంటూ సమాధానమిస్తాడు. శ్రీహరి లేని చోటు లేదన్నాడు ప్రహ్లాదుడు. అయితే స్థంభములో హరిని చూప మంటూ భవన స్థంభాన్ని క్రోదంతో పగులగొట్టాడు హిరణ్య కశిపుడు. అందులోనుంచి శ్రీహరి నృసింహ రూపంలో ప్రత్యక్షపై హిరణ్యకశిపుని ఉదయ సంధ్యల కాలంలో కాకుండా అసుర సంధ్యాకాలంలో, నేలమీదా ఆకాశంలో కాకుండా తన తొడలపైన , ఆయుధం కానటువంటి తన చేతి వేళ్ల గోళ్లతో చీల్చి సంహరించాడట. ఇది భాగవతంలోని నాలుగో అవతార కథలోని సారాంశం.

3 కామెంట్‌లు:
Very nice and comments also very good
చంద్రయ్యసార్,
చూడచక్కఁ విగ్రహం శీర్షిక మీద అనంతపురం జిల్లాలోఁ ఉరవకొండ మండలం పెన్నోబిలం దేవాలయ ప్రాంతంపై మీరు రాసిన ఈ స్టోరీ బాగుంది. కానీ దీఁ ఉద్దేశ్యం భక్త పహ్లాదుడు గురించి చెప్పేలా ఉంది. అనంతపురం జిల్లాలో ఉన్న ప్రకృతి అందాలను వివరించేలా లేదన్నది నా అభిప్రాయం. కరువు జిల్లా అనగానే కఁ్పంచేది ఎడారుల దిబ్బలు అఁ కొందరు అనుకఁంటారు. కానీ అనంతపురంలో ఇలాంటి ప్రకృతి అందాలు ఉన్నాయన్నది వివరిస్తూ, ఇలాంటి ప్రదేశాఁ్న ఇతర ప్రాంతాల వారు కూడా సందర్శించాలఁ అనుకఁనేలా వివరించాల్సింది. కేవలం భాగవతం అవతారాల గురించి చెప్పడం నాకఁ నచ్చలేదు.
సార్ మాది ప్రక్కన ఉన్న కూడేరు మండలం కమ్మూరు స్వగ్రామం , అక్కడ స్వామి వారు వేటకి వెళ్ళినప్పుడు, స్వామి వారి పాదలు కూడ ఉనాయి. ఆ ఫోటొ ఉంటె పెట్టండి.
వాటినే బగిర గుండ్లు అని ఈ ప్రాంతం లో అంటారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి