'' గుండ్రంగా ఉంటాను భూమిని కాను.
నల్లగా ఉంటాను బొగ్గును కాను,
మాట్లాడుతాను కాని మనిషిని కాను.''
నల్లగా ఉంటాను బొగ్గును కాను,
మాట్లాడుతాను కాని మనిషిని కాను.''
పొడుపు కథలు, సామెతలు దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఆవిర్భవిస్తాయి. సమాజంలో కనిపించే మార్పులన్నీ వీటిలో తొంగిచూస్తుంటాయి. ఈ పొడుపుకథ కూడా సమాజంలో ఒకప్పుడు సాంకేతిక విప్లవం అనుకున్నదాన్ని ప్రతిబింబిస్తూ ఆవిర్భవించింది. భూమిలాగా గుండ్రంగా ఉన్నాడట, బొగ్గులాగా నల్లగాను ఉన్నాడట, ఇంకా ముందుకెళితే మాటలు కూడా మాట్లాడుతాడట. ఎవరావ్యక్తి అని బుర్రకు పదునుపెడితే గ్రామ్‌ఫోన్ రికార్డ్ కళ్లెదుట ప్రత్యక్షమై నేను విడుపుని అంటుంది. గ్రామ్‌ఫోన్ రికార్డ్ ప్లేట్ '' గుండ్రంగా ఉంటుంది. అయినా అది భూమి కాదు. నల్లగానూ ఉంటుంది అయినా అది బొగ్గూకాదు. దాన్నుంచి మాటలు వినిపిస్తాయి అయినా అది మనిషి కాదు.'' ఈ సమాధానాలన్ని కలిసి ఈ పొడుపుకథకు విడిపు గ్రామ్‌ఫోన్ రాకార్డ్ అని సూచిస్తున్నాయి.
పొడుపు కథ అలా ఉంటే దానిని మొదట థామస్ అల్వా ఎడిసన్ 1877లో కనుగొన్నారట. ఆతరువాత 1887లో మరో అమెరికన్ శాస్త్రవేత్త ఎమైల్ బెర్లినర్ పూర్తిస్థాయిలో గ్రామ్‌ఫోన్ రికార్డన్‌ను తయారు చేశారట. ఆతరువాత చాలా మార్పులు చెందింది. గ్రామ్‌ఫోన్ రికార్డర్ ఇప్పుడు కనబడదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి