26, నవంబర్ 2010, శుక్రవారం

ఆయనను ఇప్పుడెందుకు ముఖ్యమంత్రిని చేశారు?

వైఎస్‌ జగన్‌ శిబిరాన్ని దెబ్బతీయడానికా....బీహార్‌ ఎన్నికల ఫలితాలను చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై, కాంగ్రెస్‌ కార్యకర్తలపై పార్టీ ఓటమి ప్రభావం పడకూడదనా?. లేక బీహార్‌ ఎన్నికల్లో తెగతిరిగినా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీల చరిస్మా లేదని తేలిపోతుందనా? కాంగ్రెస్‌ పార్టీ ముఠా తగాదాల నుంచి బయట పడటానికా ఎందుకు రోశయ్యను రాజీనామా చేయించారు. రోశయ్య చెప్పిన వయోభారం నిజమా?. ఏది నిజమని అనుకుంటున్నారు. పైవన్నీ కూడా నిజమేనా? ఇన్ని సమస్యల మధ్య ఉన్న కాంగ్రెస్‌పార్టీని కిరణ్‌కుమార్‌ రెడ్డి గట్టెక్కించగలడా? అన్నింటినీ మించి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని 2014 వరకూ ఆపగలగుతారా?. ప్రజలు వివిధ సమస్యల్లో ఉన్నారు. అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. వాటినెలా దారిలో పెడుతారు. ముఖ్యమంత్రి మారినా కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం సమసిపోలేదు. ఆ మంట రగులుతూనే ఉంది. అది చల్లారే ఆనవాళ్లు ఇప్పట్లో కనిపించడంలేదు. సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసినా ఆయనకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పలేదు. బెంగుళూరు నుండి హైదరాబాద్‌ వచ్చినా మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు అభినందించినా ఆయన మాటమాత్రంగానైనా స్పందించలేదు. రాష్ట్రాభివృద్ధికి అందరినీ కలుపుకుపోతానని మీడియా ద్వారా ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా జగన్‌ విషయంలో దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రులను మార్చినా తన ఎజెండాలో మార్పులేదని, ఓదార్పుయాత్ర కొనసాగిస్తానని అధిష్టానానికి, ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్టానం బాటలోనే నడవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించుకున్నారని, దీంతో రానున్నకాలంలో ఇద్దరి మధ్యా వైరం మొదలవుతుందని తెలుస్తోంది. అటు అధిష్టానంతోనూ, ముఖ్యమంత్రితోనూ సమరానికే జగన్‌ సిద్ధమైనట్లు శుక్రవారం నాటి సమావేశం కూడా అదే చెబుతుంది. బాలినేని, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, కొండా సురేఖ. వైఎస్‌ వివేకాంనదారెడ్డిలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని, జేసీ దివాకర్‌రెడ్డి, డిఎల్‌ రవీంద్రారెడ్డిలను దూరంగా ఉంచాలని అధిష్టానాన్ని కోరినా తిరస్కరించినట్లు తెలిసింది. 'ప్రభుత్వంలోనూ, మంత్రివర్గం ఏర్పాటులోనూ నేను జోక్యం చేసుకోబోను. ఎవరైనా మంత్రివర్గంలో చేరాలనుకుంటే చేరవచ్చు. సొంతంగా లాబీయింగ్‌లు చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని జగన్‌ చెప్పారని అనుకుంటున్నారు. అదే తరహాలో వైఎస్‌ వివేకానందరెడ్డి మంత్రి పదవికోసం ఢిల్లీలో పైరవీలు మొదలు పెట్టారు. ఒక వేల వివేకానందరెడ్డికి మంత్రి పదవి వస్తే జగన్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.. క్రమంగా అప్పుడు జగన్‌ ఒంటరి కావచ్చేమో. అదేవిధంగా రాయలసీమలో చిత్తూరు చిల్లాలో ముఖ్యమంత్రి ఆయన అనుచరులు జగన్‌ వ్యవహారాలకు అడ్డం తగులుతారు. కడపలో డిఎల్‌ రవీంధ్రారెడ్డి మరికొందరు వ్యతిరేకులున్నారు. అనంతపురంలో జెసిదివాకర్‌రెడ్డి ముఠా అడ్డుతగులుతుంది. రఘువీరారెడ్డికి మంత్రి పదవి ఇస్తే జనగ్‌వైపు చూసే అవకాశం లేదు. కర్నూలులో కోట్ల ముఠా మరి కొందరు సీనియర్లు జగన్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. తెలంగాణలో పెద్దగా జనాధరణ ఉన్న వారెవరూ జగన్‌వెంటరారు. ఆంధ్రలో కొందరున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి మేనేజ్‌ చేస్తారు. మొత్తంగా జగన్‌కు పెద్దగా మద్దతు ఇచ్చే ప్రాంతం లేదని చెప్పవచ్చు. ఏదేమైనా తండ్రికి ఉన్న పలుకుబడితో కాంగ్రెస్‌కు కొంత దెబ్బతీసే ప్రయత్నం చేయవచ్చేమో అని కొంత చర్చ జరుగుతుంది. కిరణ్‌మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాక ముఠాతగాదాలు ఏమయినా సమిసిపోయే అవకాశం ఉందా...చూద్ధాం..ఏం జరుగుతుందో?!.......

4 కామెంట్‌లు:

పండు చెప్పారు...

మీరన్నట్లు అన్ని ఏరియాల్లో strategic గా జగన్ ని దెబ్బతియ్యొచ్చు. అధికారంలోకి తేవడం చేతకాని ’అధిష్టానానికి’ అత్యద్భుత ప్రావీణ్యం వున్నధి యిలాంటి విషయాల్లోనే కదా. ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే, congress as we know it, will be finished in Andhra Pradesh just like Bihar.
I am hoping and wishing to see it happen.

రాజాబాబు చెప్పారు...

మీరు చెప్పిందంతా రైటే... కానీ ‘గాంధీ’ల ఛరిష్మాకు కాలం చెల్లింది. ఆ విషయం బీహార్ రుజువు చేసింది. గత ఎన్నికలలో 9సీట్లు వుంటే ఈ ఎన్నికలలో కేవలం 4 సీట్లు మాత్రమే అక్కడి కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. మహామహులంతా అక్కడికి వెళ్ళారు. పిల్లగాంధీ తెగతిరిగేశాడు. చివరకు మిగిలింది నాలుగు. వీళ్ళ పరపతి ఒక్క ఆంధ్రాలోనే పనిచేస్తదా? అదే తేలాల్సివుంది. దక్షిణాదిలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ వుందో ఒక్కసారి లెక్కేయండి. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందని వీళ్ళ పోరు తీర్చడానికి చంద్రబాబు రెడీగా వున్నాడు. వాళ్ళ గొడవలు వాళ్ళకున్నాయనుకోండి. అది వేరే విషయం. ఏదో వైఎస్ పుణ్యమాంటూ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు గానీ... ఒక్కసారి కేరళ దగ్గర నుంచిచూడండి... కేరళ, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా... వీటిల్లో ఆంధ్రప్రదేశ్ కూడా చేరితే- పిల్లగాంధీ జీవితంలో ప్రధాని కాలేడు. తెల్లగాంధీ మంత్రాంగమూ పనిచేయదు. ఈసారి ఎన్నికలు చూడండి ఎంత రసవత్తరంగా వుంటాయో...

astrojoyd చెప్పారు...

చ్చచ్చు-పుచ్చు రాజకీయాలకు కాంగీ పెట్టింది పేరు గదా?

Unknown చెప్పారు...

జగన్ గెలుస్తాడో లెదో గానీ...కాంగ్రెస్సు నాశనమవ్వాలి....ఇదే నా కోరిక...