1, డిసెంబర్ 2010, బుధవారం

కిరణ్‌ మంత్రివర్గంలో కొరవడిన సామాజిక న్యాయం

రాష్ట్ర మంత్రి వర్గంలో గతంలో మాదిరిగానే కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ సామాజిక న్యాయం కొరవడింది. మొత్తం 39 మందిలో అగ్రభాగానా అగ్రవర్ణాల వారున్నారు. మంత్రి వర్గంలో కులాల పొందిక చూస్తే రెడ్డి కులస్తులకు 13, బిసిలకు 11, ఎస్సీలకు ఆరు, కాపు మూడు, వెలమ ఒకటి, కమ్మ ఒకటి, వైశ్య ఒకటి, బ్రాహ్మణ ఒకటి, ఎస్‌టి ఒకటి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణాకు 16 మందికి, కోస్తాకు 15, రాయలసీమకు ఎనిమిది మంది చొప్పున అవకాశం కల్పించారు.
ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి 39 మంది మంత్రుల జాబితాను బుధవారం ఉదయం గవర్నర్‌కు పంపారు. సిఎం కార్యాలయ కార్యదర్శి జవహర్‌ రెడ్డి మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. కాబోయే మంత్రులకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. మంత్రివర్గంలో 11 మంది కొత్తవారికి చోటు దక్కింది. ఐదుగురు తాజా మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు.
రాజ్‌భవన్‌లో 39 మంది ప్రమాణస్వీకారం చేశారు. ముగ్గురు ఆంగ్లంలో ప్రమాణం చేయగా మిగతా వారు తెలుగులోనే చేశారు. ఎక్కువమంది దేవుని సాక్షిగా ప్రమాణం చేయగా , మనస్సాక్షిగా అని కొందరు ప్రమాణం చేశారు. దైవసమానులయిన తల్లిదండ్రుల సాక్షిగా అని అనంతపురం జిల్లాకు చెందిన ఎన్‌.రఘువీరారెడ్డి ప్రమాణం చేశారు.
భారత రాజ్యాంగంలోని శాసనాలను అనుగుణంగా , భయం , పక్షపాతం లేకుండా రాగధ్వేశాలకు అతీతంగా ప్రజలకు తనకర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని, అవసరమైన మేరకు తప్ప ప్రభుత్వ రహస్యాలను ఇతరులకు చెప్పనని మంత్రులందరూ ప్రమాణ పత్రాలను చదివారు. ఆవిధంగా గతంలో పని చేసిన మంత్రులందరూ ప్రమాణం చేశారు. కాని పద్దతులను తప్పారు. అడ్డగోలుగా సంపాదించారు. భవిష్యత్తులో నయినా చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేస్తారని ఆశిద్దాం.
జిల్లాల వారిగా మంత్రుల వివరాలు..
1. మెదక్‌: సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహ
2. హైదరబాద్‌: ముఖేష్‌ గౌడ్‌, దానం నాగేందర్‌, శంకర్రావు
3. మహబూబ్‌నగర్‌: జూపల్లి కృష్ణారావు, డికె అరుణ
4. నల్గొండ: జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
5. రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి
6. ఖమ్మం: రాంరెడ్డి వెంకటరెడ్డి
7. గుంటూరు: కన్నా లకిëనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ కాసు వెంకటకృష్ణారెడ్డి
8. వరంగల్‌: బసవరాజుసారయ్య, పొన్నాల లక్ష్మయ్య
9. నిజామాబాద్‌ : సుదర్శన్‌ రెడ్డి
10. కరీంనగర్‌: డి. శ్రీధర్‌ బాబు
11. అనంతపురం : రఘువీరారెడ్డి, శైలజానాథ్‌
12. నెల్లూరు: ఆనం రామనారాయణరెడ్డి
13. కృష్ణా: కె.పార్థసారథి
14. విశాఖ: పసుపులేటి బాలరాజు
15. ప్రకాశం: మానుగుంట మహీధర్‌ రెడ్డి
16. పశ్చిమగోదావరి: పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్‌
17. శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శుత్రుచర్ల విజయరామరాజు
18. కడప: వైఎస్‌ వివేకానందరెడ్డి, డిఎల్‌ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా
19. తూర్పుగోదావరి: పి. విశ్వరూప్‌, తోటనర్సింహ
20. కర్నూలు: టిజి వెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డి
21. చిత్తూరు: గల్లా అరుణకుమారి
22. విజయనగరం: బొత్సనారాయణ
మనరాష్ట్రంలోని 23 జిల్లాలకు గాను ఒక్క ఆదిలాబాద్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

>>భవిష్యత్తులో నయినా చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేస్తారని ఆశిద్దాం. <<


LOL :)

voleti చెప్పారు...

BC = 11, SC=6
Then what is your problem? you want total ministers belonging to SC/ST/BC only
Then you will be happy,OK

panuganti చెప్పారు...

జనాభా ప్రాతిపదికన ఉండాలనేది నాఅభిప్రాయం. జనాభాలో 85 శాతంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సగానికి తక్కువగా పదవులు దక్కాయి. 15 శాత ఉన్న అగ్రవర్ణాలు అంటే ఓసిలకు సగానికి పైగా దక్కాయి. అని నా వాదన. మొత్తం ఎస్సీలకు ఇవ్వాలని, లేదా బిసిలకు ఇవ్వాలని కాదు.

అజ్ఞాత చెప్పారు...

ప్రజాస్వామికంగా మనం ఇంకా చాలా ఎదగాలి. కులం కాదు, సేవాభావం, సమర్థత మంత్రిపదవులకు యోగ్యత అవ్వాలి. ఇవి లేనివారు ఏ కులస్థులైనా ఒఱిగేదేం ఉండదు. ఇవి ఉన్నవారు ఏ కులస్థులైనా మనందఱికీ మేలు జఱుగుతుంది.

panuganti చెప్పారు...

విద్యావంతులు, సమర్థులు అన్ని కులాల్లోనూ ప్రస్తుతం ఉన్నారు. అర్హతలంటే కేవలం ధనబలం మాత్రమే కాకూడదు. మన దేశానికి అతిపెద్ద, అత్యంత ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు ఉంది. ఆగుర్తింపును, పేరును నిలబెట్టాలి.