ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరం గణేష్‌నగర్‌కు చెందిన రంజిత్‌కుమార్ శనివారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వారంతపుసెలవు కావడంతో భార్యాభర్తలిద్దరూ విందుకు వెళ్లి భోజనం చేశారు. ఇంటికి వచ్చాక రంజిత్‌కుమార్ కోమాలోకి వెళ్లాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం సుల్తానాపురం గ్రామానికి చెందిన సూరిబాబు కుమారుడు రంజిత్‌కుమార్ ఆరేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సుల్తానాపురం తుంగభద్ర నదికి కర్నూలు జిల్లా వైపు ఉండడంతో వారు చాలాకాలంగా కర్నూలు నగరం గణేష్ నగర్‌లో నివాసముంటున్నారు. సూరిబాబు ప్రస్తుతం మానవపాడు మండలం పుల్లూరు గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు. సూరిబాబుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. రంజిత్‌కుమార్ అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రంజిత్‌కుమార్ కోమాలో ఉన్న పరిస్థితిలో నుంచి ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. రంజిత్‌కుమార్‌కు గత ఏడాది నవంబర్‌లో వివాహమయింది. ప్రస్తుతం భార్య శిల్పా కూడా అమెరికాలోనే ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి